మార్క్సిస్టు ధృక్పధంలో హక్కుల విశ్లేషణ
వృత్తి పరంగా లా ప్రొఫెసరు కావడం, హక్కుల చైతన్యం పెంపొందించడం కార్యాచరణ కావడంతో శేషయ్య మార్క్సిస్టు ధృక్కోణంలో హక్కులను ఎలా అర్ధం చేసుకోవాలో చాలా సందర్భాల్లో స్పష్టం చేశాడు. హక్కులకి చట్టంలో అధికారిక గుర్తింపు లభించడానికి ప్రజా పోరాటాలే కారణమన్నాడు. ఎందుకంటే హక్కులకు ప్రజల హదయాల్లో నిజమైన గుర్తింపు ఉంది, అందువల్ల హక్కులను గుర్తించకుండా ప్రజలను పాలించడం అసాధ్యం. అదేవిధంగా, హక్కులను ఉల్లంఘించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఉల్లంఘనను అధికారిక చట్టాలుగా అమలు చేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఊపా లాంటి నల్ల చట్టాలు వచ్చాయని ఆయన చెప్పారు, తద్వారా చట్టానికి అనుసంధానించబడిన చట్టబద్ధత ఉల్లంఘనకు సాధ్యమయ్యే ఏవైనా సమర్థనలను రాజ్యాంగం నుంచి పొందవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఫాసిజం వల్ల హక్కులు తమ ఉనికిని కోల్పోతాయి. ఫాసిజానికి కూడా విశేషమైన ప్రజాదరణ వుంటుంది. ఒక ప్రజాదరణ పొందిన ఫాసిజం (మోడీ ఆర్ధిక, రాజకీయ, హిందూ మతోన్మాద విధానాలు) ఉదాహరణకు, ఈ రోజు కొత్త ఆర్థిక విధానాన్ని కరోనా కాలంలో తీసుకువచ్చింది. ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు రక్షణకు మద్దతుకు కార్పొరేటు వర్గానికి అనేక తాయిలాలను కరోనా కాలంలో బిజేపి ప్రకటించింది. సాంఘిక సమానత్వం అనే ఆలోచనతో ప్రజలను మభ్యపెట్టడం హిందుత్వానికి మాత్రమే చెల్లిందని ఆయన చెప్పేవారు. బిజెపి కొంతకాలం గాంధేయ సోషలిజం లాంటి అస్పష్టమైన భావనను అవలంబించింది. అభివృద్ధి పేరుతో ప్రజలను భ్రమల్లో వుంచాల్సిన అవసరం బిజేపి ఇంక అవసరం లేదు.
శేషయ్య విశ్లేషణలో ఆధిపత్యం సమాజంలోని అన్ని స్థాయిలలో ఉన్నాయి. పైభాగంలోనే ఉండవు. ఇవన్నీ సామాజిక నిర్మాణంపై సమానంగా నిర్ణయించే ప్రభావాన్ని కలిగి ఉండకపోవచ్చు. అందువల్ల ప్రజల మధ్య తెలియని శత్రుత్వం నెలకొని వుంటుంది. ప్రతి ఒక్కరు సమానత్వం, సంపూర్ణత్వానికి సంబంధించి వేరే వాళ్ల కన్నా గొప్పగా భావిస్తారు. అతిచిన్న రైతు , కూలీ చేసుకునే కార్మికుడి కంటే గొప్పవాడని అనుకుంటాడు. సమాజంలో అట్టడగు వర్గంలో వున్న అత్యల్ప వ్యక్తి కూడా తన భార్య తనకు దాసి అనుకుంటాడు. ఈ క్రమంలోనే నిచ్చెన మెట్ల కులవ్యవస్ధలోని కింది వర్గాలు, తమ న్నా కింద వర్గాలను హీనంగానే చూస్తాయి.
