రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ధర్నా ( పశ్చిమ గోదావరి జిల్లా)


ఏలూరు 22.09.2020

పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు జూట్ మిల్ సెంటర్లో దేశంలో జరుగుతున్న పౌర ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన కు నిరసనగా అఖిలభారత నిరసన దినాన్ని పాటించడం జరిగింది పౌరహక్కుల సంగం వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక పౌర హక్కుల అణిచివేత కేంద్రం లో ఉన్నటువంటి మనువాద ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు.

ప్రజాస్వామిక రాజకీయాలపై అధికారం లో ఉన్నటువంటి ప్రభుత్వాలు దాడి చేస్తున్నారని రాజకీయ స్వేచ్ఛని హరిస్తున్నాయి అని ఆరోపించారు రాజకీయ శక్తులను మేధావులను అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైల్లో ఉంచుతున్నా రూ అని ఆరోపించారు రాజకీయ ఖైదీలను బేషరతుగా  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలను రాజ్యం ఉపయోగించుకుని పౌరుల భావప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని విమర్శించారు. భావప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని ఆవేదన చెందారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది కె.వి రత్నం మాట్లాడుతూ దేశంలో అనగారిన వర్గాల హక్కులను ఆధిపత్య శక్తులు రాజ్యం సహకారంతో చేస్తున్నాయని విమర్శించారు బీమ్ కొరేగావ్ కేసులో అరెస్టు చేసిన ప్రజాస్వామిక వాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరావు కాకర్ల అప్పారావు పిడిఎస్యు నాయకులు k నాని N S v మహర్షి తదితరులు  పాల్గొన్నారు.

 - కె.వి రత్నం 
జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది
 పౌరహక్కుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా శాఖ

Comments