అసమాన సమాజంలో అసాధారణ వ్యక్తి - 4

 ప్రజల్లో హక్కుల చైతన్యాన్ని రగల్చటం

వ్యవస్థ భావజాలాన్ని  దాని క్షీణతలలో ఆపే మార్గాలను రూపొందించడం తప్ప వేరే మార్గం లేదు. విమర్శించబడిన విధానాల అమలును శారీరకంగా నిరోధించే శక్తితో ఆయుధాలు కలిగి ఉండకపోతే భారతీయ ప్రజాస్వామ్యం సహేతుకమైన విమర్శలను గౌరవించడం నేర్చుకోలేదు.  కాబట్టి, ఆందోళన బలం ద్వారా అటువంటి బలాన్ని సాధించే మార్గాలను వెతకాలి. సూత్రప్రాయంగా ఉత్తమ పద్ధతి ఏమిటంటే, అధిక సంఖ్యలో ప్రభావితమయ్యే ప్రజలను సమీకరించడం. ఈ పని ఉద్యమ సంస్ధలు చేస్తాయి. అయితే ప్రజలకు ఆ చైతన్యాన్ని ఇవ్వడాన్ని హక్కుల సంఘాలు చేయాలని ఆయన చెప్పేవారు.   ప్రజలు తమ అసమైక్యతతో విభిన్నమైన ఆసక్తులు, సమాజాల అసురక్షితతతో, పేదరికం, హక్కుల లేమితో నలిగిపోతున్నారు. అవకాశవాదం, పోటీతత్వం, అల్పత్వం, వ్యక్తివాదం అనే వ్యాదిలóతో బలహీనపడతారు.  దీన్ని దృష్టిలో పెట్టుకునే హక్కుల సంఘాలు అనేక రంగాలకు విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పేవారు.  ప్రత్యేకించి, మునుపటి తరంలో వ్యక్తిగత ఆందోళనల త్యాగం కలిగి ఉన్న కార్యకర్తలు ఇకపై ఒకేలా ఉండరని హక్కుల కార్యకర్తలు గమనించాలి.  ఆయన ఉద్దేశ్యంలో ఎన్జీఓలు చేసిన గొప్ప అపచారం ఇది. కానీ ఈ సంస్కతి ఇప్పుడు రాజకీయ కార్యకర్తలలో చాలా మందికి సాధారణమైంది. అంతమాత్రాన మాజీ ఉద్యమకారులను అవమానించడం, వెలివేయడం తగదని హెచ్చరించేవారు. ఎంతటివారైనా ఏదోఒక పరిస్ధిథల్లో అస్త్రసన్యాసం చేయక తప్పదని ఆయన ఉద్బోధించేవారు. 

 మరోవైపు, రాజకీయీకరణ ప్రభావం వల్ల ప్రజలు తమ అమాయకత్వాన్ని కోల్పోయారు. ఎన్నికల భ్రమల నుండి బయట పడ్డారు.అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగేదీ లేదని ఓటుకు నోటు తీసుకోవడం మొదలుపెట్టారని ఆయన చెప్పేవారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే ప్రజలు నోట్లు తీసుకుంటున్నారని ఆయన అనేవారు. సామ్రాజ్యవాద యుగంలో, పెట్టుబడీదారీ సంబధాలు బలపడుతున్నప్పుడు ఉద్యమ కార్యకర్తలు అదే వైఖరిని ప్రదర్శిస్తారనే ఎరుక వుండాలని ఆయన అనేవారు.   ఇవన్నీ బలమైన సమీకరణను కష్టతరం చేస్తాయి. ప్రజా ఉద్యమాలను బలహీనం చేస్తాయి. ఇటువంటి పరిస్ధితుల్లో హక్కుల కార్యకర్తలు మరింత నిబద్ధతతో పనిచేయాలని ఆయన చెప్పేవారు.  