భారతీయ న్యాయవ్యవస్థ గురించి శేషయ్య దార్శనికత దశాబ్దాల క్రితమే వెల్లడైంది. న్యాయమూర్తుల అత్యవసరమైన సైద్ధాంతిక బలం స్ధానానికే వుందని. వారు రాజ్యాంగ విలువలను పాటించడం లేదని బాధపడేవారు. క్రమశిక్షణా నిబంధనలను, న్యాయ నిరంకుశత్వాన్ని పాటించడానికే న్యాయమూర్తులు తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. కింద కోర్టు తీర్పులు చట్టంగా ప్రకటించకపోయినా అవి సమాజంలో విలువైనవిగా భావించబడతాయి. పార్లమెంటరీ ప్రజాస్వామికం కన్నా న్యాయవ్యవస్ధ బలమైనదని చాలా సందర్భాల్లో రుజువు అయింది. ఇది న్యాయవ్యవస్ధ నిరంకుశత్వానికి దారి తీస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో సాల్వా జుడుం అరాచకలపై అనేక నివేదికలు వున్నాయి. సల్వాజుడుం చేసే హింస ప్రభుత్వ హింసని, దీనివల్ల ప్రజల జీవించే హక్కు కాలరాయబడుతుందని ఆయన అనేక సందర్భాల్లో అన్నారు. అలాగే రిట్ పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను 'నక్సలైట్లు, సాల్వా జుడమ్ చేసే మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన'' ఆరోపణలపై నివేదికను తయారుచేసే నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరడాన్ని ఆయన తప్పు పట్టాడు. అది సల్వాడుడుం హింస తీవ్రతను తగ్గించడానికే, మావోయిస్టుల హింసకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. సాల్వా జుడమ్ ఇమేజ్‌ను నేరారోపణల వల్ల దెబ్బతినకుండా కాపాడటానికి స్వయానా సుప్రీంకోర్టే పూనుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన చెప్పేవారు.
గిరిజనులు నివసించే భూములను ప్రభుత్వం లాక్కుంటున్నప్పడే, భవిష్యత్త్తులో మైదాన ప్రాంతంలో నివసించే పేదల బూములను ప్రభుత్వాలు లాక్కుంటాయని ఆయన జోస్యం చెప్పారు. అది ఇప్పుడు నిజమైంది. సుప్రీంకోర్టు కూడా 20 లక్షల గిరిజనులను తమ స్వంత భూముల నుండి గెంటివేయడాన్ని ఆయన ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్ ప్రాంతాల నుండి అక్రమ భూసేకరణపై న్యావ్యవస్ధ ఉదాసీనంగా వుంది. పోలవరం లాంటి ప్రాజెక్టులు అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. అయినా ప్రభుత్వాలు తమ వారికి కాంట్రాక్టుల కోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తోంది. ప్రజాపోరాటాలు ప్రజల కోల్పోయిన నష్టపరిహారాన్ని పెంచడానికి మాతమ్రే ఉపయోగపడతున్నాయని ఆయన చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అలాగే ల్యాండ్ బ్యాంకు పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న భూసేకరణను ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ హక్కు వుందనే బావన ప్రజల్లో వుంది. కాని ఆ బూముల్లోనే సెజ్‌లు , కారిడార్లు ఏర్పడతాయని ఆయన ముందుగానే ఊహించి చెప్పారు. ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్ అవతారం ఎత్తుందని అన్నారు. ప్రభుత్వాలు దళారీ ఏజెంట్లుగా మారతాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ఆయన చెప్పారు.
భూ సంస్కరణల కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల ఫలితంగా భూ సంస్కరణలు జరిగాయి. ఈ క్రమంలో ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు దశాబ్దాలుగా 40 లక్షల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి పంపిణీ చేయబడిందని ప్రభుత్వం చెపుతోంది. మరి ఈ భూమి ఇప్పడు ఎవరి చేతుల్లో వుంది. అంటే భూ సంస్కరణలు అంతిమంగా ఫ్యూడల్, బూర్జువా వర్గాలకే ఉపయోగపడ్డాయని ఆయన చెప్పేవారు. ప్రజలు ఒకవైపు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాలు చేస్తుంటే, ఆ పోరాటాల ఫలితాన్ని పెద్దలే అనుభవిస్తారని ఆయన చెప్పాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలోను ఆయన అనేక వేదికల్లో ఇదే చెప్పారు. అధికార మార్పిడి మాతమ్రే జరగడానికే ఈ పోరాటం ఉపయోగపడకూడదు, కనీస ప్రజాస్వామ్య హక్కులు అయినా గుర్తించబడే దానికి ఉపయోగపడాలని చెప్పేవాడు. హక్కుల, ప్రజా సంఘాలు తమ డిమాండ్లను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే పాలకవర్గాలు వాటిని అమలుపరిచే తప్పని పరిస్ధితులను కల్పించాలని చెప్పాడు. కెసీఆర్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సదస్సుకు హైదరాబాదులో హాజరయినపుడు శేషయ్య చాలా స్పష్టంగా తన భవిష్యత్తు భయాలను ఆయన ముందుంచాడు. కేసీఆర్ అప్పుడే నక్లలైట్ల అజెండానే తెరాస మేనిఫెస్టో అని ప్రకటించాడు.
