శేషయ్య సంస్మరణ సభ (శ్రీకాకుళం జిల్లా)


నాలుగు దశాబ్దాలుగా పౌర ప్రజాస్వామ్య హక్కుల కోసం పీడిత ప్రజల పక్షాన నిల బడి ,తుది శ్వాస విడిచే వరకు దేశ వ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొని అనేక నిర్భాందాలకు ,భూటకపు ఎన్కౌంటర్ లు , అరెస్టులు రాజ్య హింసకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడిన ప్రొఫెసర్  శేషయ్య గారి సంస్మణ సభ బొడ్డుపాడు అమరుల స్మారక మందిరం నందు ఇందు పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ వారు ఘనం గా నిర్వహించి నివాళులు అర్పించారు

పత్తిరి దానేశ్ ఈ సభకు అధ్యక్షత వహించి నడిపించారు . ప్రొఫెసర్ శేషయ్య మరణం పీడిత పజానీకానికి తీరని లోటని ,ఈ సంక్షోభ సమయం లో హక్కుల కై నినదించే గొంతులు అవసరం అయిన ఈ సందర్భం లో శేషయ్య గారి మరణం చాలా బాధాకరం అని ఆయన మాట్లాడారు ,ఆయన ఆశయాలను ఆలోచనలను పౌర హక్కుల సంఘం మరింతగా ముందుకు తీసుకు పోతుందని అన్నారు 

ఈ సభలో kNPS ఉపాధ్యక్షుడు మిస్కా  కృష్ణయ్య DTF పోత ధర్మా రావు, PKM రాష్ట్ర సహాయక కార్యదర్శి నీలకంఠ, pks దుర్యోధన Pdm వీరా స్వామి, ABMS జోగి కోదండ. పోతనపల్లి అరుణ తదితరులు పాల్గొని ఉపన్యసించారు. PKM పాటలు సభను ఉత్సాహ పరిచినాయి.CLC కార్యకర్తల నిర్వహణ లో సభ విజయ వంతంగా ముగిసింది.

Comments