భీమాకొరేగావ్ కుట్రకేసులను ఎత్తివేయాలని, రాజకీయఖైదీలందరిని విడుదల చేయాలని,ఉపా చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ 9-10-20 ఉదయం10గంటలనుండి CDRO ఆధ్వర్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. టెర్రరిస్టులు పై ప్రయోగించే ఉపా చట్టాన్ని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామిక వాదులపై మోపి అక్రమ అరెస్టు లకు పాల్పడుతోందని విమర్శించారు. దేశం గర్వించదగ్గ మేధావులను జైళ్ళలో నిర్బందించి దేశ సంపదను,వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొనేందుకు జైళ్లలో ఉన్న ప్రజాస్వామిక వాదులను విడిపించుకొనేందుకు బలమైన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించటమే మనముందున్న కర్తవ్యమని వక్తలు పేర్కొన్నారు. ఈసమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తోపాటు సహాయ కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు. OPDR నాయకులుCH.సుధాకర్, న్యూడెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, KNPS నాయకులు దుడ్డు వెంకట్రావు, PKM నాయకులు కోటి PDMరాష్ట్ర కార్యదర్శి Y.వెంటేశ్వర్లు, సహాయ కార్యదర్శి వెంకయ్య,మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Nice proposal
ReplyDelete