బలీయమైన స్వరం

డెబ్బై తరువాత భారతదేశంలో అత్యుత్తమ వ్యక్తులలో  శేషయ్య  ఒకరు. పౌర స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల కోసం బలీయమైన స్వరాన్ని ఆయన వినిపించారు. మానవ హక్కులు. హక్కుల ఉద్యమ సిద్ధాంతం, ఆచరణ , వాటిలో ఉన్న సమస్యలపై అతని అంతర్దష్టి అతన్ని అసాధారణ వ్యక్తిని చేసింది. అతని ఉపన్యాసాలు,  వ్యాసాలు హక్కుల ఉద్యమ రాజకీయాలను,  గతిశీలతను అర్థం చేసుకోవడంలో ఎంతో దోహదపడతాయి.  

ప్రొఫెసర్‌ శేషయ్య  తన సొంత రాష్ట్రం నుండి కాశ్మీర్‌ వరకు ప్రయాణించారు. పౌర హక్కుల ఉల్లంఘనపై వాస్తవాలను కనుగొనే సందర్భాలలో అతను వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్యకర్తల బందానికి నాయకత్వం వహించాడు.  ప్రభుత్వాలు  నిజనిర్దారణ కమిటీలపై దాడులకు పాల్పడుతున్న సందర్భాలలోను,  బెదిరింపుల చేస్తున్న తరుణంలోను ఆయన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎన్‌కౌంటర్ల పై నిజనిర్దారణను జరపాలనే తీర్మానాన్ని పౌరహక్కుల సంఘంలో 2005 నుండి తప్పనిసరి చేశాడు.   ఎందుకంటే అప్పటి పభ్రుత్వాలు ఎన్‌కౌంటర్లపై నిజనిర్దారణలకు వెళ్లే హక్కుల బృందాలపై భౌతిక దాడలకు పాల్పడేవి. అప్పుడు ఒక సంవత్సరం పాటు పౌరహక్కుల సంఘం నిజనిర్దారణలను ఆపేసుకున్నాయి. దాంతో సమాజానికి వాస్తవాలు తెలియటం ఆగిపోయాయి. ప్రభుత్వ నిరంకుశత్వం మరింత పెరిగింది. 

వాస్తవ ఫలితాల ఆధారంగా నమోదు చేయబడిన నివేదికలు ఎక్కువుగా శేషయ్యే రాశేవారు.  ఇవి మానవ హక్కుల         ఉల్లంఘనను, పోలీసుల చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి బహిర్గతం చేసేవి.   లా ప్రొఫెసరు కావడం వల్ల రాజ్యాంగంపై అతనికి మంచి పట్టు వుండేది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలలో అతని చతురత, ముఖ్యంగా హక్కులకు సంబంధించిన చట్టాలు అతనికి కరతలామలకం. 1997 లో ఎన్‌హెచ్‌ఆర్‌సి ముందు బాలగోపాల్‌ వాదనల ఫలితంగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాలని,   ఎన్‌కౌంటర్‌లో ఒక వ్యక్తిని చంపినట్లు చెప్పుకునే పోలీసు అధికారులందరిపై విచారణ జరిపించాలని చారిత్రాత్మక సిఫారసు చేయడానికి శేషయ్య కృషి చాలా వుంది.    ''ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌'' కు వ్యతిరేకంగా శేషయ్య నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా కార్యక్రమాలు జరిగాయి. అప్పడే భారత పభ్రుత్వం తన స్వంత ప్రజలపై యుద్ధాన్ని చేస్తుందనే చేదు నిజం ప్రజలకు తెలిసింది. తన సొంత పౌరుడిపై పూర్తి స్థాయి యుద్ధాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయడాన్ని జాతీయ, అంతర్జాతీయ మేధావులు తీవ్రంగా తప్పు పట్టారు.  హక్కుల ఉద్యమం, సిద్ధాంతాలలో కొన్ని వివాదాస్పద అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇప్పటికీ హక్కుల ఉద్యమానికి దిక్సూచిగా ఉపయోగపడుతున్నాయి.  

