ప్రచురణార్థం. తేదీ 22-10-2020 జంగారెడ్డిగూడెం.
హక్కుల ఉద్యమ నేత. ప్రొఫెసర్ శేషయ్య సంతాప సభ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగింది., ఈ సంతాప సభ కి జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది భాష శ్యాం బాబు అధ్యక్షత వహించారు ముందుగా రెండు నిమిషములు మౌనం పాటించడం జరిగింది, ఈ సభ కీ ముఖ్య వక్తగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది, నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ సాయుధ ఉద్యమాలు, నిరాయుధ ఉద్యమాలు లోని ప్రజలు ప్రజాస్వామిక డిమాండ్లకు, జీవించే హక్కు కోసం అండగా నిలబడిన వారు . హక్కుల నేత ప్రొఫెసర్ శేషయ్య అని అన్నారు ఆయన మరణం హక్కుల ఉద్యమానికి ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని నష్టం అన్నారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు జోహార్లు తెలియజేశారు ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు.
ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమాల పై రాజ్యం యన్.టి.ఆర్ బంధం అణిచివేత హింస పెరిగిన పరిస్థితులలో శేషయ్య గారి మరణం తీవ్ర బాధాకరం అన్నారు.
ఈ సభలో IFTU జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ సంస్కరణలు తీసుకు రావడం ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోందని ఆయన అన్నారు కార్మికుల హక్కుల కోసం గళమెత్తి ఉద్యమించాలని గుర్తు చేశారు ప్రొఫెసర్ శేషయ్య గారి ఉద్యమ స్ఫూర్తి ఆదర్శప్రాయమైన ఆయన అన్నారు.
PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులకోసం విద్యార్థుల విద్యా హక్కుల కోసం ప్రొఫెసర్ శేషయ్య గారు పనిచేశారని కొనియాడారు. KVPS జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్. న్యాయవాది ఇది బి.వెంకటేశ్వరరావు. మాట్లాడుతూ పౌర స్వేచ్ఛ కోసం పనిచేసి మేధావి ప్రొఫెసర్ శేషయ్య మరణం ఉద్యమాలకు తీవ్ర నష్టం అన్నారు ఆయనకు ఘనంగా జోహార్లు అర్పించారు.
ఈ సభలో PYL నాయకులు పోతిరెడ్డి తగరం బాబురావు, POW నాయకులు కె అరుణ E రోజా. AIKMS నాయకులు అర్జా ధర్మారావ rampala రాజు , PDSU నాయకులు ఈ భూషణం తగరం ప్రశాంత్ బన్నీ వినోద్ కిరణ్, పౌర హక్కుల సంఘం సభ్యులు సిహెచ్ కృష్ణ చిన్నారెడ్డి మంగి రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సాయిబాబాకు దీక్షకు మద్దతుగా
పశ్చిమ గోదావరి జిల్లా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఖైదీల హక్కులకు కోసం జైలులో లో ప్రొఫెసర్ సాయిబాబా చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా జంగారెడ్డిగూడెం లో ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ 90 శాతం వికలాంగులు అయినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా పైన అక్రమంగా కేసు బనాయించి ఆయన్ని జైల్లో నిర్బంధించారని అన్నారు జైలు నియమ నిబంధనలను సైతం పాటించకుండా తీవ్రమైన హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు మందులు సైతం ఆయనకు ఇవ్వకుండా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని ఇది జైలు ఖైదీల హక్కులకు విరుద్ధమని తెలిపారు కుటుంబ సభ్యులను న్యాయవాదులను సైతం కలవకపోవడం ఖైదీల హక్కులకు వ్యతిరేకమని అన్నారు రచన సాయిబాబా కె విధించిన శిక్షను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసి ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సమయంలో భీమ్ కోరేగావ్ ఎత్తివేస్తామని ప్రకటించారని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు న్యాయవాది బర్రె వెంకటేశ్వరరావు, పిడిఎస్యు నాయకులు రామ్మోహన్ భూషణం, ఏ ఐ కే ఎం ఎస్ నాయకులు అర్జా ధర్మారావు, పి వై ఎల్ నాయకులు కెచ్చల పోతిరెడ్డి పౌరహక్కుల సంఘం నాయకులు చింతల కృష్ణ ,సోమరాజు, చిన్నారెడ్డి ,మంగి రెడ్డి, pow నాయకులు అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
B శ్యాం బాబు న్యాయవాది.
పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
Comments
Post a Comment