తోట లో వికసించిన హక్కుల నేత
రవికుమార్ మాస్టర్ కి హక్కుల ఉద్యమ జోహార్లు.
రవి కుమార్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడు తు ఈ రోజు ఉదయం మరణించారు అనే విషాద వార్త ను బాధా తప్త హృదయం తో తెలియచేయటానికి చింతిస్తున్నాను.ఆయన మరణం ప్రజాస్వామిక ఉద్యమాలు కి పౌర హక్కుల ఉద్యమానికి నష్టం.
ఆయన ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పౌర హక్కులు సంఘం లో ఒక ముఖ్యమైన నాయకుడు గా ఉన్నాడు. గతం లో రెండున్నర సంవత్సరం ల పాటు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గా పనిచేశారు.ఆయన టీచర్ గా పని చేసిన కాలం లో APTF లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఉపాద్యాయులు హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేశారు. దానికే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమాలు తో మమేకం అయ్యేవారు. సమాజం లో ఉన్న అసమానతలు పోవాలని కోరుకున్నారు.
ఆ మేరకు ఆ ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. MEO గా పదోన్నతి పొంది నిజాయితీగా MEO పోస్ట్ ఎలా నిర్వహించాలో చేసి చూపించారు.ఆయన పదవి లో ఉన్న సమయం లో టీచర్లు చాలా సంతోషించారు. MEO గా రిటైర్డ్ అయిన తర్వాత పౌరహక్కుల సంఘం లో చేరినారు. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ లో గారపాటి ఫున్నెశ్వరరావు, ము త్త రెడ్డి గారు తర్వాత జిల్లా కమిటీలోనికి అంత పెద్దవయస్సు గలవారు వచ్చింది రవి కుమార్ మాస్టర్ ఒక్కరే.
మేధావి వర్గం నుండి హక్కుల సంఘం లోనికి వచ్చిన మాస్టర్ పెద్ద అండ గా జిల్లా కమిటీ లో ఆయన పని చేశారు.ఆయన సలహాలు,చూచనలు సూత్ర బద్దం ఉండేవి.జిల్లా లో కమిటీ సమావేశాలకు, సభలకు కు గంట ముందే హాజరు అయ్యేవారు. జిల్లా అధ్యక్షుడు గా ఆయన ఉన్న కాలం లో వారానికి ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం నాకు ఫోన్ చేసి వార్తలో వచ్చిన విషయాల గురించి చర్చించేవారు. మనం ఏమి చెయ్యాలి కార్యక్రమం అని అడిగేవారు. కమిటీ నిర్ణయాలకు కట్టుబడి పని చేయటం,భాద్యులు చూచనలు పాటించటం,ఆయన అభిప్రాయాలను సూటిగా చెప్పటం ఆయనలో ఉన్న ప్రత్యేక లక్షణం. చిన్నవాళ్ళు అయిన పెద్దవాళ్ళు అయిన ఎవరిని అయిన ఏమండీ, గారు అనే సభోధించేవారు. ఎదుటి వారిని గౌరవించడం ఆయన ప్రాధాన్యత లో ఒకటి. సౌమ్యుడు. మితభాషి.
ఆయన ప్రధానం గా రైతాంగం స్థితి గతుల పైన, బడుగు బలహీన వర్గాలు జీవితాల గురించి తీవ్రంగా మదనపడేవారు. వారి గురించి నాతో మాట్లాడే టప్పుడు చలించే వారు. మనం సంతోషం బతికితే సరిపోదు అందరు సంతోషం గా ఉండాలి. ఈ అసమాన సమాజం లో అందరి కి సమ్మానా విలువలు, గౌరవం కావాలని పరితపించే వారు. ఆ భావాలే ఆయన్ని హక్కుల సంస్థలో కి తీసుకు రాగలిగినవి. మానవీయ విలువలు గలిగిన రవికుమార్ మాస్టర్ ని కోల్పోవడం పౌర హక్కుల సంఘానికి, ప్రజాస్వామికి ఉద్యమాలకు నష్టం. ఆయన ఆదర్శ ప్రాయుడు. ఆయనకు జోహార్లు తెలియ చేస్తున్నాను.ఆయనకు సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి ని తెలియ చేస్తున్నాను
ఇట్లు
నంబూరి.శ్రీమన్నారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ.
Comments
Post a Comment