అసమాన సమాజంలో అసాధారణ వ్యక్తి - 3

 


నిబద్దతతో కూడిన ఆచరణ

ప్రొఫెసర్‌ శేషయ్య(66) జాతీయ పౌరహక్కల ఉద్యమ చరిత్రలో తనదైన ముద్రు వేశారు.   ఆయన వయసు కేవలం 66 సంవత్సరాలు. అతను ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీలో 1986లో చేరాడు.   ప్రాథమిక సైద్ధాంతిక వ్యత్యాసాల కారణంగా కె. బాలగోపాల్‌ లాంటి మేధావి మరొక పౌర స్వేచ్ఛా సంస్థ అయిన మానవ హక్కుల వేదికను  ఏర్పాటు చేశాడు. ఈ సైద్ధాంతిక తేడాలు మావోయిస్టుల రాజకీయ హింసలో పాతుకుపోయాయని మధ్యతరగతి మేధావి తరగతి వర్గం బలంగా విశ్వసించింది. అటువంటి సంక్షోభంలో పౌరహక్కుల సంఘాన్ని నిలబెట్టిన వ్యక్తి శేషయ్యే.  పౌర హక్కుల కార్యకర్తలందరికీ మావోయిస్టులతో సంబంధం ఉంటుందనే ప్రచారాన్ని ప్రభుత్వం, పోలీసులు విస్తతంగా చేసేవారు. మావోయిస్టులతో కాదు, వాళ్లు చేసే          ఉద్యమాల ప్రజాస్వామిక డిమాండ్లతోనే  పౌరహక్కుల సంఘానికి సంబంధం వుంటుందని ఆయన చెప్పేవారు.  అందువల్ల  అతన్ని వేధింపులకు గురిచేసే ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకుంది.  అనేక మానసిక, భౌతిక  వేధింపులకు అతన్ని గురిచేసింది. 

అతను తెలివైన వక్త, మంచి రచయిత.  దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆయన  ప్రసంగాలను విన్నవారు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. అతను పౌర హక్కుల ఉల్లంఘనపై తీవ్రమైన పోరాటం చేశాడు.  ఎక్కడా రాజీపడలేదు. రాజకీయ శత్రువులను పారద్రోలడానికి ప్రభుత్వం కొనసాగించే అపఖ్యాతి పాలైన ''ఎన్‌కౌంటర్‌ హత్యలు'' ప్రజల దష్టికి తీసుకురావడంలో శేషయ్య కషి చాలా వుంది.  రాజ్యహింసలో భాగంగా పౌరహక్కుల సంఘం 6 గురు అమరులను కోల్పోయినప్పటికీ, సంఘాన్ని ధైర్యంగా, సమయస్పూర్తితో నడిపిచిన ఘనత ఆయనకు దక్కుతుంది. 

 ప్రతి హింస

హింస,  ప్రతి- హింస  స్వభావంపై ఆయన ఆలోచనలు మారిస్టు సిద్ధాంతాన్ని మరింత పరిపుష్టం చేశాయి.  సమాజంలోని వర్గ నిర్మాణంపై ఆయన చేసిన విశ్లేషణలు ప్రస్తుత సమాజాన్ని అంచనా వేయడంలో ఎంతో    ఉపయోగపడతాయి. అతను నందికొట్కూరులో పుట్టాడు. ఆ ప్రాంతంలోని పాలెగాళ్లు భూస్వాములుగా, ఫ్యాక్షనిస్టులుగా, పారిశ్రామికవేత్తలుగా, రాజకీయనాయకులుగా ఎదిగిన క్రమం ఆయన కళ్లముందే జరిగింది.  పెద్ద ఎత్తున హింసతో కూడిన ఎన్నికలు అక్కడ జరిగేవి.  ప్రొఫెసరు శేషయ్య హింస గతిశీలతను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అతను చనిపోయేంతవరకు వున్న అనంతపురం లోని సామాజిక పరిస్ధితులు, సాయుధ ప్రజా ఉద్యమాలు ఉపయోగపడ్డాయి.  అతని జీవితంలో సైద్ధాంతికంగా నిలబడటానికి, అతని వృత్తి, ప్రవృత్తి రెండూ ఉపయోగపడ్డాయి.  అతని అకాల మరణం సజనాత్మక ఆలోచన ప్రక్రియకు కూడా ముగింపు పలికింది. హక్కుల ఉద్యమంలో వస్తున్న పెడధోరణులను అతను ముందే ఊహించాడు. నిరంతరం ఆయన నాయకులను హెచ్చరించేవాడు.  రాజకీయ చర్చ తరచుగా హింస,  అహింసల చుట్టూ తిరుగుతుంది, ఇది నైతిక ప్రత్యామ్నాయాలుగా కాకుండా వ్యూహాత్మక ఎంపికలుగా జరిగేవి.  సాయుధ సమూహాల నుండి వచ్చిన వారితో ప్రజాసంఘాలు నిండిపోయాయనే అపవాదును ప్రభుత్వంతో పాటు సంఘ నిర్మాణంలో పాలుపంచుకున్న వారు అనడం సమాజంలో పెద్ద ఎత్తున చర్చను లేపింది.

