నిన్న 12/09/2020 న గండి కోట ప్రాజెక్ట్ ముంపుకు గురి అవుతున్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్థులు చేస్తున్న ఆందోళన శిబిరానికి పౌరహక్కుల సంఘం కడపజిల్లా కమిటీ వెళ్లుచుండగా కడప..తాడిపత్రి రహదారి వెంకటాపురం వద్దనే పోలీసులు మమ్మల్ని అడ్డుకొని తాళ్ళ ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నాడు అని ఆయన వెళ్ళిన తరువాత పంపిస్తామని చెప్పారు...దాదాపు 1 గంట తరువాత వెళ్లనిచారు.
మేము నిరసన చేస్తున్న ప్రాంతానికి .వెళ్లి వారు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలిపి వారి ఆందోళనల్లో పాల్గొన్నాం...వివరాల్లోకి వెళితే గాలేరు..నగరి సుజల స్రవంతి లో బాగంగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం కొండాపురం మండలం లో గండికోట జలాశయాన్ని 26.85 టీఎంసీ ల సామర్థ్యం తో 2006 లో రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా శంకుస్థాపన సేశారు..ప్రతిపాదన సమయంలోనే కొండాపురం మండలంలో 21 గ్రామాలు,ముద్దనూరు మండలంలో 1 గ్రామంతో పాటు మొత్తం 12 వేల ఎకరాల పై బడి సాగు భూములు ముంపునకు గురి అయితాయని గుర్తించారు..ఆర్&ఆర్ ప్రకారం,మరియు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఏదేని ప్రజా ప్రయోజనాల కొరకు ప్రజల సంపదను,ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే క్రమంలో సంబంధిత ప్రజలకు నిబంధనల మేరకు పరిహారం తో పాటు బాధితులకు అన్ని మౌలిక వసతులతో కూడిన "పునరావాస వసతి" కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది..ఈ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే మునకకు గురి అయిన 14 గ్రామాల ప్రజలకు అరకొర పరిహారం చెల్లించి ,పునరావాసం కల్పించి గ్రామాలను ఖాళీ చేయించారు.ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ,నాయకులైన కడప పార్లమెంట్ సభ్యులు y.s. అవినాష్ రెడ్డి,ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడీ, వైఎస్ వివేకానందరెడ్డి గార్లు ప్రతి పక్ష సభ్యులుగా ప్రజల తరుపున ఉద్యమాలు నడిపారు.
కానీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత అలాగే అండగా ఉండాల్సింది పోయి రాజకీయంగా పై చేయి సాధించడానికి ,తెలుగు దేశం ప్రభుత్వంలో పులివెందులకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్ట్ లో నింపిన నీటికన్నా మేము ఎక్కువ నింపాలని ,అధికులమని అనిపించుకోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం.జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు..ఇంకా పరిహారం అందని తాళ్ళ ప్రొద్దుటూరు,చామలురు,p.అనంతపురం,రెగడిపల్లి, ఏటూరు గ్రామాల ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా ,వారికి పునరాాసం కల్పించకుండా రాత్రి,రాత్రికి పరిహారం ఇస్తాం మీరువెంటనే ఇల్లు ఖాళీ చేయాలని బలవంతం చేయడంతో తాళ్ళ ప్రొద్దుటూరు ప్రజలు ( పరిహారం గ్రామంలో మునగని ఇళ్లకు ఇచ్చి, మునిగ ని ఇళ్లకు ఇచ్చారు,మరి కొంత మందికి,ఈరోజు,రేపని అంటున్నారు అని ప్రజలు మా దృష్టికి తెచ్చారు) ..జిల్లా కలెక్టర్ గ్రామస్తులను కార్యాలయం లోనికి చర్చలకు పిలిపించుకొని ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ కొరకు 900 కోట్లు నిధులు కేటాయించారు..ఇంకా మేము ఉపెక్షించడం ఏమాత్రం వీలుకాదు ఇప్పటికే మీకు చాలా సమయం ఇచ్చాం వెంటనే పరిహారం తీసుకొని వెళ్ళి పోవాలి అని ఘీంకరించాడని(ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,ఏంపి అవినాష్ రెడ్డి గార్ల సమక్షంలో,చర్చల్లో వీరు కూడా ఉన్నారు)
అంతే కాకుండా ప్రాజెక్ట్ లో 16 టీఎంసీ లు నీరు నిలువ పెడితే ముందుగా మునిగేది ఎస్సీ,బిసి కాలనిలే కదా! మీరెందుకు ఉద్యమాలు చేస్తారు? అని అగ్రకులావారిని హెచ్చరించాడు అని చర్చల్లో పాల్గొన్న ప్రజలు చెప్పడం చూస్తుంటే అందరినీ సమానంగా చూడాల్సిన జిల్లా సర్వోన్నత అధికారి ,అందునా దళిత సామాజిక వర్గం నుండి వచ్చిన కలెక్టర్ ఈవిధంగా విభజించడం బాధాకరం..దళిత సామాజికం నుండి ఎదిగిన అధికారి ఆ సామాజికం పట్ల ఏ మాత్రం బాధ్యత,ప్రేమ,అభిమానం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు...ప్రజలను కలిసి చెప్పడానికి వచ్చిన ఎమ్మెల్యే తో దళితులు ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడ ఉండాలి? మాకు వసతి ఎలా? అని అడిగితే గుడుల్లో,స్కూల్లో లేదంటే రేకుల షెడ్లు వేయిస్తాం ఇల్లు కట్టుకోటంతవతకు ఉండండి అనిచెప్పడం చూస్తుంటే ప్రతి పక్ష సభ్యులుగా ఉన్నపుడు ప్రజలకు అండగా ఉండడం అధికారం కోసమేనని ప్రజలు బాహాటంగా చెపుతున్నారు.......తాళ్ళ ప్రొద్దుటూరు ప్రజలు రావాలి జగన్,కావాలి జగన్ అంటే మేమంతా మురిసిపోయి మన జిల్లా వా సి ముఖ్య మంత్రి అయితే. మనందరికీ మేలు జరుగుతుందని మూకుమ్మడిగా ఒట్లేసినాం...మాకు మంచే జరిగిందని పక్కా వైసీపీ అభి మానులే వాపోవడం జరిగింది...మేము ఖాళీ చేయం అని చెప్పడం లేదు
1. వెలిగొండ ప్రాజెక్టు కింద ఇచ్చిన పరిహారం ప్రకారం 12,50 లక్షలు2.,మౌలిక వసతులు కల్పించిన పునరావాసం ,మరియు 3.కట్ ఆఫ్ డేట్ ను పునరావాసం పూర్తయ్యే వరకు పొడిగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు....ముఖ్య మంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి పంతాలకుపోకుండా తన జిల్లా ప్రజలు కోరుకుంటున్న న్యాయమైన సమస్యలను తన సమస్యలుగా భావించి పునరా వాసం పూర్తి చేసి,వారికి పరిహారం చెల్లించి తరలించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో
సి.వెంకటేశ్వర్లు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,
కే.మనోహర్ ,అధ్యక్షులు,కడప
పి. రెడ్డయ్య,ఉపాధ్యక్షులు,కడప
ఆర్.రవిశంకర్,జిల్లా సహాయ కార్యదర్శి,
Y.పుల్లయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు,
జి.ఆదినారాయణ ,అనంతపురం జిల్లా కార్యదర్శి,
రామ మూర్తి,అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి..
Comments
Post a Comment