ఒకే దేశం ఒకే పన్ను విధానం పేరుతో జీఎస్టీ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది.అప్పటి నుంచి రాష్రాల ఆర్ధిక కష్టాలు ప్రారంభమైనవి. ప్రజలకు అరకొర జరుగుతున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, రోడ్లు లాంటి పనులు కూడా జరిగే స్థితి లేదు.విద్య కి సంబంధించి బడ్జెట్లో కేటాయింపు నిపుణుల చూసిన మేరకు జరగటం లేదు.వైద్యం ప్రైవేట్ పరం.ప్రభుత్వ వైద్యం కుంటుపడింది.రోడ్లు మరీ ఘోరం.అధికార,ప్రతిపక్ష ల మాయాజాలం లోప్రజా సంక్షేమం ఆట కెక్కింది. Gst వలన ఇంత నష్టం జరుగుతుంటే దానికీ తోడు కరోనా. కరోనా నష్టం చెప్పనలవి కానిది. సామాన్యులకు, మధ్యతరగతి కి జరిగే నష్టం అపారం. వీరి నష్ట నివారణను పట్టించుకునే నాధుడు లేడు. రాజ్యాధిపతులు ఏమో అంబానీ, ఆదాని లాంటి వారి సేవల్లో మునిగి తేలుతుంటాడు.నీరజ్ మోడీ, లలిత్ మోడీ లాంటి కార్పొరేట్స్ కి కోట్లాది రూపాయల రుణ మాఫీలు,ప్రత్యేక ప్యాకేజి లు ప్రకటించి ఎగవేత దారులను రక్షించేందుకు తలమునకలై పని చేస్తున్నారు.
సామాన్యులు రక్షణ గాలి కి వదిలేశారు. GSt వస్తు సేవల పన్నులో సరుకులు కొని చేసే చెలింపులలో సామాన్య,మధ్యతరగతి ప్రజాలదే సింహభాగం. పన్నులు భారం అంతా వినియోగదారుల పైనే భారం. ఏ కార్పొరేట్ వస్తువులు ఉత్పత్తి కోసం శ్రమ చేయడు. సంపదను సృష్టించలేడు. నూటికి 2% కూడా లేని కార్పొరేట్ లకు కోట్లాది రూపాయల లబ్ది పొందే ప్రత్యేక ప్యాకేజి. 85% ఉన్న ప్రజలకు కరోనా ప్యాకేజీ గుండు సున్నా.Bpl వారికి రేషన్ బియ్యం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎదో కధ లో లాగా పాల సముద్రాన్ని తక్కువ మంది సురులు అమృతాన్ని దోచుకుతిన్నట్లు విషం అసురులకు ఇచ్చినట్లు వారు తినటానికి పనికి రాని బియ్యాన్ని ప్రజలకు ఇస్తున్నారు. కరోనా కాలంలో నిర్మాణ రంగం లోని తాపీ పనివారు,పెయింటర్,రాడ్ బెండింగ్,వడ్రంగి,ఎలక్ట్రికల్,ఇసుక,సిమెంట్,ఐరన్,ఇటుక మోత వార్ల జీవనం దుర్భరంగా మారింది. వలస కార్మికుల బతుకులు,బాధలు చూడనాలవి కావు. దేశ సంపదను సృష్టించేది ఇలాంటి శ్రామికులే. Gst లో కానీ, సంపద లో కానీ సామాన్య, మధ్యతరగతి ప్రజల వాటా వారికే దక్కాలి.ప్రజల వాటా ప్రజలకే దక్కాలని కోరుకున్న మేధావులను జైలు పాల్జేస్తున్నారు.జైలులో నిర్బంధించి వి.వి, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి మేధావుల ప్రజాస్వామిక స్వరాలను,కల్లాలను నిర్బంధానికి అణచివేతకు గురి చేస్తున్నారు. రాజ్యాధి నేతలు అప్రజాస్వామికం గా వ్యవహరిస్తున్నారు.వారి ధోరణి,విధానం సమాజాన్నీ తిరోగమన దిశ లోనికి తీసుకుని వెళుతుంది. ఇది సమాజానికి నష్టం.
Gst పన్నుల సేవలో, సంపద లోను ప్రజల వాటా ప్రజలకు పంచాలి. లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీని బడాబాబుల కట్టబెట్టడం దుర్మార్గం అప్రజాస్వామికం పన్ను ఎగవేతదారుల దారులను రుణ ఎగవేతదారుల ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి వారి ఆస్తులను జప్తు చేసి ప్రజలకు పంచి పెట్టారు ప్రజల కష్టం ప్రజలకే దక్కాలి ఇది వారి హక్కు ప్రజలు జీవించే హక్కుల కోసం, ప్రజాస్వామిక పాలన కోసం ప్రజాస్వామిక చైతన్యం తో గొంతెత్తి నిలదీద్దాం. Gst లోను,సంపద లోను వాటాలు కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుని తినటం కోసం కొట్లాడు కుంటున్నాయి కానీ అవి ప్రజలకు దక్కాలని ప్రజాస్వామికం గా డిమాండ్ చేస్తున్నాము.
- నంబూరి. శ్రీమన్నారాయణ
Comments
Post a Comment