భీమా కొరేగావ్ కుట్ర కేసులు ఎత్తివేయాలని ధర్నా (నెల్లూరు జిల్లా)


ప్రజాస్వామిక, పౌరహక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా  సెప్టెంబర్ 22, 2020 న భారత దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరసన దినం పాటించాలని ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ (CDRO) మరియు పౌరహక్కుల సంఘం ( CLC ) పిలుపునిచ్చింది.

 భీమా కొరేగావ్ కుట్ర కేసులు ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని, ఊపా లాంటి నల్లచట్టాలను రద్దుచేయాలని మరియు గత జనవరి లో ఢిల్లీలో జరిగిన హింసకు, అల్లర్లకు కారకులైన BJP, RSS మతోన్మాదులను వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సాయంత్రం నెల్లూరు అంబేద్కర్ బొమ్మ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమం జరిగింది.

Comments