అసమాన సమాజంలో అసాధారణ వ్యక్తి - 2

ఎపిసిఎల్‌సి కార్యదర్శి ప్రొఫెసర్‌ శేషయ్య ఇంటిపై అనాగరిక దాడి

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ (ఐపిసిఎల్‌సి) ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎస్‌. శేషయ్య ఇంటిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మరుసటి రోజు ఉదయం ప్రొఫెసర్‌ శేషయ్య ఇంటి వెలుపల రాయలసీమ టైగర్సు అనే సంస్ధ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఎపిసిఎల్‌సి నుండి ప్రొఫెసర్‌ శేషయ్య రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక లేఖను వారు శేషయ్య ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. లేకపోతే అతన్ని చంపివేస్తామని బెదిరించారు. 

23.11.2005 (బుధవారం) రాత్రి 10.30 గంటలకు గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తలు  మొదట కారిడార్‌లో నిలిపిన మారుతి జెన్‌ కారు  లైట్లు, విండ్‌స్క్రీన్‌లను పగులగొట్టి ఇంటి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు.  ప్రొఫెసర్‌ శేషయ్య తన భార్య శశికళ (ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌,  విరసం సంస్ధ సభ్యురాలు) తో, అతని తల్లి, కొడుకుతో   ఇంట్లో వున్నారు. అరగంట పాటు భీభత్సం సష్టించిన తరువాత దాడి చేసినవారు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయారు. కారిడార్‌లోని ఫర్నిచర్‌, కొన్ని పుస్తకాలు, తలుపు, కిటికీ కర్టెన్లను దాడి చేసినవారు తగలబెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జిరిగింది. వాళ్లు అంటించిన మంటలను ఆర్పడానికి ప్రొఫెసర్‌ శేషయ్య అగ్నిమాపక శాఖకు, విషయాన్ని తెలపడానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

అనంతపూర్‌ లోని శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయ విభాగం అధిపతిగా ఉన్న ప్రొఫెసర్‌ శేషయ్య (64) 1998 నుండి ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా సిఎల్సిలో చురుకుగా పనిచేస్తున్నారు.తను కార్యదర్శి అయినప్పటి నుండి అతనికి చాలా అనామక ఫోన్‌ కాల్సు వచ్చాయి. 2005లో అతను నిరంతర బెదిరింపులను అందుకున్నాడు. 

సిఎల్‌సి పౌర, ప్రజాస్వామ్య హక్కులు, న్యాయ పాలన కోసం పోరాడుతుంది.  ముఖ్యంగా రాష్ట్ర చట్టవిరుద్ధతకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది.  గత నాలగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు జవాబుదారీతన్నాన్ని కోల్లోయాయి.  హక్కులను కాపాడటంలో సంఘం విశేషమైన కషి చేస్తోంది. అలా చేయడం ద్వారా, చాలా మంది సిఎల్సి కార్యకర్తలు అనేక అడ్డంకులను, తీవ్రమైన వ్యక్తిగత నష్టాలను ఎదుర్కొన్నారు. సిఎల్సి ఇప్పటివరకు 6 మంది నాయకులను గుర్తుతెలియని పోలీసుల చేతిలో,  ప్రభుత్వ కిరాయి హంతక ముఠాల చేతిలో కోల్పోయింది. సిఎల్సి  సభ్యులు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యారు. సిఎల్‌సిపై మాత్రమే కాకుండా, అనేక ఇతర ప్రజాస్వామ్య సంస్థలపై కూడా ప్రభుత్వం దాడులు చేస్తోంది.   పౌర, ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు. పైగా ప్రభుత్వం పోలీసుల ఆదేశాల మేరకు నడుస్తోంది. చంద్రబాబు టిడిపి పాలనలో, కాకతీయ పులులు, నల్లమల పులులు, ఆకుపచ్చ పులులు వైయస్‌ రాజశేకర్‌ రెడ్డి పాలన లోను అనేక పులుల సంస్ధల పేరిట సంఘ కార్యకర్తలకు బెదిరింపులు అందాయి. కోబ్రాస్‌, నర్సా కోబ్రాస్‌, నల్లమల కోబ్రాస్‌ లాంటి ముసుగు సంస్ధలు సిఎల్సి  నాయకులను బెదిరించాయి. హక్కలను రక్షించడం,  మానవ హక్కులను పరిరక్షించడాన్ని సిఎల్సి సీరియస్‌ గా తీసుకుంది.  అందుకే  ఆ సంస్ధ అణటివేతకు గురౌతోంది. 

శేషయ్యపై దాడికి నేపధ్యం

మావోయిస్టు పార్టీ మహాబూబ్‌నగర్‌ జిల్లాలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నర్సారెడ్డిని 2005 ఆగస్టులో చంపింది.  దీనితో సిఎల్సి, ప్రజా సంఘాలపై  కొత్త అణచివేత ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసులు ప్రేవేటు సాయుధ ముఠాలచే ప్రజా సంఘ కార్యకర్తలను హతమార్చడం మొదలుపెట్టారు.  మహాబూబ్‌నగర్‌ జిల్లాలో సీనియర్‌ కార్యకర్త ఉపాధ్యాయ సంఘం నాయకులు కనకాచారిని  24.8.2005 ను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను తామే చేశామని నర్సా కోబ్రాస్‌ ప్రకటించింది. ఈ హత్య తరువాత నర్సా కోబ్రాస్‌ తమ హిట్‌ లిస్టుతో   ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.  వివిధ వర్గాల ప్రజల చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న అనేక సామూహిక సంస్థలకు చెందిన కార్యకర్తల పేర్లు ఇందులో వున్నాయి. ఈ పేర్లలో 90 శాతం పేర్లు సిఎల్సి కార్యకర్తలవే.  10.9.2005 న మూడు వారాల తరువాత, జిల్లా సహకార బ్యాంకు ఉద్యోగి, కుల నిర్ములన పోరాట సమితి (కెఎన్పిఎస్‌) ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మన్నెం ప్రసాద్‌ హత్యకు గురయ్యారు.