న్యాయమైన ప్రజాస్వామ్య సమాజం కోసం పౌరహక్కుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎంతో వుంది.  ప్రతి పౌరుడు  గౌరవంగా మత, కులంతో సంబంధం లేకుండా హింసకు భయపడకుండా జీవించే హక్కు ఉంది. అయినా ఈ అసమాన సమాజంలో రాజ్యాంగ బద్ద పాలనను ప్రభుత్వాలు అందించడం లేదు. అందుకే శేషయ్య ఆలోచనలతో, ఆయన అందించిన హక్కుల చైతన్యంతో హక్కుల సంఘాలు మరింత నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

శేషయ్యతో  పరిచయం

2000 నుండి నాకు అతనితో పరిచయం వుంది. పిచ్చాపాటి కబుర్లుతో ఆయన ఎప్పుడూ సమయాన్ని వృధా చేసేవారు కాదు. ఆయనతో మాట్లాడటం అంటే ఎదైనా రాజకీయ గందరగోళాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించడంలోనే జరిగేది. అన్నిటికి ఆయన చిరునవ్వుతోనే మాట్లాడేవాడు. అతనికి ఆ చిరునవ్వే భూషణంగా వుండేది. 

బహుశా అతనిపై గౌరవం కలగడానికి అతని మేధస్సు కన్నా, అతని ఆత్మీయమైన పలకరింపు ప్రధాన కారణం కావచ్చు. ఏ కార్యకర్త అయినా నిస్సందేహంగా అతనితో మాట్లాడవచ్చు.  అతను పౌర హక్కుల రాజకీయాలలో కొన్ని అంశాలతో తీవ్రంగా కుస్తీ పడ్డారు. హక్కుల సంఘం సమకాలీన పరిస్ధితులకు అనుగుణంగా తన ఆచరణను, జ్ఞానాన్ని పెంపొందించుకోలేదని ఆవేదన చెందేవారు. రాయాల్సినంత రాయలేకపోయాననే అసంతృప్తి అతనిలో వుండేది, అనారోగ్య కారణాల వల్ల గత  నాలుగు సంవత్సరాలుగా అతను సభలకు, సమావేశాలకు అతి తక్కువుగా హాజరయ్యారు.  అతని దగ్గర అన్ని సంక్లిష్టమైన ప్రశ్నలకు  సమాధానాలు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండేవి. 

అతను మాట్లేడటప్పుడు  గొంతును పెెంచేవాడు కాదు.  నాటకీయంగానో, ప్రేక్షకులకు తగ్గట్టుగానో మాట్లాడి వాళ్లను ఒప్పించాలనే తాపత్రయం అతనిలో వుండేది కాదు. కాని అతను చెప్పే క్లాసులు, ఉపన్యాసాలను అన్ని సెక్షన్ల ప్రజలు ఆసక్తిగా వినేవారు.   ప్రజలపై హింసకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, న్యాయవ్యవస్ధ కాడూ కారణమని ఆయన విశ్లేషించాడు. రాజ్యహింస ఏ విధంగా అన్ని ఆధిపత్య హింసలకు మూలకారణంగా వుందో చెప్పేవాడు. రాజ్యాంగాన్ని ధనికవర్గం ఏ విధంగా తమ హక్కుల కోసం ఉపయోగించుకుంటుందో ఉదాహరణలతో చెప్పేవాడు.  

ఐక్య కార్యాచరణల ఆవశ్యకత

పౌర హక్కుల ఉద్యమంలో ి తీవ్రమైన రాజకీయ చర్చ జరిగింది. పౌర హక్కుల సంఘాలు నక్సలైట్‌ పార్టీల సంఘాలుగా మారిపోతున్నాయనే విమర్శలు వచ్చాయి.  అవి స్వతంత్రంగా పనిచేసి కొంత స్వయంప్రతిపత్తి కలిగి వుండాలనే వాదన మొదలైంది. సమాజంలో వ్యక్తులు, సంస్ధలు వస్తుగత సంబంధాలతో పెనవేసుకుని వుంటాయని, స్వయం ప్రతిపత్తి గలిగిన సంస్ఘలు పేరుకే తప్ప నిజానికి వుండటం సాధ్యం కాదని ఆయన అనేవాడు. ఆ క్రమంలోనే అమాయకులైన ప్రజలు అని వాడటాన్ని ఆయన తప్పు పట్టేవాడు. ప్రతి పౌరుడు ఏదో ఒక రాజకీయ చైతన్యాన్ని కలిగివుంటాడని చెప్పేవాడు. అమాయకులు అంటే చైతన్యం లేని ప్రజలు అని చెప్పడమని, అది మార్స్కిస్టు మూలసూత్రాలకు విరుద్ధమని చెప్పేవాడు. అయితే హక్కుల సంఘాలకు స్వయం నిర్ణయాధికారం, స్వయం నియంత్రణ  వుండాలని, తమకున్న సామర్ధ్యాల మేరకు కొన్ని పరిమితులతో పనిచేయాలని ఆయన అనేవారు. 