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమంపై తీవ్రమైన అణచివేత కొనసాగుతోంది. ప్రభుత్వాలు పైచేయి సాధించడానికి గ్రేహౌండ్స్ నేతత్వంలో ఆదివాసీలను చంపుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ముఠాలు కోబ్రా, పులులు పేరుతో ప్రజాసంఘాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రతిహింసను మరింత పెంచడానికి, తద్వారా ప్రజల్లో ఆ హింసను ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటాయని చెప్పాడు. అంతేగాక నిర్భంధం నికార్సైన హక్కుల నాయకుల చేత కూడా ప్రభుత్వం అనుకూల ప్రకటనలు చేయిస్తుందని ఆయన చెప్పారు. ఇది హక్కుల ఉద్యమానికి అత్యంత క్లిష్ట సమయమని, ఈ సందర్భంలోనే హక్కుల నాయకులు తమ నిబద్ధతను, హుందాతనాన్ని కోల్పోకూడదని ఆయన చెప్పారు. ఆయన ఇంటిపై దాడి జరిగిన సందర్భంలో ఈ మాటలు ఆయన చెప్పారు.
విముక్తి పొందిన ప్రాంతాలలో హింస, ప్రతి-హింస చట్రాల మధ్య ఆదివాసుల జీవితాలు నాశనమవుతున్నాయని జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెట్టాయి. సాల్వా జుడమ్ క్రూరమైన హింస ఫలితంగా మరణించిన వారి సంఖ్య గురించి అధికారిక రికార్డులు లేవు. మావోయిస్టులు వల్ల చనిపోయిన వారి సంఖ్యను, పేర్లను, కుటుంబాలను మీడియా పదేపదే టీవీల్లో చూపెట్టడం జరిగేది. యుద్ధం జరుగుతున్నప్పడు రెండు వర్గాలు ఖచ్చితమైన, వాస్తవమైన వివరాలను ప్రజల ముందు వుంచాలని ఆయన చెప్పాడు. పౌరహక్కుల సంఘం మాత్రమే ఆ వివరాలను సేకరించే పనిని చేపట్టగలదని అన్నాడు. విస్తృతంగా నిజనిర్దారణలు జరిపి, ప్రజలు అంతిమంగా ప్రభుత్వ విధాన వల్లే నష్టపోతున్నారని తేల్చి చెప్పడానికి ఆయన ఆనేక నివేదికలను మీడియా ముందు వుంచారు.
శాంతి చర్చలకు ఎలాగైనా గండి కొట్టాలని ప్రభుత్వం తప్పక ప్రయత్నిస్తుందని ఆయన ముందే ఊహించారు. పేరకు నక్సలైట్‌లతో బహిరంగ చర్చలు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం చెప్పనిది ఏమిటంటే, నక్సలైట్ల ఏరివేతను ఆపే ఉద్దేశం పభ్రుత్వానికి లేదు. శాంతి చర్చలను ప్రభుత్వం అపహాస్యం పాలుచేసి, ఏకంగా చర్చల్లో పాల్గొన్న వారినే వేటాడి చంపింది. ఇటువంటి సందర్భంలో శాంతిచర్చల ప్రక్రియను పున ప్రారంభించే ప్రధాన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. శాంతి చర్చల తదనంతర పరిణామాలు చూసిన తర్వాత, బహుశా ఇంక ఎవ్వరూ శాంతి చర్చలు జరపాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలకున్న ఫాసిస్టు, నిరంకుశ స్వభావం, ప్రజల హక్కుల పట్ల చులకన భావాన్ని మేధావులు స్వయంగా చూశారని ఆయన చెప్పారు. ఏదైనా సంభాషణ ప్రారంభానికి ముందు సమూహం ఏకపక్షంగా లొంగిపోవాలని ప్రభుత్వం పట్టుబట్టడం వల్ల కూడా ఈ ప్రక్రియ ప్రారంభదశలోనే పాక్షికంగా దెబ్బతింది.
