శేషయ్య సంస్మరణ సభ (అనంతపురం జిల్లా)


18/10/2020 ,ఆదివారం నాడు పౌర హక్కుల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాడి పత్రి రెవిన్యూ భవన్ లో పౌర హక్కుల సంఘం ఉమ్మడి రాష్ట్రాల సమన్వయ కర్త,CDRO జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య గారి సంతాప సభ జిల్లా సహాయ కార్యదర్శి బి.శ్రీరామ మూర్తి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.. ఈ కార్య క్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రొఫెసర్ శేషయ్య గారు అనారోగ్యానికి గురి అయి హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ 10/10/2020 న మరణించారు.

ఆయన మరణం భారత పీడిత ప్రజలకు,శేషయ్య గారి కుటుంబానికి, పౌరహక్కుల సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు .శేషయ్య గారి సహచరి శశికల అక్క గారికి,కుమారుడు అరుణ్ ,కోడలు కు పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ శేషయ్య గారు  20/09/1954 న కర్నూల్ జిల్లా నందికొట్కూరు లో  జన్మించి తన ప్రాథమిక ,ఉన్నత విద్యను నందికొట్కూరు లోనే పూర్తి చేసుకొని న్యాయశాస్త్ర విద్యను అనంత పురంలో, లా మాస్టర్ డిగ్రీ ఎస్వీయూ లోచడివాడు,తిరుపతిలో చదువుతుండగా 1976 ప్రాంతంలో యూనివర్సిటీ లో విద్యార్థుల సమస్యల పై,ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పోరాటాలు జరపడమే గాక ,ప్రగతి శీల భావాలు కలిగి ,అప్పట్లో ఉవ్వెత్తున ఎగసిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU) లో క్రియా శీలక పాత్ర పోషించి ఎన్నో సమస్యలపై విద్యార్థులకు నాయకత్వం వహించి ఎన్నో పోరాటాలు చేశారు.చదువు పూర్తి చేసుకొని అనంతపురం లోని SKU  లో . "లా " కాలేజీ లో అధ్యాపకుడిగా,ఆచార్యుడిగా తరగతి గదుల్లో పాఠ్యాంశాలు చెపుతూ,తరగతి బయట  ప్రగతి శీల భావాలు కల్గిన విద్యార్థులతో గంటల తరబడి సమాజంలో జరుగుతున్న అసమానతలు గురించి చర్చించే వాడు.శేషయ్య గారు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం లో చేరి పీడిత ప్రజల హక్కుల కోసం పరితపించి నిరంతరం పోరాడిన యోధుడు..

అంతేకాకుండా రాయల సీమలో ముఠా కక్ష్యలకు,పాక్ష నిజాన్ని రూపు మాప డానికి రాయలసీమ అంతా తిరిగి పాక్షణిస్టులను ,వారి వల్ల చనిపోయిన కుటుంబ సభ్యుల ను కలిసి ప్రజల్లో చైతన్యం కలగడానికి సమగ్రమైన నివేదిక రూపంలో "ఫాక్షన్ మాఫియా"   పుస్తకాన్ని తీసుక రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది..రాయల సీమలో కరువు రాకాసిని పారదోలాలంటే రాయల సీమలో ఉన్న పెండింగ్ నీటి ప్రాజెక్ట్ లను సత్వరమే పూర్తి చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని బలంగా వాదించేవారు.అంతే గాక రాయల సీమలో మహిళల రవాణా(కొంత మంది దళారుల చేతుల్లో జీవనోపాధి కల్పిస్తామని చెప్పి ముఖ్యంగా ట్రైబల్ మహిళలను మోసగించి పూణె,డిల్లీ ,ముంబాయి తదితర ప్రాంతాలకు వ్యభిచార గృహాలకు అమ్మి వేయడం) కు వ్యతిరేకంగా పోరాటం చేశారు.ఇలా చెప్పుకుంటూ పోతే శేషయ్య గారి జీవితమంతా పేద,బడుగు ,బలహీన వర్గాల కోసమే పనిచేశారు..సమాజంలో మాట్లాడలేని,గొంతుక లేని వారి తరుపున ఎన్నో సమస్యలపై మాట్లాడినా రు.ఈక్రమంలో సంస్థలో వైరుధ్య భావాలతో బాలగోపాల్ లాంటి ముఖ్య మైన నాయకులు సంస్థ నుండి బయటికి పోయి మానవ హక్కుల వేదిక ఏర్పాటు చేసుకున్న సంక్షోబ సమయంలో 1998 లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా భాద్యతలు తీసుకొని రాష్ట్ర కార్య వర్గంలో ఉన్న బాద్యులందరికి సమిష్టి బాధ్యత లు అప్పచెప్పి రెండు,మూడు ఎండ్లల్లోనే పౌర హక్కుల సంఘాన్ని నిర్మాణ పరంగా పటిష్ట పరిచాడు.ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలకు పాల్పడిన ప్రతి సందర్భంలోనూ ప్రశ్నించాడు,,ప్రజా ఉద్యమాలు తీవ్ర మైన కొద్దీ సంస్థ  తీవ్ర నిర్బంధం ఎదుర్కొంది. 

