హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా ధర్నా (పెద్దపల్లి జిల్లా)


ఆలిండియా నిరసన తెలంగాణ అమరవీరుల స్తూపం  పెద్దపెల్లి జిల్లా కేంద్రం

CDRO ప్రజాస్వామిక, పౌరహక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా 22 సెప్టెంబర్,2020 న భారత దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరసన దినం పాటించాలని ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ(COORIDINATION OF DEMOCRATIC RIGHTS ORGANISATION-CDRO) నిరసన పిలుపు మేరకు ఈ రోజు  22,సెప్టెంబర్,2020న తెలంగాణ రాష్ట్రం, పెద్దపెల్లి జిల్లా కేంద్రం లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పౌర హక్కుల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్, విరసం, CPI, కాంగ్రెస్ పార్టీ, జమాతే ఇస్లాం హింద్, దళిత లిబరేషన్ ఫ్రంట్, MRPS, కూనారం భూసాధన పోరాట సమితి మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు...

ప్రజాస్వామిక, పౌరహక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా 22 సెప్టెంబర్,2020 న భారత దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరసన దినం పాటించాలని ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ(COORIDINATION OF DEMOCRATIC RIGHTS ORGANISATION-CDRO)పిలుపునిచ్చింది.ప్రజలారా BJP ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక పథకం ప్రకారం దళితులు, ఆదివాసులు,మైనారిటీలపై దాడులు చేస్తూ వారికి అండగా ఉన్న ప్రజాస్వామిక వాదులను,న్యాయవాదులను,హక్కుల సంఘాల నాయకులను,పర్యావరణ పరిరక్షకులపై దాడులుచేస్తూ వేలాదిమంది ప్రజలను,ఆదివాసులను నిర్వాసితులు చేసి,వారి జీవించే హక్కును హరిస్తూ జైళ్లలో నిర్బంధించారు.విదేశాలనుండి నల్లధనం తెస్తాం,బ్యాంక్ అకౌంట్ లో పేద మధ్య తరగతి ప్రజలందరికీ డబ్బులు వేస్తామని,అవినీతిని అంతమొందించుతామనిచెప్పి నోట్లనురద్దుచేసి, GST ని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టును ప్రభావితం చేసేవిదంగా మలుచుకొని,RBI, CBI, ED లాంటి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసినారు.82 సంవత్సరాల న్యాయవాది,కార్మిక,రైతులకు అండగాఉండి  పూణే పరిసర ప్రాంతాల్లో కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా,హైవే లో విచ్చల విడి టోల్ టాక్సీ లకు వ్యతిరేకంగా పోరాడినగోవిందా పన్సారే ను ఫిబ్రవరి2015లో,హంపి యూనివర్సివిటీ వైస్ ఛాన్సలర్ కల్బుర్గి ని ఆగస్ట్ 2015న,ప్రముఖ జర్నలిస్ట్ గౌరి లంకేష్ ను సెప్టెంబర్ 2017 లో బెంగళూర్ లో హత్య చేసినారు BJP-RSS అనుబంధ అజ్ఞాత వ్యక్తులు.ప్రముఖ హేతు వాది, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన  నరేంద్ర డబోల్కర్ ను 2013 లో మహారాష్ట్ర పూణేలో హత్య చేసినారు.ఇక ఈ హత్యలనుండి ప్రజాస్వామిక వాదులను,న్యాయవాదులను,హక్కుల సంఘాల నాయకులను,పర్యావరణ పరిరక్షకులను అణగారిన వర్గాలకు అండగా లేకుండా చేయడానికి  ఒక కొత్త కుట్ర కోణం తెరదీసినారు. 31,డిసెంబర్,2017 న పూణే వద్ద గలా భీమా కోరేగావ్ గ్రామంలో,200 సంవత్సరాల విజయోత్సవ ర్యాలీ మీటింగ్ కోసం దళితులు, ఇతర కళా మండలి లతో పాటు చాలామంది మేధావులు కలిసి ఏర్పాటు చేసిన ఎల్గార్ పరిషద్ ఆధ్వర్యంలో జరిగిన ఆ రెండు రోజుల సభల్లో RSS అనుబంధ నాయకుల ప్రోద్బలంతో దాడులు చేసి హింసకు పాల్పడ్డారు.

