అసమాన సమాజంలో అసాధారణ వ్యక్తి - 6




శేషయ్య పరిణితిని అతని ఉపన్యాసాలలో ఎక్కువ గమనించవచ్చు. ప్రతి సామాజిక అంశంపై అతనికున్న సునిశితమైన దృష్టి, అపార అనుభవం అతన్ని గొప్ప నాయకుడ్ని చేసింది. దళితుల సామాజిక, రాజకీయ పరిస్థితులలో చాలా మార్పులను పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ రూపంలో నివేదించింది. దళితులపై జరుగుతున్న కుల దాడులకు, భయంకరమైన దారుణానికి చారిత్రక సందర్భాన్ని ఇచ్చిన ఘటనలకు చాలా ఉన్నాయి.  భారతీయ సమాజంలో మార్పులేని వాస్తవికతగా కులం వుందని, దళిత సమాజం కర్మ పరిమితుల నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పుడు అగ్ర కుల ఆగ్రహం  ప్రత్యేక వ్యక్తీకరణగా మారుతుందని శేషయ్య అనేవారు. కర్ణాటకలోని కంబలపల్లి (2000), మహారాష్ట్రలోని ఖైర్లాంజీ (2006), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట ఇదే అంశాన్ని రుజువు చేశాయి. 

కందమహల్‌ సంఘటనలో శేషయ్య చాలా ముఖ్యమైన అంశాన్ని గమనించాడు.  దళితుల్లోని రెండు వర్గాల మధ్య చారిత్రక చీలికలను సంఘ్‌ పరివార్‌ ఎలా పెంచి పోషిందో చెప్పాడు. దళిత సమాజం క్రైస్తవ గిరిజన సమాజంపై దారుణమైన దాడికి పాల్పడటాన్ని వివరిస్తూ పౌరహక్కుల సంఘం నిజ నివేదికను విడుదల చేసింది. క్రిస్టియన్‌ సమాజంపై ద్వేషాన్ని ప్రేరేపించడంలో సంఘ్‌ పరివార్‌ పోషించిన పాత్ర గురించి  ఈ నివేదిక స్పష్టంగా పేర్కొంది. జంతువుల కన్నా హీనంగా చూడబడుతున్న వారిని  హక్కులు మనుషులను చేస్తాయి.  అందువల్ల కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కింది వర్గాల్లోనే ఇంకా అణచబడుతున్న వారి హక్కుల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడవలసి వస్తుందని ఆయన చెప్పాడు. 

ఘర్‌వాపసీ పేరుతో జరుగుతున్న దళితుల హక్కుల         ఉల్లంఘణలను ఆయన చెప్పాడు. క్రైస్తవ మతాన్ని త్వజించే సరళమైన చర్యను ఉల్లంఘించినవారు గ్రామాల నుండి గెంటివేయబడ్డారు.  గ్రామాలకు తిరిగి వెళ్ళడానికి  ఘర్‌వాపసీ అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే గ్రామంలోకి తిరిగి ప్రవేశించడానికి బజరంగ్‌ దళ్‌ కొన్ని షరతులను విధిస్తుంది. హిందూ మతంపై వారి విశ్వాసం  ఇళ్లకు తిరిగి రావడానికి వీలు కల్పిస్తుంది. వారి విశ్వాసాన్ని వారి హక్కులను అగౌరపరచడం ద్వారా సంఘపరివార్‌ నాశనం చేస్తుంది. వారు స్వేచ్ఛగా ఎంచుకున్న ప్రతిదాన్ని వారు కోల్పోతుంటే  అదే గొప్ప గౌరవంగా కీర్తించబడుతుంది. మానవ స్వభావంలో వున్న నిర్వచించలేని సున్నితమైన అంశాలలో వున్న క్లిష్టతను ఆయన సులభంగా అర్ధం చేయించేవాడు.  గ్రామాలకు తిరిగి వచ్చినవారి మానవ ఉనికిని కేవలం జంతు ఉనికి కంటే మంచిదనే భావనను వారిలో నెలకొల్పుతుంది. తిరిగి గ్రామాలకు వాళ్లను వెళ్లనిస్తున్న శక్తులే వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆయన చెప్పాడు. మానవ హక్కులు నిజంగా మానవులు తమను తాము వ్యక్తీకరించే మార్గాలకు చట్టపరమైన రక్షణకు ఒక రూపం మాత్రమే అని ఆయన అనేవారు. 

నిజ నిర్దారణ నివేదికలు కేవలం హక్కుల ఉల్లంఘన చరిత్రను  మాత్రమే నమోదు చేయడం లేదని, హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాట చరిత్రను నమోదు చేస్తుందని ఆయన చెప్పాడు. నిజ నిర్దారణ నివేదికల సారం ఏంటంటే, న్యాయం పట్ల లోతైన నిబద్ధతతో వుండి,  మానవత్వంతో, ప్రజాస్వామ్యంతో కూడిన  ఆలోచనలను రక్షించడం. అలాగే రాజ్యాంగబద్ద పరిపాలన పేరుతో జరుగుతున్న  హింసాత్మక పాలనను ప్రజలకు తెలియచెప్పడం. 