ఆ క్రమంలోనే 2000 నవంబర్ 23 న. అప్పటి రాష్ట్ర సహాయ కార్యదర్శి పురుషోత్తం ను ,2001 ఫిబ్రవరి 18 న నల్గొండ జిల్లా కార్యదర్శి ఆజామ్  ఆలి  లను రాజ్య ప్రేరేపిత హంతక ముటాలైన నయీం గాంగ్ చేత చంపబడ్డారు...అంతే గాక ఆయన ను కూడా చంపుతామని బెదిరింపులు వచ్చి, 2005  నవంబర్లో ఆయన ఇంటి పై పెట్రోల్ పోసి కారును తగలపెట్టడంజరిగింది .అయినా శేషయ్య గారు బెదరలేదు.అప్పటికే ఆరుగురు పౌరహక్కుల నాయకులను రాజ్యం బాలి తీసుకున్న మొక్కవోని దైర్యం తో,అకుంఠిత దీక్షతో శేషయ్య గారు రాష్ట్రమంతా తిరిగి కార్యకర్తలను కలిసి సంస్థను నిలబెట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు.శేషయ్య గారు ప్రజాస్వామిక ఉద్యమాలను స్వాగతించారు,మద్దతు ఇచ్చారు ఆకోనంలోనే తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టే విధంగా అంతర్గతంగా చర్చించేవారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత పౌర హక్కుల సంఘం (AP,TS) గాను రెండు రాష్ట్ర కమిటీ లకు సమన్వయ కర్త గా వ్యవరించారు..దేశంలో ఉన్న కలిసి వచ్చే పౌర,ప్రజాస్వామిక హక్కుల సంఘాలను ఏకం చేసి దానికి" కో _ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్" ను ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా జాతీయ కన్వీనర్ గా ఎన్నుకోబడిన గొప్ప నాయకుడు ... ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురి అయి 10/10/2020 మరణించారు..చివరి కంటూ ప్రజల హక్కుల కోసం పోరాడిన శేషయ్య గారి ఆశయాలను,ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లి బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని శేషయ్య గారిని శ్లాఘించారు..

     రైతు సంఘం నాయకుడు రాజా రామి రెడ్డి మాట్లాడుతూ శేషయ్య సార్ తో నాకు,నా కుటుంబానికి 25 సంవత్సరాల అనుబంధం ఉందని,ఆయన ఎప్పుడూ ప్రజల కోసం పోరాడిన మహా నాయకుడని,ఆయనను ఎప్పుడూ కలసినా ప్రజల బాధలు,సమస్యలు గురించే చర్చించే వారని కొనియాడారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఆదినారాయణ మాట్లాడుతూ సార్ నుండి మేము ఎన్నో తెలియని విషయాలను నేర్చుకున్నానని,ప్రజల పట్ల బాధ్యత గా ఉండాలని ఉద్బొడించేవారని కొనియాడారు..అనంతపురం సూర్య నగర్ పేదల వైపు పోరాటం చేసి వారికి అండగా నిలబడి పట్టాలు ఇప్పించారని ఇలాంటి ఎన్నో పోరాటాలను చేశారని ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నరసింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్య క్రమంలో ప్రజా కళా మండలి విజయ్ బృందం పాల్గొని శేషయ్య సార్ పేద ప్రజల కోసం చేసిన సేవలను కొనియాడారు.  ఈ కార్యక్రమానికి ముందుగా సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి సమావేశంలో పాల్గొన్న వారందరూ ఘన నివాళులు అర్పించారు.

    పౌర హక్కుల సంఘం,
    అనంతపురం జిల్లా శాఖ
         (తాడిపత్రి)
18/10/2020..

Comments