ఈ భీమా కొరేగావ్ పేరున ప్రధానమంత్రి ని హత్యకు కుట్రపన్ని నారంటూ భీమా కొరేగావ్ కేసు          (BK-15) పేరున దేశంలోని మేధావులను, ప్రజస్వామిక వాదులను,పౌరహక్కుల నాయకులను, ప్రొఫెసర్ల ను,కవులను సురేంద్ర గాడ్లింగ్,షోమాసేన్,సుధా భరద్వాజ్, అరుణ్ పేరిరా, సుధీర్ దావలే, వెర్నాన్ గొంజా ల్వేస్ ,మహేష్ రావత్, రోనావిల్సన్, గౌతమ్ నవలాఖ, ఆనంద్ తెల్ టుంబ్డే వరవరరావు, ప్రొఫెసర్ హనీ బాబు మరియు కబీర్ కళామంచ్ కళాకారులు సాగర్ గొఱకే, రమేష్ గైచొర్, జ్యోతిజగతప్ లతో 15 మందిని ఊపా (UAPA ) చట్టం కింద అరెస్ట్ చేసి అక్రమంగా  జైళ్లలో నిర్బంధించారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ GN సాయిబాబా ను మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నాడని తప్పుడు కథనాలు సృష్టించి జీవితఖైదును చేసినారు.ఈ అక్రమ అరెస్టులను ప్రపంచంలోని హక్కుల సంఘాలు, యూరోపియన్ పార్లమెంట్ దేశాల నాయకులు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఖండించిన కూడా ప్రశ్నించే గొంతులను అణిచివేయడం ఆపలేదు ఈ BJP-మోడీ ప్రభుత్వం. CAA, NPR, NRC చట్టాలతో మరింత పాశవిఖంగా  వ్యవరిస్తూంటే నిరసన తెలిపిన ముస్లిమ్ లపై దాడులు హత్యలు చేసి పోలీసుల సమక్షంలోనే గత జనవరి-ఫిబ్రవరిలలో ఈశాన్య ఢిల్లీలో BJP, RSS, నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా హింసకు పాల్పడ్డారు.కుట్రతో JNU మాజీ విద్యార్థి,ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ అల్లర్ల్ కేసును ఊపా (UAPA)ద్వారా అరెస్ట్ చేసినారు ఈనెలలోనే.ఈ అల్లర్లకు కారకులైనారని CPM నాయకులు సీతారాం ఏచూరి తో పాటు ఇంకా ఇద్దరి పై ఢిల్లీ కుట్ర కేసులు నమోదు చేసినారు. ఈ అరెస్టులు భీమా కోరేగావ్ లాగా పెంచే ప్రయత్నం లో ఉంది,కేంద్ర ప్రభుత్వం.కరోనా నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను, ప్రజలను పట్టించుకోకుండా కార్పొరేట్ వర్గాలకు అనుగుణంగా పనిచేసింది.కార్పొరేట్ వర్గాలకు అనుగుణంగా కార్మికచట్టాలను కుదించి యజమానులకు ఉపయోగపడేలా లేబర్ laws ను సవరించి,రైతులను నడ్డివిరిచేసి కార్పొరేట్లకు లాభసాటిగా ఉండేందుకు 20 సెప్టెంబర్,2020న  వ్యవసాయ బిల్లును తెచ్చింది,BJP-మోడీ ప్రభుత్వం..

 భీమా కొరేగావ్ కుట్ర కేసులు ఎత్తివేయాలని,రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని, ఊపా లాంటి నల్లచట్టాలను రద్దుచేయాలని మరియు గత జనవరి లో ఢిల్లీలో జరిగిన హింసకు అల్లర్లకు కారకులైన BJP, RSS కార్యకర్తలను మరియు నాయకులను వెంటనే అరెస్టుచేయాలని ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ(COORIDINATION OF DEMOCRATIC RIGHTS ORGANISATION-CDRO) డిమాండ్ చేస్తుంది.

కావున ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేధావులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భీమా కొరేగావ్ కుట్ర కేసులు ఎత్తివేయాలని,రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని, ఊపా లాంటి నల్లచట్టాలను రద్దుచేయాలని మరియు గత జనవరి లో ఢిల్లీలో జరిగిన హింసకు అల్లర్లకు కారకులైన BJP, RSS కార్యకర్తలను మరియు నాయకులను వెంటనే అరెస్టుచేయాలని నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం....


1.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
3..పుల్ల సుచరిత,సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
4.బొడ్డుపెల్లి రవి,E C మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
5.పోగుల రాజేశం,E C మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
6.కడ రాజన్న,E C మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
7.బాలసాని రాజయ్య, కన్వీనర్, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
8.గుమ్మడి కొమురయ్య,కన్వీనర్,తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపెల్లి జిల్లా..
9.కె.రాజు, ప్రజా సంఘాల నాయకులు, పెద్దపెల్లి.
10.తాండ్ర సదానందం, CPI జిల్లా కార్యదర్శి, పెద్దపెల్లి.
11.మార్వాడి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, దళితలిబరేషన్ ఫ్రంట్,తెలంగాణ.
12.ఈర్ల కొమురయ్య, అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా.
13.జమాత్ ఇస్లామి హింద్ పెద్దపల్లి అధ్యక్షుడు అలిముద్దీన్.
14జావీద్, సభ్యులు జమాత్ ఇస్లామి హింద్ పెద్దపల్లి.
15,జామీర్, సభ్యులు జమాత్ ఇస్లామి హింద్ పెద్దపల్లి.
16.లతీఫ్,జావీద్, సభ్యులు జమాత్ ఇస్లామి హింద్ పెద్దపల్లి.
17.జాఫర్,జావీద్, సభ్యులు జమాత్ ఇస్లామి హింద్ పెద్దపల్లి.
18.శంకర్,MRPS, పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధి.
19.రెడ్డిరాజుల సంపత్, కునారం భూ సాధన పోరాట సమితి.

సమయం ఉదయం 11:30,మంగళవారం,22,సెప్టెంబర్,2020
తెలంగాణ అమరవీరుల స్తూపం, పెద్దపెల్లి.

Comments