పౌరహక్కుల సంఘంలో ప్రజాస్వామ్య ధృక్పధంతో మంచి సమాజం కోసం పనిచేయాలనే తపన వున్న వారు ఎవరినైనా చేర్చుకోవచ్చనే శేషయ్య ఆలోచనతోనే మధ్యతరగతి వర్గ ప్రజలు ఎక్కువుగా సంఘంలో చేరారు. ఐక్య కార్యాచరణను నిర్మించడంలోను, ఒకే గొడుగు కింద పనిచేయడంలోను ఆయన ఇచ్చిన మార్గదర్శకాలలోనే సంఘం ఇప్పటికీ పనిచేస్తోంది. ఆ విస్తృతి వల్ల సంఘం,  సిపిఐ, సిపిఎం, బహుజన కుల సంఘాలతోను కలిసి వేదికను పంచుకోవడం జరిగింది. హక్కుల ఆమోదానికి విస్తృతమైన ప్రజారాసుల మద్దతు అవసరమనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పేవారు.  

కొంతమంది సంప్రదాయక నాయకుల  వైఖరికి భిన్నంగా, శేషయ్య అన్ని వర్గాల ప్రజలను చేర్చుకోవడం తప్పు అని అనుకోలేదు. దీనివల్ల అతను పాత, కొత్త తరానికి దగ్గర అయ్యాడు. హిందూ మతోన్మాదానికి వ్యతిరకేంగా, ఫాసిస్టు దళారీ ప్రభుత్వవలకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఐక్య కార్యాచరణ అవసరం ఎంతో వుంది. బూటపు ఎన్‌కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ, గ్రీన్‌ హంట్‌ ఆపరేషన్‌ వ్యతిరేక కమిటీ, ఊపా చట్ట వ్యతిరేక కమిటీ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, హిందూ మతోన్మాద వ్యతిరేక పౌరాట కమిటి, ప్రజాస్వామిక వేదిక లలోను విభిన్న ఎజెండాలతో వున్న  దళిత, బహుజన, ప్రజాస్వామ్య సంఘాలు, వామపక్ష పార్టీలు కలిసి ఐక్యంగా పోరాడాయి. చాలా అంశాల్లో విజయాన్ని సాధించగలిగాయి. 

ఆయనది హక్కుల కుటుంబం

నిరంతర అధ్యయనం , కార్యాచరణ ఆయనలో వుండేవి. హక్కుల సంఘం బలోపేతం కోసం, అతను ప్రజా సంఘాల్లో పనిచేసిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. అతనికి ఆసక్తి కలిగించేది విషయం కధా రచన. నేను కూడా కథ రాయాలని చాలాసార్లు అనుకున్నట్టు ఆయన చెప్పేవారు. కొన్ని అముద్రిత కథా రచనలు అతని దగ్గర వున్నాయి. 

శేషయ్య,  ఐపిసిఎల్సి విడదీయరానివి. హింస, ప్రతిహింస సమస్యపై సంఘమే రెండుగా చీలే పరిస్ధితి వచ్చింది. అతనికి  ప్రియమైన వ్యక్తులు సంస్ధ నుండి వెలుపలికి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. శేష్యయ్య ఎప్పుడూ నచ్చచెప్పే ధోరణిలోనే చర్చను జరిపేవాడు. కొన్ని రోజులపాటు వరుసగా హక్కుల అవగాహన, చైతన్యం, సమాజ చలన సూత్రాలు, సంఘ వైఖరిపై విస్తృత చర్చ జరిగింది. 

