ప్రజాస్వామిక, పౌరహక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 22, 2020 న భారత దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరసన దినం పాటించాలని ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ (CDRO) మరియు పౌరహక్కుల సంఘం ( CLC ) పిలుపునిచ్చింది.
భీమా కొరేగావ్ కుట్ర కేసులు ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని, ఊపా లాంటి నల్లచట్టాలను రద్దుచేయాలని మరియు గత జనవరి లో ఢిల్లీలో జరిగిన హింసకు, అల్లర్లకు కారకులైన BJP, RSS మతోన్మాదులను వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మలికి పురంలో జరిగిన నిరసన కార్యక్రమం ప్లకార్డులు ప్రదర్శించి అనంతరం mro కు మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జె.మనోహర్, ఉపాధ్యక్షుడు ఓ. బాలాజీ, కోశాధికారి చెల్లింగి త్రిమూర్తులు, సామాజిక చైతన్య వేదిక కొల్లబతుల వీర్రాజు పాల్గొన్నారు.
Comments
Post a Comment