శేషయ్య సంస్మరణ సభ (కృష్ణా జిల్లా)

ప్రెస్ నోట్, 24.10.2020 విజయవాడ.

తెలుగు నాట బలమైన హక్కుల ఉద్యమ నిర్మాత ప్రొఫెసర్ శేషయ్య.ఆయన మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు లోటు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆవేదన.

 విజయవాడ CLC సంతాప సభలో పలు పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు సంతాపం,  విచారం. కుటుంబ సభ్యులకు సానుభూతి.

    ది24.10.2020 న పౌర హక్కుల సంఘం CLC ఆధ్వర్యంలో అమరుడు హక్కుల ఉద్యమ రద సారధి, మేధావి, న్యాయ శాస్త్ర ప్రముఖులు,


న్యాయవాది ప్రొఫెసర్ శేషయ్య సంతాప సభ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగింది. సభ ముందుగా అమరుడు శేషయ్య కి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా సంతాపం తెలిపింది. ఈ సంతాప సభ కి రాష్ట్ర సహాయ కారదర్శి T. ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్త గా హాజరైన CLC ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ బలమైన హక్కులు ఉద్యమ నిర్మాత శేషయ్య మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు అని ఆవేదన చెందారు. ప్రజల సంపద అయిన సహజ వనరులను కార్పొరేట్స్ కి కట్టపెట్ట టానికి, ప్రజా ఉద్యమాలు,ఆదివాసీల  అణచివేత కు కేంద్ర ప్రభుత్వం  ఆపరేషన్ గ్రీన్ హంట్ తీసుకు వచ్చినప్పుడు  ప్రజాసంఘాల ఐక్య సంఘటనకు తీవ్రంగా కృషి చేశారు అని అన్నారు. ఆయన మరణం చాలా బాధాకరం అని అన్నారు.

      కులనిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యం సహచరులు పై దాడి చేసి వేటకొడవల్ల తో నరికిచంపిన బెదరకుండా, భయపడకుండా హక్కుల ఉద్యమాన్ని నడిపించిన ధీశాలి అని అన్నారు. ఆయన బాట లో హక్కుల సంఘ శ్రేణులు పనిచేయాలి అని అన్నారు. 

   విరసం రాష్ట్ర అధ్యక్షులు ఐరాస వెల్లి కృష్ణ మాట్లాడుతూ దేశంలో ప్రజల హక్కులు  పాసిజం వలన ప్రమాదం లో పడిన సమయంలో శేషయ్య లాంటి మేధావులు మరణించడం చాలా బాధను కలిగిజతుంది అని కనుకోణాల నుండి వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టుకుని సంతాపాన్ని ప్రకటించారు. 

     IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పొలారి మాట్లాడుతూ హక్కుల యోధుడు శేషయ్య మరణం పూడిచి లేనిది అన్నారు. బలమైన హక్కుల 7ద్యమం నిర్మాణం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని ఆయనకు ఘనం గా జోహార్లు తెలిపినారు.
   
 PDSU రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి హక్కుల కోసం పోరాడిన శేషయ్య గార్కి జోహార్లు అర్పించారు.

 Pks బి కొండా రెడ్డి PDM y. వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ కార్మికవర్గం హక్కుల కోసం బలం గా తన గొంతుకను వినిపించారు అని అన్నారు. ఆ యోధునికి జోహార్లు తెలిపినారు. Opdr భాస్కర్ రావు ,Hrf నాయకులు రోహిత్, మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా హక్కుల ఉద్యమ నిర్మాణం లో కీలక పాత్ర పోషించారని అన్నారు.
  
PKM కోటి మాట్లాడుతూ  కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని బతికిన అమహామం8షికి నివాళి అర్పించారు.  POW, CMS మహిళా సంఘాల నాయకులు గంగా భవాని, రాధ మాట్లాడుతూ మహిళ ల హకుల కోసం గలమెత్తి న మేధావి ప్రొఫెసర్ శేషయ్య అనిఅన్నారు.జోహార్లు తెలియ చేశారు.
  Opdr కోటేశ్వరావు మాట్లాడుతూ హక్కుల ఐఖ్య కార్యాచరనుకు కృషిచేసిన మేధావి శేషయ్య కి జోహార్లు తెలిపినారు. 

పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాఢ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ సాయుధ,నిరాయద ఉద్యమాలు లోను ప్రజాస్వామిక డిమాండ్ల కు,ప్రజలు జీవించే హక్కుల కోసం నిత్యం పరితపిస్తూ పోరాడిన హక్కుల ధ్రువతార ప్రొఫెసర్ శేషయ్య అన్నారు. సంతాప సభకు  విచ్చేసిన ప్రజకు,పౌర హక్కుల సంఘాలకు, ప్రజా సంఘాలు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
  
  ఇంకా ఈ సంతాపసభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు రాయల శ్రీధర్, గంగాధర్,విగ్నేష్, IAPL శ్రీనివాస్, pow రాష్ట్ర నాయకురాలు P. పద్మ, PDSU రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, తదితరులు పాల్గొని ప్రసంగించారు.

                  ఇట్లు
     నంబూరి. శ్రీమన్నారాయణ
          రాష్ట్ర ఉపాధ్యక్షుడు
      పౌర హక్కుల సంఘం.
       ఆంధ్రప్రదేశ్ కమిటీ.
     24.10.2020

  గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ విజయవాడ

Comments