నిజానికి రాజకీయ పార్టీలు చేసే హింసను ప్రతిహింసగా చూడాలనే ఆలోచన, ప్రతిహింస కంటే రాజ్య హింస  అతి పెద్ద ప్రమాదం అని శేషయ్య, తదితరులు భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు కూడా ఉద్యమకారుల హింసను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడేవారు కాదు. కాని రాజ్యహింసను, నిర్భంధాన్ని వ్యతిరేకించడానికి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందనే వాస్తవం పౌరహక్కుల సంఘం రుజువు చేసింది.  రాజ్యహింసను, ప్రతిహింసను రెండింటినీ సమానం చేయడం ఏ మాత్రం సరికాదు.  హక్కుల సంఘనాకి కార్యకర్తలు దూరమైతే, వారు తన కుటుంబం నుండి దూరమయినట్టు భావించేవారు. అందుకే వారితో ఏకాంతంగా ఫోను సంభాషణలు జరిపేవారు. వారిని తిరిగి సంఘ నిర్మాణంలో భాగం చేసేవారు. ఆయనకు బాగాలేనప్పుడు కూడా అనంతపురం ఆసుపత్రిలో ఆయన్ను పలకరించడానిక వచ్చిన వారితో ఫలానా వారు వస్తానన్నారే, రాలేదా అని ఆడిగేవారు. ఆయనను చూడటానికి వచ్చినవారు ఆయన ఇంట్లోని వుండాలని పట్టుబట్టేవారు. 

ఐపిసిఎల్‌సిలో చాలా చర్చలు జరిగాయి.  హక్కుల ఉద్యమంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉందని దళిత సభ్యులు భావించారు.  ఈ అంశాన్ని శేషయ్య చాలా సున్నితంగా నచ్చచెప్పారు. సమాజంలో వస్తున్న కాలాగుణ పరిస్ధితులు, వాటి గందరగోళాలు మొదట హక్కుల సంఘంలోనే నమోదయ్యేవి. ప్రాంతీయ,  జెండర్‌, కుల సమస్యలు హక్కుల సంఘంలో విస్తృతంగా చర్చకు వచ్చేవి. చర్చను సరైన దారిలో నడిపించడానికి, గందరగోళానికి తెరతీయడానికి అన్ని చర్చలకు శేషయ్యే నాయకత్వం వహించాల్సి వచ్చేది. 

మనోధైర్యాన్ని నింపే యాంటీబయాటిక్‌ 

2013 అలిపిరి సంఘటనలో చిత్తూరు జిల్లా కమిటీ సభ్యులు ప్రాణభయంతో చెల్లాచెదురయ్చారు. అప్రకటిత ఎమర్జెన్సీ జిల్లాలో నెలకొనింది. ఇళ్లకు రాకుండా సభ్యులు నానా ఇబ్బందులు పడేవారు.   నేను భయంతో బిక్కచచ్చి పోయాను. అలాంటి సమయంలోను శేషయ్య స్వయంగా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్భంధం భయంతో జిల్లా యూనిట్‌ మొత్తం దాదాపు రాజీనామా చేసింది.   ఆ సంఘటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత ఒక సమావేశంలో శేషయ్యని కలవడం జరిగింది. నవ్వుుతూ నన్ను పలకరిస్తూ   ''ఎంతైనా నువ్వు ధైర్యవంతుడివే'' అన్నాడు.  నేను దానికి  ''మీరు ఎప్పుడైనా భయపడ్డారా'' అని అడిగా. దానికి ఆయన ''చాలాసార్లు'' అని భుజం తట్టాడు. నేను శేష్యయతో అనేక సార్లు అనేక విషయాలపై చర్చించాను.  అతని సునిశిత విశ్లేషణ,  విమర్శనాత్మక వివరణ నన్ను అబ్బురపరిచేది.  

శేషయ్య  పీపుల్స్‌ వార్‌ సంస్ధ పనితీరును సునితంగా గమనించారు. అలాగే  ఎన్జీఓలపై అతను ఘాటైన విమర్శను చేశాడు. ఎన్‌జీవోలు భవిష్యత్తులో హక్కుల ఉద్యమాన్ని హైజాక్‌ చేస్తాయని చెప్పాడు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఎన్‌జిఓలు మారతాయని సామ్రాజ్యవాదంలో ఇది భాగమని చెప్పారు.   ఎన్జీఓలు మానవ హక్కుల ఉద్యమాన్ని దాదాపుగా  నిర్వీర్యం చేశాయని చెప్పవచ్చు. 

