శేషయ్య సంస్మరణ సభ (పశ్చిమ గోదావరి జిల్లా)

ప్రెస్ నోట్, 18.10.2020 ఏలూరు
.................................................
  హక్కుల నేత సి డి ఆర్ ఓ జాతీయ నాయకులు, పౌర హక్కుల సంఘం  ఉభయ రాష్ట్రాల కన్వీనర్ ప్రొఫెసర్ s శేషయ్య సంతాప సభ పశ్చిమ గోదావరి జిల్లా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ సంతాప సభ కి పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది కె.వి రత్నం అధ్యక్షత వహించారు .

పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ శేషయ్య గారి మరణం పౌర ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు ప్రొఫెసర్ శేషయ్య హక్కుల ఉద్యమం పట్ల జీవితకాలం అంకితభావంతో పని చేశారని అన్నారు ఆయన సౌమ్యులు, మృదుభాషి మేధావి అన్నారు రాజ్యం అణచివేత నిర్బంధం హింస పెరుగుతున్న తరుణంలో హక్కుల మేధావి శేషయ్య మరణం పూడ్చలేనిది అని ఆవేదన చెందారు. రాజ్య హింస కి వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన హక్కుల కోసం పని చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు 

రాష్ట్ర కోశాధికారి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమానత్వం కోసం పీడిత ప్రజల హక్కులకు అండగా ప్రొఫెసర్ శేషయ్య పనిచేశారని అన్నారు ఆయన జీవితాంతం కార్మిక వర్గం శ్రామిక వర్గం కి సమాజంలో సమానమైన విలువ కావాలని పోరాటం చేశారు అని అన్నారు. కార్మికవర్గం హక్కులు ని కేంద్ర ప్రభుత్వం కబలించినన్నప్పుడు కార్మిక చట్టాల సవరణ కార్మికుల వ్యతిరేకంగా చేసినప్పుడు కార్మికుల పక్షాన నిలబడి తన గొంతుక వినిపించారని తెలియజేశారు హక్కుల సంఘం కార్యకర్తలు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు

     Pks    నాయకులు పీ. కనీకి  రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీలు దళితులు మహిళలు ఉద్యోగులు కార్మికుల హక్కుల కోసం ఆయన నిరంతరం పని చేశారని కొనియాడారు ఆయన మరణం బాధాకరమని తెలిపారు ఉద్యమంలో ఆయన లేని లోటు పూడ్చ లేనిదని అన్నారు

 పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు కే నాని మాట్లాడుతూ విద్యార్థులకు సామాజిక దృక్పథంతో బోధన చేసే వారని అన్నారు అలాంటి హక్కుల ఉద్యమ నేత లేకపోవడం సమాజానికి తీవ్ర నష్టమని అన్నారు పి డి ఎస్ యు జోహార్లు తెలియజేస్తుందని తెలిపారు

 ఈ సంతాప సభ అధ్యక్షులు పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది కె.వి . రత్నం మాట్లాడుతూ తుది ఉపన్యాసం చేశారు. నిర్బంధాన్ని ఎదుర్కొని ధైర్యం గా హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేశారని కొనియాడారు ఆయన మరణం వలన తీవ్ర విషాదాన్ని హక్కుల ఉద్యమానికి మిగిలింది అన్నారు. సభ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రారంభమైనది  సభకు హాజరైన టువంటి ప్రజలు ప్రొఫెసర్ శేషయ్య కి జోహార్లు, ఆయన ఆశయాలను సాధిస్తాం అని నినాదాలు చేశారు ఈ సభకు అత్యధికంగా ప్రజలు హాజరయ్యారు

 ఈ సంతాప సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కాకర్ల అప్పారావు iftu జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రావు iftu జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు కోరాడ అప్పారావు రమణ పల్లి గంగరాజు జనార్ధన్ పి డి ఎస్ యు నాయకులు ఎస్ కె ఇమ్రాన్ క్రాంతి, పౌరహక్కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

 ఇట్లు 
కె.వి రత్నం
 జిల్లా ప్రధాన కార్యదర్శి
 పౌర హక్కుల సంఘం 
పశ్చిమ గోదావరి జిల్లా 18.10.2020

Comments