మేథా వులపై నిర్బంధానికి వ్యతిరేకంగా ధర్నా (పశ్చిమ గోదావరి జిల్లా)


పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం లో ఈరోజు పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో  CDRO ఇచ్చిన  అఖిల భారత నిరసన దినాన్ని పాటించడం జరిగింది.ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు,న్యాయవాది బాషా శ్యాం బాబు మాట్లాడుతూ దేశం లో మునుపు ఎన్నడూ లేనివిధంగా పౌరులు జీవించే హక్కులకు విఘాతం కలుగుతుంది అని అన్నారు.హక్కులు కోసం ప్రజలు పోరాడుతున్నారు అన్నారు. ప్రజా పోరాటాలు పై రాజ్యం అణచివేత బాగా పెరిగిపోయింది అన్నారు.అక్రమంగా అరెస్ట్ చేసిన మేధావులను, ప్రజలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పౌరహక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు
                  
    బాషా శ్యాం బాబు 
జిల్లా ఉపాధ్యక్షుడు,న్యాయవాది
పౌర హక్కుల సంఘం CLC
పశ్చిమగోదావరి జిల్లా
22.09.2020. బుట్టాయి గూడెం

Comments