దీనికి బాధ్యత వహిస్తూ కోబ్రాస్‌ ఒక ప్రకటన ఇచ్చింది.  ఈసారి నల్లమల కోబ్రాస్‌ పేరిట ప్రకటన వచ్చింది.  ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత 15.9.2005 న కరీంనగర్‌ జిల్లాకు చెందిన మిస్టర్‌ లింగారావును నక్సల్సు బాధిత  సంఘం పేరుతో బెదిరించారు. తర్వాత చంపేశారు. మళ్ళీ దీని తరువాత మరొక జాబితాను ఈసారి కాకతీయ కోబ్రాస్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో పేర్లు కూడా సిఎల్సి నాయకుల, కార్యకర్తల పేర్లు వున్నాయి. జాబితాలోని వారు తక్షణమే వారి  సంస్థలకు రాజీనామా చేయాలని బెదిరించారు. వివిధ మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య సంస్థలకు చెందిన 77 మంది వ్యక్తులు ప్రతటించిన జాబితాలో వున్నారు. 

 కోబ్రాస్‌ పోలీసుల సష్టి తప్ప మరొకటి కాదని ప్రజలకు తెలుసు. పైన పేర్కొన్న అన్ని సంఘటనలు జరిగి చాలా రోజులు గడిచినప్పటికీ, రాష్ట్ర పోలీసులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎవరినీ ప్రశ్నించలేదు. .

అప్పటి పరిస్థితి

19.11.2005 న, ఎపిసిఎల్సి జిల్లా కన్వీనర్‌, వరంగల్‌ యూనిట్‌ నాయకులు వీరన్న ఇంటిపై కాకతీయ కోబ్రాస్‌ దాడి చేసింది.  ఆ దాడిలో అతని ద్విచక్ర వాహనం కూడా దెబ్బతింది. ఆయనను ఐపీసీఎల్‌సీకి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 22.11.2005 న మహబూబ్‌నగర్‌ జిల్లాలో నర్సి కోబ్రాస్‌ చేత దళిత పాఠశాల హెడ్‌ మాస్టర్‌ మిస్టర్‌ డి.మునెప్పను కాల్చి చంపారు. 23.11.2005 రాత్రి ఎపిసిఎల్‌సి కార్యదర్శి ప్రొఫెసర్‌ శేషయ్య ఇంటిపై దాడి చేశారు. సిఎల్సి నాయకులు ప్రొఫెసర్‌ జెకర్యా, విజయ్‌ కుమార్‌, పురుషోత్తం, కులయప్ప, హరినాథారెడ్డి,  నాగన్నలను డిసెంబర్‌ 1 లోగా తమ పదవులను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వారు చంపబడతారని హెచ్చరించారు. వాస్తవానికి 23 నవంబర్‌ అదే రోజు, 5 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో %ూూజకూజ% జాయింట్‌ సెక్రటరీ  పురుషోత్తంను నయూం ముఠా చంపేసింది. 

 2014లో హౌస్‌ అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ అధ్యక్షుడు, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌  ప్రొఫెసర్‌ ఎస్‌. శేషయ్యను 29.9.2014న అనతంపురుం  పోలీసులు అదుపులోకి తీసుకుని గహ నిర్బంధంలో ఉంచారు. ఎపిసిఎల్‌సి జిల్లా అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు హరినాథారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొమ్మయ్యలను కూడా అదుపులోకి తీసుకున్నారు.    తిరుపతిలో   సమావేశానికి హాజరుకాకుండా వారిని గహ నిర్బంధంలో ఉంచారు. రెవొల్యూటినరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని శేషయ్య డిమాండ్‌ చేశారు.  తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ మాజీ అధ్యక్షుడు అకుల భూమయ్య మతిపై జ్యుడీషియల్‌ దర్యాప్తును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ను ఆపాలని, గిరిజనులకు నివాసయోగ్యమైన పరిస్థితులను కల్పించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో మోహరించిన పారా మిలటరీ దళాలను ఉపసంహరించుకోవాలని శేషయ్య ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని శేషయ్య గహ నిర్భంధం నుండే కోరారు. ప్రొఫెసరు శేషయ్య కేవలం పౌర హక్కుల కార్యకర్తే కాదు, అన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడిన  క్రూసేడర్‌.  అతని అకాల మరణం  దేశంలోని పలు హక్కుల సంస్ధల ఉద్యమకారులను తీవ్రంగా బాధపెట్టింది. 

గిరిజన ప్రాంతాల్లోని సామాన్య ప్రజల కష్టాలను, హక్కుల ఉల్లంఘణలను ఆయన మీడియాకు చాలా సందర్భాల్లో వివరించారు. హక్కులు వ్యక్తి కేంద్రంగా కాకుండా, సామాజికత కేంద్రంగా వుంటాయని ఆయన చెప్పేవారు. భారతదేశ ప్రజాస్వామ్య హక్కుల సంఘం అమూల్యమైన ఆస్తిని కోల్పోయింది. భారతదేశపు ప్రగతిశీల ప్రజాస్వామ్య ఆలోచనకు ఆయన హక్కుల చైతన్యం ఎంతో దోహదపడింది.


Comments