సెప్టెంబర్ 22 ఈ రోజును పౌర హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా నాయకత్వంలో నిరసన సభ పలాస మండలం లో జరిగింది నేడు దేశంలో ప్రజాస్వామిక పౌరహక్కుల నేతలందరినీ మరియు రచయితలు కవులు కళాకారులు మేధావులు బుద్ధిజీవులు పాలకుల విధివిధానాలను ప్రశ్నిస్తా ఉంటే ప్రశ్నించే వాళ్ళ పైన ఉపా చట్టాన్ని పెట్టి జైల్లో పెడుతున్నారు వాళ్ల కోసం బెయిల్ కోసం ప్రయత్నించే న్యాయవాదులతో సహా అందరి పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు విచారణ పేరిట N I A లాంటి సంస్థలు మరీ క్రూరంగా వ్యవహరిస్తుంది యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇతర మేధావులను అందులోని విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేశంలో ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రకటించే అందరిపైనా అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా సి డి ఆర్ సెప్టెంబర్ 22 నిరసన దినంగా పాటించాలని పిలుపునందుకుని ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కుల సంఘం నిరసన దినాన్ని పాటించింది.
ఇందులోభాగంగానే శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రజా సంఘాలను కలుపుకొని ఈరోజు సభ నిర్వహించింది ఇందులో జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు అందరు కూడా పాల్గొన్నారు అలాగే ప్రజా కళా మండలి అమరుల బంధుమిత్రుల సంఘం ఇతర ప్రజా సంఘాలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఉపా చట్టాన్ని రద్దు చేయాలని భీమా కోరేగావ్ కుట్ర కేసు రద్దు చేయాలని రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ అల్లర్ల కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి
Comments
Post a Comment