ఉత్తరప్రదేశ్ లో దళిత యువతి పై అత్యాచారానికి వ్యతిరేకంగా ధర్నా (కడప జిల్లా)

01/10/2020  
 రాయచోటి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ లో దళిత యువతి మనిషా తమ ఇంటిగగ్గర్లో  ఉన్న పొలంలో గడ్డి కొస్తు ఉండగా అక్కడే కాపుకాచిన అగ్రవర్ణ ఠాగూర్ వర్గానికి చెందిన నలుగురు  వ్యక్తులు ఆమె ను లాక్కెళ్లి నాలిక కోసి అత్యాచారం చేశారు.తర్వాత ఆమె వెన్నెముక ను విరగా కొట్టి మెడదగ్గర కత్తితో నరికి గాయపరిచారు.కూతురు ఎంతసేపటికి రాకపోయేసరికి తల్లి వేతకగా అపస్మారక స్థితి లో ఉన్న కూతురిని ఆసుపత్రిలో చేర్చగా మృత్వు వుతో పోరాడి మంగళవారం.చనిపోయింది.ఆవిషయం తల్లిదండ్రులు కు చెప్పిన పోలీసులు శవాన్ని ఇస్తామని చెప్పి వారిని ఒక గదిలో వేసి బంధించి శవాన్ని తెల్లవారుజామున 3 గo కు పోలీసులు తగలబెట్టి సాక్ష్యాలు లేకుండా చేయడం జరిగింది. 

ఇదంతా చూస్తే ముఖ్యమంత్రి,డిజిపి లు నిందితులను అరెస్టు చేయకుండా వదిలేయడానికి పథకం వేశారు ...దీన్ని నిరసిస్తూ క్యాండీల్ ర్యాలీ చేయడం జరిగింది.ఈకార్యక్రమం లో జిల్లా పౌరహక్కుల సంగం ప్రధాన కార్యదర్శి ఆర్.రవిశంకర్,citu నాయకులు రామంజులు, టీడీపీ నాయకులు.,మనోహర్,బీసీ సంక్షేమ సంగం నాయకులు న్యాయవాది అయిన నాగముని, చైతన్య మహిళ నాయకురాలు ఝాన్సీ,ఏఐఎఫ్ నాయకులు లవకుమార్,బీసీ సంక్షేమశాఖ మాజీ నాయకులు రెడ్డెప్ప,శేఖర్,రమణ యుగంధర్ పాల్గొన్నారు.  ఇలాంటిసంఘటనలు ఖండిస్తూ నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Comments