సాయుధ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు తన శక్తిని పెంచుకుంటున్నారు. అప్పుడు మావోయిస్టులు మానవ హక్కుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని కార్పొరేట్‌ సంస్ధల ఏజెంట్లైన హక్కుల సంస్ధలు దేశవ్యాప్త ఉద్యమాన్ని తీసుకుచ్చే ప్రయత్నం చేశాయి. ఈ సందర్భంలో శేషయ్య లేవనెత్తిన ప్రశ్నలు మరింత ఆవశ్యకతను సంతరించుకున్నాయి. ప్రతిహింసపై చర్చ అసంపూర్ణంగా ఉంది.  ఎందుకంటే పోరాటంలో హింసను ఉపయోగించడం చట్టబద్ధమైనదా కాదా అనేది అసలు సమస్య కాదు. బాలగోపాల్‌ హింస సమస్యను లేవనెత్తినప్పటికీ, శేషయ్య దానిని మరింత ముందుకు తీసుకెళ్ళి చర్చను ప్రారంభించాడు. వర్గ పోరాటం, ప్రజాస్వామ్య హక్కుల మధ్య వున్న సంబంధాన్ని అతి క్షుణ్ణంగా విశదీకరించాడు. 

శేషయ్య ధైర్యవంతుడైన విప్లవకారుడు, నిబద్ధత కలిగిన పౌర హక్కుల నాయకుడు. అన్నింటికంటే మించి పేదలు ,  అణగారిన వర్గాల పక్షపాతి. పౌరహక్కుల అవగాహన మార్క్సిస్టు ధృక్పధంలో ఎలా అర్ధం చేసుకోవాలో విశదీకరించి అన్ని విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చిన వ్యక్తి, పౌరహక్కుల సంఘానికి సరైన దిశను సూచించిన వ్యక్తి. 

హక్కుల కార్యకర్తలకు మార్గదర్శకుడు. 

రాజకీయ, సామాజిక, సాంస్కతిక,  ఆర్థిక స్వేచ్ఛలు సాధారణ ప్రజలకు కావలసి వుంది. పౌర హక్కుల ఉద్యమంలో భాగంగా దళితులపై, మహిళలపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అనేక సమావేశాలు నిర్వహించబడ్డాయి. వీటన్నిటికీ శేషయ్య నాయకత్వం వహించాడు.  గత నాలగు దశాబ్దాలలో తెలగు సమాజం సజనాత్మక పరివర్తన దశలను ఎదుర్కుంది.   ఆ ప్రక్రియకు శేషయ్య లాంటి వ్యక్తులు గణనీయమైన సహకారం అందించారు. 

కష్టపడుతున్న ప్రజలు అనేక రకాల అణచివేత, హింస లాంటి వాస్తవికతలతో పోరాడుతున్నారు. మానవతావాదపు నైరూప్య విలువలను సమర్దించడంలో భాగంగా ప్రజా ఉద్యమాలను, వాటి రీతులను విమర్శించడం అంతిమంగా ప్రభుత్వాలకు ఉపయోగపడుతుందనే సున్నితమైన అంశాన్ని గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అతను రాజకీయ ఆర్థిక వ్యవస్థ  ప్రస్తుత పరిస్థితుల  ఖచ్చితమైన విశ్లేషణను చేశాడు. అలాగే అతని న్యాయపరమైన నైపుణ్యం, ఆయన ఆచరణ మార్క్సిజాన్ని చాలా లోతుగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడింది. 

మావోయిస్టుల పట్ల సానుభూతి కలిగి ఉండటం,  మావోయిస్టుగా ఉండటం ప్రజాస్వామ్యంలో నేరం కాదని శేషయ్య చెప్పిన రెండు దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు అదే విషయాన్ని తన తీర్పులో పేర్కొంది.  మావోయిస్టులు హింసను విశ్వసిస్తారనే వాదన నిజంకాదని, అలా వుంటే ఆ ఉద్యమం ఎప్పుడో ప్రజలకు దూరమయ్యేదని ఆయన చెప్పారు. మావోయిస్టు సమస్య భారతదేశపు ''అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు'' అన్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాటలు జనతన సర్కారును నిర్వీర్యం చేసే కుట్రలో భాగమని ఆయన చెప్పారు. అతను ఎల్లప్పుడూ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఆచరణలో చూపించాడు.  


Comments

Post a Comment