సంస్మరణ సభ
పౌర ప్రజా హక్కుల కోసం పోరాడిన అలుపెరుగని యోధుడు ప్రొఫెసర్ శేషయ్య.
తేదీ:-11-10- 2020, ఆదివారం విశాఖ పట్టణంలో కా'' నీలం రాజశేఖరరెడ్డి నిలయం, అల్లిపురం లో ప్రొఫెసర్ శేషయ్య గారి సంతాప సభ జరిగింది. ఈ సభలో పౌరహక్కుల సంఘం తో పాటు వివిధ ప్రజా సంఘాలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాయి. నలభై సంవత్సరాలుగా పౌరహక్కుల ఉద్యమంలో మొక్కపోని ధైర్యంతో తుది శ్వాస వరకూ ఉద్యమించారని, హక్కుల ఉద్యమానికి ఒక దిక్సూచి గా ముందుండి నడిపించారని, సంధానకర్తగా వ్యవహరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్. కె.పి సుబ్బారావు అన్నారు. ఈ సభలో మార్క్సిస్టు అధ్యయన వేదిక తరపున కె.సత్యనారాయణమూర్తి వ్యక్తిస్వేచ్ఛ , భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్న సమయంలో శేషయ్య గారి మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు.
సభలో POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. లక్ష్మి, మహిళా చైతన్య సంఘం నుండి D.లలిత, మహిళా చేతన కత్తి పద్మ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ K. పద్మ, భీంసేన నాయకులు K. చిన్నారవు, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు M.వెంకటేశ్వర్లు, HRF నుండి K. సుధ, IAPLనుండి K.S చలం, భానస రాష్ట్ర అధ్యక్షులు T.శ్రీరామమూర్తి, వర్మ, తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ప్రొఫెసర్ శేషయ్య గారికి ఘన నివాళి అర్పిస్తూ,,,,,
ప్రొఫెసర్ శేషయ్య గారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
రిపోర్టు.
ప్రొఫెసర్ కె.పి. సుబ్బారావు, విశాఖపట్టణం,
11-10-2020.
Comments
Post a Comment