ఎన్‌ఐఎ పాశవిక దాడిని ఖండిద్దాం

ప్రజాన్వామీకవాదుల గొంతులను నొక్కుతున్న
ఎన్‌ఐఎ పాశవిక దాడిని ఖండిద్దాం !

వరవరరావు, ప్రొఫెసర్‌ షోమాసేన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌ టెల్టుంట్లే, గౌతమ్‌ నవలాఖా లాంటి మేధావులను, సుధా భరద్వాజ్‌ లాంటి న్యాయవాదులను, మరికొద్దిమంది బుద్ధిజీవులను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైళ్ళలో నిర్పంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన గురిని మరికొద్దిమందిపైకి ఎక్కుపెట్టింది. మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమకారులను వేటాడే కార్యక్రమాన్ని తీవ్రం చేసింది.

ఇందులో భాగంగా ప్రజాస్వామ్య, పౌరహక్కుల ఉద్యమాల్లో చురుకైన కార్యకర్తగా ఉన్న కోల్‌కతా నగరంలోని భారతీయ విజ్ఞాన విద్య పరిశోధనా సంస్థ (ఐఐఎస్‌ఈఆర్‌)లో జీవశాస్త్ర పరిశోధనకుడిగా పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పార్టాసారధి రే, ముంబయిలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో సెప్టెంబరు 10న ఉదయం 11.00 గంటలకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీచేసింది. హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ వర్శిటీ (ఇప్లూకి చెందిన దళిత మేధావి ప్రొఫెసర్‌ సత్యనారాయణకు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. వృత్తిరీత్యా ప్రొఫెసర్‌ అయిన సత్యనారాయణ విప్లవ కవి వరవరరావు కుమార్తెను వివాహం చేసుకున్నారు.

భీమా కోరేగావ్‌ కేసులో ప్రశ్నించేందుకు హాజరుకావాల్సిందిగా ఆ సమన్లలో ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ
ముగ్గురికీ ఎన్‌ఐఏ వెప్తున్నట్లుగా ఎల్లార్‌ పరిషత్‌తోగానీ, ఖీమా కోరేగావ్‌ కేసుతోగానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎలాంటి సంబంధం లేదని స్వయంగా వారే పలుమార్లు ప్రకటించారు. ఇప్పటికే అరెస్టయిన పలువురికి న్యాయవాదులుగా ఉంటూ వారి తరపున కోర్టులో కేసు వాదిస్తున్న నీహాల్‌ సింగ్‌ రాథోడ్‌, విష్లన్‌ టెల్టుంబ్లే, మరో న్యాయవాదిని కూడా హాజరుకావాలంటూ ఎన్‌ఐవ సమన్లు జారీ చేసింది. మేధావుల తరపున వాదిస్తున్న న్యాయవాదులను కూడా ఎన్‌ఐఏ విడిచిపెట్టడంలేదు.

డిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ హనీబాబును జూలై నెలలో విచారణ నిమిత్తం పిలిచిన ఎన్‌ఐఏ ఆ తర్వాత అరెస్టు చేసింది. కబీర్‌ మంచ్‌ సంస్థకు చెందిన సాగర్‌ ఘోర్క్మే, రమేష్‌ గైచోర్‌లను కూడా విచారణ నిమిత్తం పిలిచి అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న లేదా ప్రశ్నిస్తున్న గొంతుల్ని నొక్కేయడానికి పలు రకాల ప్రయత్నాలు ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతమయ్యాయి.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ గురించి గొప్పగొప్ప ప్రసంగాలు చేస్తూనే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఉద్యమకారులుగా, దేశద్రోహులుగా ముద్రవేసి అరెస్టులు చేయిస్తోంది. పౌరహక్కుల కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో బంధిస్తోంది. బనాయించిన కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడంలేదు.

చట్టపరంగా అభించాల్సిన బెయిల్‌ పిటిషన్లపై సైతం రకరకాల సాకుల్ని చూపిస్తూ జైళ్ళ నుంచి బైటకు రాకుండా ఎన్‌ఐఏ తదనైన ప్రయత్నాలు చేస్తోంది. బెయిల్‌ మంజూరు కాకూడదని, జైలు నుంచి బైటకు రావద్దనేదే ఎన్‌ఐఏ లక్ష్యం. ఛార్జిషీట్‌, అనుబంధ ఛార్జిషీట్‌ సమర్పించినా కోర్టు విచారణ మాత్రం ప్రారంభించకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామిక ఆకాంక్షలను, హక్కులను అణచివేసి అప్రజాస్వామిక పాలన కొనసాగించడంలో భాగంగానే రాజకీయ భావాలను వ్యక్తీకరించే స్వేచ్చను హరిస్తున్నది.

తాజాగా ముగ్గురికి సమన్లు జారీచేసి పౌర, ప్రజాస్వామిక హక్కులను ఎన్‌ఐఏ ఉల్లంఘిస్తోంది. ప్రొఫెసర్లుగా, పాత్రికేయులుగా, పరిశోధకులుగా ఉన్న వీరికి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీచేయడమంటే అరెస్టు చేయడమే. ఎన్‌ఐఏ వెప్తున్న ఖీమా కోరేగావ్‌ లేదా ఎల్లార్‌ పరిషత్‌ కేసులతో ఎలాంటి సంబంధం లేని ఈ ముగ్గురికీ సమన్లు జారీచేయడం, ఆ కేసుతో సంబంధం ఉందని అభియోగాలను అంటగట్టడం వారి ప్రజాస్వామిక హక్కులను అణచివేయడమే. ఎన్‌ఐఏ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఇప్పటికే ప్రజాస్వామికవాదుల మీద, పారహక్కుల కార్యకర్తల మీద, న్యాయవాదుల మీద, రచయితల మీద, పాత్రికేయులమీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. అక్రమ కేసులతో ఎన్‌ఐఏ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని ఉద్యమాలకు, పోరాటాలకు, నిరసనలకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు, ప్రజాన్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరుతున్నాం.


 వి.చిట్టిబాబు
 అధ్యక్షులు,
చిలుక చంద్రశేఖర్
కార్యదర్శి, 
పౌరహక్కుల సంఘం,
ఆం.ప్ర.రాష్ట్ర కమిటీ.

గడ్డం లక్ష్మణ్‌, అధ్యక్షులు
నారాయణరావు, కార్యదర్శి
పారహక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్రకమిటీ

Comments

  1. It is true , journalists are not in a position to write free Frank and fearless stories . Very recently I have seen in several times and in several cases Mr Vara Vara Rao never kept the realation ship with Nexals . Unfortunately keeping him in side the jail is nothing but inhuman . similarly the other though I don't know persionally , as a journlist I read about them and the way they extended the healp to the tribals and dalits unforgettable . It is better to fight against the injustice caused to them , not for them alone .The injustice is for you and me too particularly tribals and dalits . Please find out the way for their early release . Maharashtra Government also opposing the arrests and decided to raise their voice in parlment . They may appoint an enquiry committee to review the cases quite in pendefinitely.

    ReplyDelete

Post a Comment