దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులపై, హక్కుల సంఘాల నాయకులపై, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని,
**UAPAనిరద్దుచేయాలని,రాజకీయ ఖైదీలందర్నీ బేషరతుగా విడుదలచేయాలనే డిమాండ్లతో దేశవ్యాప్తంగా CDRO పిలుపుమేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది.ఆధర్నాలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, పాల్గొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో 90శాంతం అంగవైకల్యం తో బాధపడుతున్న ప్రొ.సాయిబాబా కుజైలు అధికారులు సరైన వైద్యం అందించాలని డిమాండ చేశారు.కనీసం ఆయన కుటుంబ సభ్యులు తెచ్చిన మందులు కూడా ఇవ్వడం లేదన్నారు.రాజకీయ ఖైదీలు మెరుగైన వైద్యం కోసం ఆమరణ నిరాహారదీక్షలు చేయాల్సిన పరిస్థితులపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 21వ తేదినుండి నాగపూర్ సెంట్రల్ జైలులో సాయిబాబా చేయనున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.
Comments
Post a Comment