మేధావుల పై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం (చిత్తూరు జిల్లా)


రౌండ్ టేబుల్ సమావేశం

మేధావుల అణచివేతను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల జాతీయ సమాఖ్య( సి డి ఆర్ వో)  పిలుపుమేరకు పౌరహక్కుల సంఘం చిత్తూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో తిరుపతి లో  సిపిఎం కార్యాలయం లో  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి వి. నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. 
 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న హిందుత్వ అజెండా ను వ్యతిరేకిస్తున్న  మేధావుల్ని ,కళాకారుల్ని , హక్కుల నేతల పై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడాన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ వ్యతిరేకించాలని సమావేశం పిలుపునిచ్చింది. 

ఊపా లాంటి దుర్మార్గమైన చట్టాన్ని భీమా కోరేగావ్ కుట్రకేసు పేరుతో మేధావుల పై ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.  అసమ్మతిని అణచివేసే కుట్రలో భాగంగానే ఇటువంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. దురదృష్టవశాత్తూ కోర్టులు కూడా వీరికి బెయిల్ నిరాకరించడం  కోర్టుల అప్రజాస్వామిక వైఖరికి అద్ధం పడుతుంది. ఐక్య ప్రజాస్వామిక పోరాటాలే అంతిమంగా నిరంకుశ ప్రభుత్వాల మెడలు వంచుతాయని పేర్కొన్నారు.  

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చిత్తూరు జిల్లా యూనిట్ అధ్యక్షులు ఆర్.  షామీర్ భాషా ,  పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతి చైతన్య ,జిల్లా కార్యదర్శి వి. నాగేశ్వరరావు , సిపిఎం జిల్లా నాయకులు నాగరాజు, సిపిఐ జిల్లా నాయకులు పెంచలయ్య, మానవ హక్కుల వేదిక నాయకుడు మదన్ శేఖర్, దళిత నాయకులు రమేష్,  అంబేద్కర్  ఆర్మీ నాయకులు రాజా, తదితరులు పాల్గొని ప్రసంగిస్తూ   దేశవ్యాప్తంగా అరెస్టయిన రాజకీయ ఖైదీల అందరినీ బేషరతుగా విడుదల చేయాలని , అలాగే ఊపా లాంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.

Comments