ప్రెస్ మీట్ ఏలూరు 21.10.2020
పౌర హక్కుల సంఘం CLC పశ్చిమగోదావరి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం teliconference లో జరిగింది. ఈ teliconference సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ రాష్ట్ర కమిటీ నుండి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు N. v రత్నం,కార్యదర్శి k. v. రత్నం,ఉపాఢ్యక్షులు బి.శ్యాం బాబు, సహాయ కార్యదర్శి ch కృష్ణ, కోశాధికారి కెచ్చెల చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా ఇటీవల చనిపోయిన పౌర హక్కులు నేత ప్రొఫెసర్ శేషయ్య గార్కి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజల హక్కులను ప్రశ్నించే ప్రతి పౌరుడు పైన నిర్బంధం,హింస కోన సాగుతుంది అన్నారు. ఆఖరికి ఖైదీల హక్కులు కూడా హరించబడుతున్నాయి అని ప్రొఫెసర్ G. N. సాయి బాబా పరిస్థితి గురించి ఆవేదన చెందారు. 90%వికలాంగుడు అయిన సాయి బాబా కి మందులు ఇవ్వక పోవడం, తగిన సౌకర్యాలు కల్పించక పోతే ఎలా బ్రతుకుతాడు అని ప్రశ్నించారు. తక్షణం చట్ట ప్రకారం ఖైదీల కు ఉన్న హక్కులు అమలు పరచాలని అన్నారు. ఆయన జీవించే హక్కులు పరిరక్షించేందుకు రాష్ట్ర పతి మరియు uno అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశం ఈ క్రింది తీర్మానాలు చేసింది.
1.జైలులో ప్రొఫెసర్ సాయి బాబా ఖైదీల హక్కుల కోసం జరుపుతున్న శాంతియుత దీక్ష కి మద్దతు తెలియచేయటం జరిగింది ప్రొఫెసర్ సాయి బాబా పై కేసును ఎత్తివేసి విడుదల చెయ్యాలి.
2 భీమ్ కోరేగావ్ కేసులో అరెస్ట్ చేసిన మేధావుల పై పెట్టిన కేసు ఎత్తివేసి విడుదల చెయ్యాలి
3.వ్యవసాయ రంగం లో తెచ్చిన 3 బిల్లులు వ్యవరంగానికి ఉపయోగకరమైనవి కావు అని రైతాంగం చేస్తున్న ఆందోళన కి మద్దతు తెలియచేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ 4 బిల్లులను రద్దు చెయ్యాలని సమావేశం డిమాండ్ చేయటం జరిగింది.
4.రాష్ట్రంలో ఇళ్ళ స్థలాలు కోసం రైతులు దగ్గర తీసుకున్న భూములు కి డబ్బులు చెల్లించండి ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం లోఇళ్ల స్థలాలు కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారా అని గత 4 నెలల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ 4 నెలలో ఒక పంట రైతులు చేతికి అందేది. ఇటు పంట లేక అటు ప్రభుత్వం డబ్బులు ఇవ్వక ఎకరం రెండు ఎకరాలు మాత్రమే ఉన్నరైతులు డొక్క చేతపట్టుకుని అల్లాడి పోతున్నారు. బిల్లులు పాస్ అయిన రైతుల ఖాతాల్లో డబ్బులు పడటం లేదు తక్షణం సీఎం గారు జోక్యం చేసుకుని ఇళ్లు స్థలాలకు భూములు యిచ్చిన రైతులను ఆదుకోవాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
5. భవన నిర్మాణ కార్మికులు కి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 10 వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని తక్షణం అందించాలి.
6. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పంటల వలన నష్ట పోయిన రైతులకు పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి.వ్యవసాయ కూలీ లకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదు కోవాలి.
రాష్టానికి కేంద్రం ఇవ్వవలసిన నిధులు,బకాయిలు తక్షణం విడుదల చెయ్యాలి. తుపాన్లో నష్టపోయిన వారిని పూర్తిగా ఆదు కోవటాని తక్షణం 2వేల కోట్లు విడుదల చెయ్యాలి.
పై డిమాండ్లు ని సమావేశం ఆమోదిస్తూ తీర్మానం చేసింది.
ఇట్లు
నంబూరి. శ్రీమన్నారాయణ.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు
N. v. రత్నం
జిల్లా అధ్యక్షుడు
కె. వి. రత్నం.
జిల్లా ప్రధాన కార్యదర్శి.
పౌర హక్కుల సంఘం CLC.
Comments
Post a Comment