పిడివాద వైఖరులు  ప్రజాసంఘాలకే కాదు, సమాజానికి హాని  చేశాయి. హింస గురించి ఒకరు పిడివాదంగా                        ఉండకూడదని చెప్పడం అనైతికత కాదు. సమాజంలో విలువైన ప్రజాపోరాటాల సాపేక్ష వైఖరిని గుర్తించాలి. పోరాట సమయంలో సంభవించే గాయానికి అందులో పనిచేసిన వారిని బాధ్యులను చేయడం సాధారణంగా జరిగేదే. కానీ చర్చ అనివార్యంగా ప్రత్యామ్నాయాల ప్రభావాన్ని అంచనా వేయాలి. ఊహాగానాలతో, భ్రమలతో కూడిన వాదాలు చర్చను బలహీనం చేస్తాయి.   వాస్తవిక అంచనాకు దగ్గరగా వుండే విషయాలే చర్చను బలోపేతం చేస్తాయి. 

ప్రజా ఉద్యమాలు చేసే పొరపాట్లను అరికట్టడంలో  వారు ఎంచుకున్న వ్యూహాలు ప్రభావవంతంగా ప్రతిసారీ వుండవు.  ఏ రంగంలోనైనా ఒకే ఒక ప్రధాన విధానాన్ని వెనక్కి తీసుకోమని  బలవంతం చేయడం  వల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదు.   సమాజం, ఆర్థిక వ్యవస్థ  నిర్మాణాలలో అంతర్లీనంగా ఉన్న పోకడలను సరైన రీతిలో విశ్లేషించడంలో భాగంగానే శేషయ్య హక్కుల ఉద్యమానికి దిక్సూచి అయ్యాడు. పోరాటాలు సాధారణంగా తరగతి, కులం, జెండరు, వర్గం, ఇతర సామాజిక కలయికల చుట్టూ నిర్మించబడవచ్చు. ఇది చివరికి సంస్కరణను కోరవచ్చు. ఆయా రంగాలలో పోరాటాలు రాజకీయ జ్ఞానాన్ని పెంచుతాయి. రాజ్యాంగ ఆదేశాలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే పభ్రుత్వాలు పనిచేస్తాయని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు.  

సాయుద ఉద్యమాలు చేసే వ్యూహాలు, కొన్ని పొరపాట్లు విజయవంతం కానప్పుడు ఉద్యమాలు తమ పంధాను మార్చుకుంటాయి.  టెలిఫోన్లు ఎక్సేంజులు పేల్చడం, బస్సులు తగలబెట్టడం లాంటివి ఇప్పుడు జరగడం లేదు. అప్పటి పరిస్ధితుల్లో అవి వారికి అవసరమైనవిగా కనిపించవచ్చు. అలా అని ఉద్యమాలు సాధించిన విజయాలను తక్కువ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు.  ఏ సందర్భంలోనైనా దాని లబ్ధిదారులు కతజ్ఞతతో ఉంటారు. 

నక్సలైట్లు  ప్రతి హింసాత్మక పోరాటపు వ్యూహాలు గొప్ప ప్రభావాన్ని చూపాయని పోలీసులే చెపుతున్నారు.  స్థానిక సామాజిక, రాజకీయ నిర్మాణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపారనడంలో సందేహం లేదు. నక్సలైట్‌ ఉద్యమపు గత చరిత్ర వైపు  తిరిగి చూస్తే, ప్రభుత్వం చేసిన  అనేక  విధాన నిర్ణయాల వెనుక వారి కృషి వుంది.  వారి వ్యూహాత్మక ఆలోచన రాజకీయంగా అధికారాన్ని చేపట్టడమే కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికపరంగా ప్రజలను సమీకరించడం. అందువల్ల ప్రధాన రాజకీయ పరాజయాలను,  విధ్వంసక అభివద్ధి పోకడలకు వ్యతిరేకంగా పోరాడటం వారికి అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే,  ఒక భూస్వామి తలపై తుపాకీని గురి పెట్టడటం అంటే, ప్రత్యేక ఆర్థిక మండలాలకు, కారిడార్లకు, అక్రమ మైనింగ్‌లకు వ్యతిరేకంగా పోరాడటమే. ఈ సమస్యను సరళీకతం చేయడం అన్యాయమని విమర్శించవచ్చు. మావోయిస్టులు వ్యక్తిగతమైన ప్రయోజనం కోసమే ప్రతిహింస చేస్తున్నారని  సాధారణ ప్రజలు ఎవ్వరూ అంగీకరించలేరు. దీనికి ప్రజా రంగం సాక్ష్యంగా       ఉంది, జనతన సర్కార్‌ సజీవంగా వృద్ధి చెందుతోంది.  ఇవి చాలా నెమ్మదిగా జరిగే క్రియలని శేషయ్య అనేవారు.