వై ఎస్ రాజశేఖరరెడ్డి, కొత్త ముఖ్యమంత్రి జగన్ అభివద్ధి నమూనా ద్వారా నిర్లక్ష్యం చేయబడిన తరగతులను పట్టించుకునే వ్యక్తులు కాదని ఆయన చెప్పారు. కింది తరగతుల ఓట ్లద్వారానే జగన్ గెలిచాడు. ఆయన నాయకత్వంలో కింది తరగతులు విశ్వాసం కలిగి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
భారతదేశంలో సామాజిక గందరగోళం క్రమంగా పెరుగుతుంది. న్యాయ అధికారులతో సహా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జీవితాన్ని నిర్ణయించే విచక్షణను న్యాయాధికారుల చేతుల్లో పెట్టడం చాలా ప్రమాదకరం. ప్రజలు తీవ్రమైన సామాజిక గందరగోళ పరిస్థితులలో, హిందూ మతోన్మాదుల అనైతిక రాజకీయాల అధిరోహణ కాలంలో జీవిస్తున్నారు. ప్రజల అశాంతిని అనుకూలంగా కోర్టులు మార్చుకుంటున్నాయి. కోర్టులు నిశ్శబ్దంగా మరింత కఠినమైన శిక్షలను ఇస్తున్నాయి. పోలీసుల దష్టికోణంలో సాక్ష్యాలను చూడటానికి న్యాయస్ధానాలు మొగ్గుచూపుతున్నాయి. ఎక్కువ మంది వ్యక్తులను ఉరితీసే ప్రక్రియ జరగబోతోంది. న్యాయవ్యవస్ధలు నేరస్ధులను శిక్షించే వరకు ప్రజలు వేచిచూడకుడదని అనుకుంటున్నారు. తద్వారా వారు పోలీసు ఎన్‌కౌంటర్లకు పోరక్ష మద్దతు ఇస్తున్నారు. ఇది హక్కుల ఉనికికే ప్రమాదకరమైన వైఖరని ఆయన అన్నారు.
డిసెంబర్ 6,1992 ఏమి జరిగిందో దేశ ప్రజలకు తెలుసు. హిందూ మతోన్మాదులు మసీదును కూల్చేశారు. అటువంటుప్పుడు, గ్రామస్ధాయిలోని రచ్చబండ న్యాయకుం కూడా ఏం చెపుతుంది. అక్కడ మసీదు పునర్నించాలని, మసీదు కూల్చిన వ్యక్తులను శిక్షించాలని చెపుతుంది. కాని జరిగిందేమిటి. సుప్రీంకోర్టు తీర్పును చూసన తర్వాత హక్కుల సంఘాలు న్యాయవ్యవస్ధను నమ్మమని ఎలా ప్రజలకు చెప్పగలుగుతాయి. ఇటువంటి పరిణామాలను హక్కుల సంఘాలు తీసుకురాలేదు. వ్యవస్ధే తన క్షీణతను సిద్దం చేసుకుంటోంది. ఆందుకే హక్కుల సంఘాలు ఉద్యమ ప్రయోజనాలకు అత్యంత విలువ ఇవ్వాల్సివుందని ఆయన చెప్పారు. వ్యవస్ధ భావజాలంతో హక్కుల సంఘాలు కొట్టుకొని పోకూడదని, అణగారిన వర్గ ప్రయోజనాలే హక్కుల సంఘానికి ప్రాతిపదిక అని ఆయన చెప్పారు. లౌకికవాదం మైనారిటీలను విలాసపరుస్తుందని చెపుతున్నారు. అసల లౌకికవాదాన్నే బూటకమైనదిగా పాలకవర్గాలు మారుస్తున్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో హిందువులు హిందుత్వ వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
హిందుత్వం సెక్యులరిజానికి ప్రతిస్పందన కాదు. ఇది ఇతర ప్రజాస్వామ్య విలువలతో పాటు నిజమైన లౌకికవాదానికి ప్రతిస్పందన. ఆర్ధిక, రాజకీయ విషయాలకు సంబంధించి పాలకవర్గాలు కల్పించిన కొత్త ఏకాభిప్రాయాన్ని హక్కుల కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు.
Comments
Post a Comment