హిందూ ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో హక్కుల సంఘాలు మరింత పకడ్బందీగా పనిచేయాలని ఆయన చెప్పాడు. రాజకీయ, సామాజిక ఆర్ధిక న్యాయం, భయం  నుండి స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ, నమ్మకం, అభ్యాసం, వ్యక్తికి కావలసిన అజేయమైన గౌరవం, సమానమైన వద్ధికి అవకాశాలు వీటన్నిటిపై సరైన దృష్టితో పౌరహక్కుల పోరాటం వుండాలని చెప్పేవాడు. సమాజాలు సమానత్వం పునాదిపై నిర్మించబడాలని ఆయన  చెప్పేవాడు.  అందుకే సుప్రీంకోర్టును, న్యాయమూర్తుల పక్షపాత ధోరణిని  నిశితంగా విమర్శించేవాడు. 

టాడా రాజ్యాంగ ప్రామాణికతను సమర్థించిన సుప్రీంకోర్టు పౖౖె ఆయన చేసిన తీవ్రమైన విమర్శ పుస్తకాల రూపంలో వచ్చింది. రాజకీయ వ్యక్తీకరణ హక్కును అర్థం చేసుకోలేకపోతున్న న్యాయస్థానాలను,  ప్రజాస్వామ్య వ్యవస్ధ హదయంగా భావించలేమని ఆయన చెప్పాడు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉగ్రవాదులు ఎవరంటే  పంజాబ్‌లోని సిక్కులు, కాశ్మీర్‌లోని ముస్లింలు, ఈశాన్యంలోని గిరిజన ప్రజలు, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ భారతంలో అణగారిన వర్గాలు, తమిళనాడుకు జాఫ్నా నుండి వలస వచ్చిన తమిళులు, ఇటీవలి రోజుల్లో వివిధ పట్టణ కేంద్రాలలో నిరుద్యోగులైన ముస్లిం యువత. వీరంతా భారతీయ సమాజంలో రాజకీయ, సామాజిక, ఆర్ధిక అంచులకు నెట్టివేయబడ్డవారు.'ఉగ్రవాద' నేరాలలో అనుమానితులకు హక్కులు నిరాకరించడం తగదని ఆయన చెప్పాడు. 

రాజకీయ, సామాజిక అవగాహనతో పాటు చట్టపరమైన తార్కిక జ్ఞానాన్ని        ఉపయోగించి ఆయన శక్తివంతమైన వాదన చేసేవాడు. పౌరహక్కుల క్రియాశీలతను అర్ధంచేసుకున్న అనుభవజ్ఞుడైన అభ్యాసకుడు.  వాస్తవాలపై దగ్గరి దష్టి పెట్టాలని, సమాచారాన్ని సేకరించడానికి, జరుగుతున్న సంఘర్షణ  మూలాన్ని గుర్తించాలని ఆయన చెప్పాడు. రాజ్యహింస, ఆధిపత్య వర్గాల క్రూరత్వం ఎంత ప్రమాదకరమో, అలాగే  సామాజిక ఉదాసీనత కూడా అత్యంత ప్రమాదకరమని ఆయన చెప్పేవాడు. హక్కుల చైతన్యం ప్రజలకు చాలా అవసరమని చెపుతూ హక్కుల కార్యకర్తలు నిరంతరం అభ్యసించాలని చెప్పాడు.  

పౌర హక్కులను అర్ధం చేయించడంలో శేషయ్య కృషి అపారమైనది. హక్కుల ఉల్లంఘనను గుర్తించడం,  హక్కుల చైతన్యాన్ని  ప్రచారం చేయడం, సుప్రీంకోర్టు అధర్మ తీర్పులను విమర్శించటం,  హింసించబడ్డ వారి తరుపున నిలబడి మాట్లాడటం ఆయన నాలుగు దశాబ్దాలుగా చేశాడు. 

మానవ హక్కుల ఉద్యమాలు ఇతర సామాజిక ఉద్యమాల నుండి స్వతంత్ర ఉనికిని కలిగి ఉన్నాయనడానికి బాలగోపాల్‌ జీవితం, అతని పనివిధానం  నిదర్శనం. ఈ సిద్ధాంతం నుండి, న్యాయమైన విచారణ హక్కు, ఏకపక్ష చర్యల నుండి స్వేచ్ఛ వంటి మానవ హక్కుల  ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యమం కూడా విమర్శించబడాలని ఆయన చెప్పాడు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ శేషయ్య నిలబడ్డాడు. హింస, అహింస ప్రశ్నపై, శేషయ్య చేసిన విశ్లేషణపైనే పౌరహక్కుల సంఘం కార్యాచరణ నడుస్తోంది. 

