నూతన వ్యయసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి (కడప జిల్లా)


     
                           రాయచోటి,
                          29/09/2020.
    రైతాంగాన్ని   నడ్డి విరిచి కార్పోరేట్ వ్యాపారులకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసించండీ.
             పౌర హక్కుల సంఘం 
వర్షా కాల పార్లమెంట్ సమావేశాల్లో బి.జే. పి ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా తెచ్చిన రైతు వ్యవసాయక రంగాన్ని నష్ట పరిచే విధంగా ఉన్న మూడు బిల్లు లో 1.రైతుల పంటల ఉత్పత్తి...వ్యాపార వాణిజ్య చట్టం
2.రైతుల పంటల ధరల హామీ....సేవల ఒప్పంద చట్టం.
3.నిత్యావసర వస్తువుల చట్టం.

   ఈ మూడు చట్టాల వలన భారత రైతాంగాన్ని,వ్యవసాయాన్ని రిలయన్స్, అధాని లాంటి స్వదేశీ,విదేశీ కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికే నని పౌర హక్కుల సంఘం భావిస్తూ,తీవ్రంగా ఖండిస్తున్న ది .ఈ చట్టాలతో రైతులు తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోలేని పరిస్థితులు నెలకొంటాయి .దీనితో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను "గద్ద   కోడి పిల్లను ఎత్తుక పోయినట్లు చందాన ఉంది.వ్యవసాయ ఉత్పత్తులను కార్పోరేట్ సంస్థలు గిట్టు బాటు ధరలు కల్పించక ఎలాగైతే చిన్న, చిన్న వ్యాపారస్తుల   ను,కిరాణా షాపు లను,వీధి వ్యాపారస్తుల ను దెబ్బ తీసిన విధంగా కార్పోరేట్ "మాల్స్" వచ్చాయో ఆ విధంగా వ్యవసాయ ఉత్పత్తులను కార్పోరేట్ సంస్థలు దోసుకోడానికి బి.జే.పి ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను తెచ్చింది.మరో పక్క నిస్సిగ్గుగా అపద్ధాలు చెపుతూ రైతు పండించుకున్న పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చాని ,పంటలను వ్యాపారులు ఎటువంటి నియంత్రణ లేకుండా ఎక్కడైనా ఎంత మొత్తం అయినా చెల్లించి కొనవచ్చు అని చట్టం తెచ్చింది.అయితే ఈ చట్టంలో రైతులకు గిట్టుబాటు మద్దతు ధర అందించే విషయమే లేదు.

     రైతుల పంటల ధరల కు హామీలు..సేవల చట్టం మార్పు చేయడంతో పెద్ద,పెద్ద కంపెనీలు ముందుగా అంగీకరించిన ధరలను  రైతులతో ఒప్పందం  కుదుర్చు కుంటారు .దీనితో పెద్ద కంపెనీల దే కీలక పాత్ర అవుతుంది.దీనితో రైతాంగం తీవ్రంగా నష్టపోయి కోర్టులకు పోయే అవకాశం కూడా ఉండదు.కాబట్టి నష్టపోయిన రైతులు కుదేలై రైతుల ఆత్మ హత్యలకు దారి తీస్తాయి.

    నిత్య, జీవితావాసర చట్టం 1955 ప్రకారం కొన్ని వస్తువులను (ఆహార పదార్థాలు, ఎరువులు, ఉత్పత్తుల వంటివి)అవస రమైన వస్తువులను పేర్కొన డానికి కేంద్ర ప్రభుత్వం అధికారం ఇస్తుంది.అటువంటి అవసరం అయిన వస్తువుల ఉత్పత్తి సరఫరా,పంపిణీ,వాణిజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రించ వచ్చు. తృణ ధాన్యాలు, పప్పు  ధాన్యాలు,బంగాళా దుంపలు,ఉల్లి పాయలు,తినదగిన నూనె గింజలు,నూనెలతో సహా కొన్ని ఆహార పదార్థాల సరఫరాను కేంద్ర ప్రభుత్వం అసాధారణ పరిస్థితులలో మాత్రమే నియంత్రించ వచ్చు నని ఆర్డి నెన్స్ చెబుతున్నది.

   ఈ మూడు నల్ల చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని ఘోరంగా దెబ్బ తీయాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నది. ఈ నల్ల చట్టాల వల్ల వ్యవసాయానికి, కోట్లాది మంది రైతులను,వ్యవసాయ కార్మికులను ఇబ్బంది పాలు చేస్తాయి.వ్యవసాయాన్ని పెట్టుబడి దారుల చేతుల్లో తనఖా పెట్ట డానికి ఈ చట్టాలు ఉపయోగ పడుతాయి.కాబట్టి రైతాంగాన్ని నష్టపరిచే ఈ మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉప సంహ రించు కోవాల ని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. 

     ప్రజలు,ప్రజా సంఘాల,ప్రజాస్వామిక వాదులు,రైతాంగం ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నది...
ఈ కార్య క్రమంలో పాల్గొన్న వారు..1.సి.వెంకటేశ్వర్లు ,రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,
2. కె.మనోహర్,జిల్లా అధ్యక్షులు,
3.పి. రెడ్డయ్య ,జిల్లా ఉపాధ్యక్షుడు
4. ఆర్ .రవిశంకర్,జిల్లా కార్యదర్శి
5.యం.రవిశంకర్,జిల్లా సహాయ కార్యదర్శి,
6. వంగిమళ్ళ రమణయ్య ,జిల్లా కోశాధికారి,

పౌర హక్కుల సంఘం,
  కడప జిల్లా కమిటీ..

Comments