న్యాయస్ధానాలలో గురిగింజ న్యాయం  

న్యాయస్ధానాల ద్వారా ప్రజా హక్కులను ఎంతో కొంతమేరకు కాపాడాలనే తలంపును శేషయ్య చేసేవారు. న్యాయవ్యవస్ధకున్న   అప్రజాస్వామిక వైఖరిని గుర్తిస్తూనే ఈ పని జరగాలని ఆయన వాంఛించేవారు. సగటు తెలివిగల భారతీయుడు ఈ రోజు పిల్‌ను ఆధునిక ఆలోచనకు నాందిగా భావిస్తాడు, ఎన్‌కౌంటర్లంటే పట్టుకుని కాల్చి చంపడమనే విజ్ఞానాన్ని కలిగివున్నాడు. దీనికి శేషయ్య లాంటి నాయకుల కృషి చాలా వుంది. పిల్‌లను వినడానికి న్యాయస్థానాలలో న్యాయాధికారులు కూర్చున్నప్పుడు, న్యాయాధికారులు న్యాయవ్యవస్థకు వున్న అన్ని పరిమితులను దృష్టిలో పెట్టుకుంటారనే విషయాన్ని గ్రహించడానికి శేషయ్య వేసిన పిటీషన్లు ఉపయోగపడతాయి. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని హైకోర్టు శేషయ్య ఇచ్చిన పిటీషన్‌ పైనే తీర్పు ఇచ్చింది. కాని సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టింది. అందుకే పౌరహక్కుల సంఘం నాయకుడు శేషయ్య న్యాయవ్యవస్ధలకు వున్న ద్వంద్వ స్వభావాన్ని ముందే గ్రహించాడు. కొన్ని సందర్భాలలో న్యాయస్ధానాలను ఆశ్రయించడం మంచిది కాదని చెప్పాడు. ప్రజాపోరాటాలే అంతిమ పరిష్కారమని చెప్పాడు. ఆదివాసీలను పౌలీసులు, మావోయుస్టుల పేరుతో కాల్చి చంపుతున్నారని విశాఖలో హక్కుల న్యాయవాది 2019లో కోర్టులో కేసు వేశారు.  మావోయిస్టులకు మద్దతుగా హక్కుల నాయకులు కేేసులు వేయకూడదని కోర్టు మందలించింది. నిజానికి జగన్‌ ప్రభుత్వం 2020లో హైకోర్టులోని న్యాయమూర్తులపై, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామిక  పభ్రుత్వాలే న్యాయవ్యవస్ధ మీద నమ్మకాన్ని కోల్పోయే కాలం వస్తుందని శేషయ్య తన విద్యార్ధులకు చెప్పాడు.

  ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను జారీ చేయడం ద్వారా కోర్టులు నిరంకుశత్వాన్ని సమాజంలో నెలకొల్పుతున్నాయి.    న్యాయమూర్తులు, ఒక తరగతిగా తీసుకోబడినవారు. వారు విభిన్న రాజకీయ, ఆర్ధిక ధోరణులతో ఉన్నారు. వారు వివిధ సామాజిక తరగతులకు చెందినవారు.  వారి ధోరణుల వల్ల చాలా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈ రోజుల్లో సుప్రీంకోర్టు వ్యక్తిగత హక్కులపై తీర్పులను ఇవ్వడంలో ఉత్సాహంతో ఉన్నాయి. కాని సాంప్రదాయిక న్యాయ క్రియాశీలత వల్ల న్యాయవ్యవస్ధపై ప్రజలకు నిరాశ కలుగుతోందని శేషయ్య తన ఉపన్యాసాల్లో చెప్పారు. 


Comments