హక్కులు ఎక్కడ నుండి పుట్టుక వచ్చాయనే తాత్విక ప్రశ్నను వేసుకుంటే అవి పోరాటాల ఉత్పత్తిగా అర్ధమౌతాయి. శేషయ్య చెప్పినట్లు పౌర హక్కుల ఉద్యమం తన చారిత్రిక గతి అభివృద్ది వైపే నిరంతరం పయనించింది. దీనికి కారణం ప్రజా ఉద్యమాలు. అంతే కాకుండా  పౌరహక్కుల సంఘం అనేక సిద్ధాంత వైరుధ్యాలను ఎదుర్కుంది. ఏ విషయాలను అయినా కూలంకుషంగా చర్చించడానికి సాధారణ కార్యకర్తలకు కూడా అవకాశం కలిపించింది. నిజానికి అంతర్గత చర్చలు ఎప్పుడూ కూడా  సంఘ కార్యాచరణను దెబ్బతీయలేదు.ఈ విషయాన్ని బాల్‌గోపాల్‌ గారు కూడా అంగీకరించారు. 

 మైనారిటీ, మెజారిటీ అభిప్రాయానికి కట్టుబడటం వల్లే ఇది సాధ్యమయింది. పౌర హక్కుల క్రియాశీలత సమయంలో ఎదురయ్యే  సందిగ్ధాల పరిష్కారాలు పోరాడే ప్రజల దగ్గర లభిస్తాయని ఆయన చెప్పేవారు. పోలీసు లాక్‌ అప్‌లో రాజకీయ ఖైదీల హింసను నివారించడమే లక్ష్యంగా సంఘం పనిచేయడం మొదలుపెట్టింది. 

ప్రారంభంలో పోలీసులు ఎగతాళి చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయమని కోరుతూ ఒక పోలీసు స్టేషన్‌కు వచ్చినప్పుడు పోలీసులు కొన్ని ప్రశ్నలను వేసేవారు. లాకప్‌లో రాజకీయ ఖైదీతో పాటు, మరో పది మంది ఇతర వ్యక్తులు లాక్‌ అప్‌లో ఉన్నారు, వారిని విడుదల చేయమని ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించేవారు. నిజానికి రాజ్యం హక్కుల ఏకపక్షతను బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపుతుందని శేషయ్య అనేవారు. హక్కుల సంఘం ఖచ్చితంగా హక్కులు కోల్పోబడ్డ ప్రజల పక్షపాతిగా వ్యవహరించాలని శేషయ్య నిక్కచ్చిగా చెప్పేవాడు. రాజ్యహింస ఎవరిమీద చేసినా తప్పే అని సంఘం వాదించడానికి ప్రారంభకాలంలో కొన్ని సంవత్సరాలు పట్టింది. హక్కుల పరిధి విస్తరించినప్పుడల్లా సంఘం అనేక నిర్భంధాలను, కష్టాలను, ప్రశ్నలను ఎదుర్కునే ముందుకు నడిచింది.  ఏ ఆధిపత్య హింస అయినా తప్పే అనే విస్తృతిని పౌరహక్కుల సంఘం సాధించడం వెనుక శేషయ్య కృషి చాలా వుంది. నిజానికి హక్కుల కార్యకర్తలు పక్షపాత ధోరణితో వుంటారు అనే  పోలీసు భావన హక్కుల విశ్వవ్యాప్తతపై సైద్ధాంతిక స్థానాన్ని చర్చిస్తుంది.

నిరసనను రూపొందించగల ఏకైక మార్గం ఏందంటే అణచివేత సార్వత్రికం చేయబడటం. ప్రస్తుతం జరుగుతున్నదదే.   నేను అణచివేతకు గురవుతున్నాను అనే భావనకు పౌరుడు లోనుకానంతవరకు అతను మాట్లాడలేడు. అణచివేతను ఎదుర్కోవాలంటే   మీరు ఇంకా చాలా మంది ప్రజల కోసం మాట్లాడవలసి ఉంటుంది. ఇది మళ్ళీ దాని స్వంత పరిణామాలను కలిగి ఉంటుంది. సార్వత్రిక విలువల పరంగా నిరసన వ్యక్తం చేయవలసి ఉన్నందున సూత్రప్రాయమైన ఆందోళనల నిరంతర విస్తరణ తప్పదని శేషయ్య చెప్పాడు.  

అందువల్ల హక్కులపై శేషయ్య తాత్విక దక్పథంలో రెండు అంశాలు ముఖ్యమైనవి. హక్కులు పోరాటాల ఉత్పత్తి అని గుర్తించడం,   హక్కుల  చైతన్యాన్ని  ప్రజల ఆకాంక్షల నేపధ్యంలో పెంపొందించుకోవడం.  హక్కుల నైతికతను నిరంతరం విస్తతం చేయగల సామర్థ్యంలో, శేషయ్య ప్రత్యేకమైనవాడు. శేషయ్య కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడం అంటే,   ఆలోచనను, ఆచరణను  కలపడం. హక్కుల చైతన్యాన్ని మరింత  విస్తతం చేయడానికి  సూత్రప్రాయమైన మార్గాలను రూపొందించడమే. 



 

Comments