శేషయ్య సంస్మరణ సభ (కడప జిల్లా)

పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ శేషయ్య గారి సంస్మరణ సభ కడప జిల్లా శాఖ 17/10/2020 న రాయచోటి NGO హోమ్ ఉదయం 11.00 నుండి 01.30 వరకు జరిగినది.ఈసమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శేషయ్య గారు విద్యార్థి దశ నుండి ప్రగతి శీల భావాలు అలవర్చుకొని సమాజంలో జరుగుతున్న అసమానతలను రూపు మాపడానికి కృషి చేశాడు..అనంతపురంలో డిగ్రీ, తిరుపతి S.V.యూనివర్సిటీ లో మాస్టర్ లా పూర్తి చేసుకొని అనంతపురం  శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ లో అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా విద్యార్థులకు పాఠ్యాంశా లే గాక సమాజం లో ఉన్న అసమానతలు గురించే చర్చించే వాడు ,ఆవిధంగా సమాజం పట్ల భాద్యతతో ఉండాలని బోధించేవాడు.

ఆయన 1983 లో పౌర హక్కుల సంఘం లో కార్య కర్తగా చేరి అనంతపురం జిల్లా కార్యదర్శి గా,రాష్ట్ర సహాయ కార్యదర్శి గా, ఉపాధ్యక్షుడు గా కొనసాగుతూ ,పౌర హక్కుల సంఘం సంక్షోభ సమయంలో 1998 లో రాష్ట్ర ప్రధాన కార్య దర్శి భాద్యతలు చేపట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లా కమిటీ లను నిర్మాణ పరంగా పటిష్ట పరిచాడు ,ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పట్ల ప్రస్నిచడం చేశారు...రాష్ట్ర కమిటీలోని నాయకులకు ప్రాంతాల వారిగా బాధ్యతలు అప్పచెప్పి కార్య క్రమాలలో భాగస్వామ్యం చేసేవాడు.దేశంలో అన్ని పౌర,ప్రజాస్వామిక హక్కులను ఒకతాటి పైకి తెచ్చి  కో ఆర్డినేషన్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ (CDRO) కు జాతీయ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి పౌర హక్కుల సంఘాన్ని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప మేధావి,ఆయన దేశవ్యాప్తంగా తిరిగి ప్రాంతీయ ఉద్యమాలను,జాతుల సమస్యలను ప్రజాస్వామిక ఉద్య మాలకు పూర్తి మద్దతు ఇచ్చారని కొనియాడారు...ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రతి సందర్భంలో ను ప్రజలకు అండగా నిల బడ్డాడు.

ఆ క్రమంలో నే నిర్బంధం ఎదుర్కొన్నాడు,అయినా బెదరక పౌర హక్కుల కార్య కర్తలకు ధైర్యాన్ని ఇస్తూ స్ఫూర్తి దాయకంగా నిలిచి సంఘాన్ని దిశా,దశా చూపాడు. ఈ క్రమంలో నే ఆయన ఆరోగ్యం దెబ్బతిని కోవిద్ కు గురి అయి చికిత్స పొందుతూ 10/10/2020 న మరణించారు..ఈయన మరణం భారత దేశ పీడిత ప్రజానీకానికి తీరని లోటని,అంతేగాక పౌర హక్కుల సంఘం ఒక దిక్షూసిని ,పెద్ద దిక్కును కోల్పోయింది,శేషయ్య గారి ఆకాంక్షలను,ఆశయాలను ఆచరణల ను ప్రజల్లోకి తీసుకెళ్ళి బలమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించిన పుడే ఆయనకు మనమిచ్చే ఘన మైన నివాళులు అని కొనియాడారు.

 .    విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యు రాలు వరలక్ష్మి మాట్లాడుతూ శేషయ్య సార్ తో తనకున్న పరిచయంలో తను గొప్ప మానవతావాది,ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అవపోసన పట్టిన మేధావి,అలుపెరుగని పోరాట యోధుడు అని,మృదు   బా షి,సౌమ్యుడు అని కొనియాడారు.
  శేషయ్య సార్ సహాధ్యాయులు ,ఆయనతో విద్యార్థి దశలో పోరాటాల్లో ఉన్న మిత్రుడు రిటైర్డ్ ఎస్సీ కార్పొరేషన్ ఈ. డి (కడప) శ్రీ . గోపాల్ గారు మాట్లాడుతూ శేషయ్య ఎస్వీయూ లో LAW మాస్టర్ డిగ్రీ చదువుతుండగా పరిచయ మయ్యాడని ,అప్పట్లోనే అభ్యుదయ భావాలు కల్గిన వారని,స్టూడెంట్స్ సమస్యలపై ,ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పోరాడే వాడని విద్యార్థుల సమస్యలు గాకుండా సమాజంలో జరుగుతున్న అసమానతలు గురించి,వాటిని రూపు మాపెడానికి విద్యార్థులను కూడగట్టి గంటల తరబడి చర్చించే వాడని ఆయన నుండి తమ లాంటి ఎందరో విద్యార్థులు ఎంతో నేర్చు కున్నామని కొనియాడారు.శేషయ్య గారి మరణం పీడిత,తాడిత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రాయచోటి రవి శంకర్,ఉపాధ్యక్షుడు పి. రెడ్డాయ్యా,సహాయ కార్యదర్శి ఏం.రవి శంకర్,కోషాధి కారి వంగిమళ్ల రణయ్య,కార్య వర్గ సభ్యులు వై.పుల్లయ్య ,చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఝాన్సి లక్ష్మి, బి.సి సంఘం నాయకులు రామ చంద్ర,m.r.p.s నాయకులు కేశవ,సీపీఎం నాయకులు రామాంజనేయులు ,శేషయ్య గారి అభిమానులు y. విశ్వనాథ రెడ్డి,వెంకటాద్రి ,ప్రజలు పాల్గొన్నారు..కార్య క్రమానికి ముందుగా శేషయ్య సార్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Comments