బొజ్జా తారకం 4 వ వర్ధంతి సభ (పచ్చిమ గోదావరి జిల్లా)



జంగారెడ్డిగూడెం
16.09.2020

బొజ్జా తారకం ఆదర్శంగా పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడండి!
హక్కుల నేత,హైకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ పిలుపు.

కుల ఉన్మాద దాడులు, హత్యలకు,అత్యాచారం లకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే బొజ్జా తారకం గార్కి అర్పించే నిజమైన నివాళ్ళి అవుతుంది అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు.నేటి మనువాదుల రాజ్యం పాలన లో పౌరులు హక్కులను కబలిస్తున్న నేటి పరిస్థితుల్లో తారకం గారి లాంటి మేధావులు లేకపోవడం ప్రజాఉద్యమాలకు తీరని లోటు అన్నారు. 

 బొజ్జ తారకం గారి 4వ వర్ధంతి పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు,న్యాయవాది భాషా శ్యాం అధ్యక్షతన జంగారెడ్డిగూడెం స్థానిక ధర్మన్న మెమోరియల్ హాల్ లో జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల ప్రాధమిక హక్కులు ప్రమాదం లో పడ్డాయి అని ఆవేదన చెందారు. ఇలాంటి ప్రమాదం లో తారకం, కన్నాభిరావన్ లాంటి వారు ఉంటే కోర్టులు గాడితప్పిన సరిచేసే వారు అని అన్నారు.అలాంటి వారు లేక పోవడం న్యాయ వ్యవస్థ కు, పౌర సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో  పౌర హక్కుల సంఘం CLC  జిల్లా ఉపాధ్యక్షులు శ్యాం బాబు న్యాయవాదిన్యాయవాదిIFTU నాయకులు కె.వి.రమణ సిహెచ్ రమేష్ పి నాగేశ్వరరావు ఈ గ్రీష్మ కుమార్ ఎం ప్రసాద్ పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ నివాళులు అర్పించి సభలో పాల్గొన్నారు. 

 ఇట్లు.   
బి శ్యాం బాబు న్యాయవాది
 CLC  జిల్లా ఉపాధ్యక్షులు.

Comments