న్యాయవ్యవస్ధను ప్రశ్నించడం ధిక్కారమా




భారత దేశ న్యాయవ్యవస్థపై ప్రస్తుతం తీవ్రమైన చర్చ నడుస్తోంది.  మునుపెన్నడూ లేనంతగా ఈ చర్చ నడుస్తున్నది. ఎందుకు ఇంతగా చర్చ నడుస్తుంది అంటే ప్రజా హితమైన కేసులలో న్యాయవ్యవస్ధ సరిగా స్పందించడం లేదు.  న్యాయవ్యవస్థ తీర్పులో ప్రజాహితం కోరుతూ మేధావులు మీడియాలోనూ మాట్లాడటం జరుగుతుంది.  దీనిపై న్యాయ వ్యవస్థ  కోర్టు ధిక్కారం కేసులను సుమోటోగా నమోదు చేయడం జరిగింది.  ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రజల నుండి వస్తున్న సూచన,  విమర్శను న్యాయవ్యవస్థ స్వీకరించాలి.    న్యాయవ్యవస్థ  పై భారతీయ సమాజము లో పౌరులు చర్చిస్తున్నారు.  విమర్శకు ధిక్కారానికి తేడా స్పష్టంగా పౌరులకు అవగాహన కావాలి.  న్యాయ వ్యవస్థ లోని న్యాయమూర్తులకు అవగాహన ఉండాలి. న్యాయవ్యవస్థ విమర్శకు అతీతమా అనే ప్రశ్నను పౌరులే వేస్తున్నారు.  ఎందుకంటే సుప్రీం కోర్ట్  సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన రూపాయి జరిమానా కోర్టు ధిక్కార నేరం కింద అత్యున్నత న్యాయస్థానం విధించింది. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యానికి  ప్రాధాన్యతను ఇస్తూ న్యాయకోవిదులు ప్రజాస్వామిక వాదులు   ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని పౌరులు ఆకాంక్షిస్తున్నారు. వారి ఆందోళన ప్రజాస్వామిక మైనది. వారి ఆకాంక్ష ఆదర్శ మైనది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)a లో పౌరులు అందరికీ భావప్రకటన స్వేచ్ఛ వుంది. కోర్టు ధిక్కారం శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉంది.  న్యాయ స్థానాల తీర్పులను సమంజసంగా విమర్శించ వచ్చును. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా దూషణ చేయకుండా  భావవ్యక్తీకరణ చేయవచ్చునని చట్టాలు వివరిస్తున్నాయి. 

ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తులకు న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు అంటగట్టలేదు.   ప్రశాంత్ భూషణ్ వివరణ ఇస్తూ అత్యున్నతమైన  విధి తోనే న్యాయవ్యవస్థలో ఒక న్యాయ అధికారిపై ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగిందని చెప్పారు.  న్యాయవ్యవస్థ అంటే ఎంతో గౌరవం, విశ్వాసం తనకు ఉన్నాయని,  న్యాయవ్యవస్థ పట్ల అపారమైన నమ్మకం వుందని ప్రకటించడం  జరిగినది. న్యాయవ్యవస్థ పట్ల గౌరవం, విశ్వాసం, నమ్మకం  ప్రకటించినప్పటికీ ప్రశాంత్ భూషణ్ కి ఒక రూపాయి జరిమానా సుప్రీం ధర్మాసనం విధించడం జరిగింది. అందుకే భారతీయ సమాజంలోని అన్ని తరగతుల పౌరులు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును ప్రశ్నిస్తున్నారు. 

ప్రశ్నించే హక్కును కోల్పోతున్నట్లు భావించి న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామి కాదని పౌరులు ఆర్టికల్ 19 ప్రకారం తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు.  భారత రాజ్యాంగ వ్యవస్థ లో న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది. రాజ్యాంగం  పౌరులకు న్యాయం అందించడానికి సుప్రీంకోర్టు ని 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలలో ఏ వ్యవస్థ తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పే అధికారాన్ని కూడా న్యాయ వ్యవస్థ కలిగి ఉంది. న్యాయం కోసం ఆఖరిగా న్యాయవ్యవస్థ మెట్లు ఎక్కి తలుపులు తడుతున్నారు.   సామాన్య ప్రజల హృదయాలలో న్యాయవ్యవస్థకు ఉన్నటువంటి స్థానం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. పౌరులు  ఎంతో గౌరవంగా చూసుకునే న్యాయవ్యవస్థలో భావవ్యక్తీకరణకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడటం పౌరులకు  తీవ్రమైన మనోవేదన కలిగిస్తున్నది. ప్రశాంత్ భూషణ్ తో పాటు ట్విట్టర్ కంపెనీ కూడా ఒక ముద్దాయి అయితే ట్విట్టర్ కంపెనీ క్షమాపణ చెప్పటంతో సుప్రీం ధర్మాసనం వారిని వదిలి వేసింది. 

ప్రశాంత్ భూషణ్ నేరాన్ని నిర్ధారణ చేయడం, శిక్ష విధించడం జరిగింది. దోషి గా తేల్చి శిక్షించటం  ద్యేయంగా సుప్రీం ధర్మాసనం విచారణ జరిపినట్లు న్యాయకోవిదులు భావిస్తున్నారు. ఇందులో పౌరులకు చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ప్రశాంత్ భూషణ్ కేసు విచారించిన ధర్మాసనంకి మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వం వహించారు. ఈ విషయంలో ప్రశాంత్ భూషణ్ కేసును మరో ధర్మాసనానికి మార్చమని ఆయన న్యాయవాది కోర్ట్ కి విన్నవించారు. ఎందుకంటే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మోడీని విమర్శిస్తారు. మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా వారిని సమర్ధిస్తారు. వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇరువురి భావాలు భిన్న దృక్పథాలు .వారి భావాల మధ్య వైరుధ్యం ఉన్నది అది గ్రహించిన ప్రశాంత్ భూషణ్ న్యాయవాది వేరే బెంచికి  కేసును బదిలీ చేయమని  ధర్మాసనం కి విన్నవించడం జరిగింది. ఆయన విన్నపాన్ని తోసిపుచ్చి ప్రశాంత్ భూషణ్ నేతృత్వం వహించిన బెంచ్ విచారణ చేయడం జరిగింది. 

ప్రశాంత్ భూషణ్ స్వయంగా విజ్ఞప్తి చేసినా కేసు విచారణను వేరే బెంచికి మార్చలేదు. ఇది సుప్రీం ధర్మాసనం గౌరవం తగ్గించేదిగా ఉన్నదని న్యాయవాదులు భావిస్తున్నారు.  న్యాయవ్యవస్థ అపారమైనటువంటి ప్రజాస్వామిక భావాలకు నిలయంగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ధర్మాసనం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఈ తీర్పును ఆహ్వానించ లేకపోతున్నారు అనిపిస్తున్నది.

ఈ సందర్భంలో న్యాయవ్యవస్థ తనకు తాను విశాలంగా ఆలోచించి ప్రశాంత్ భూషణ్ ని శిక్షించ కుండా ఉండి ఉంటే న్యాయవ్యవస్థ గౌరవం మరింత పెరిగేది.  ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని,  ప్రతిష్టను తగ్గిస్తుందని అందుకే కోర్టు గౌరవం కాపాడటం కోసం  ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు శిక్ష వేసింది. ప్రశాంత్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు చులకన కలిగి గౌరవం విశ్వాసం దెబ్బతీస్తుందని న్యాయవ్యవస్థను దోషిగా చూపించే ప్రయత్నమని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు భావన సాధారణ పౌరులు ఆహ్వానించ లేకపోతున్నారు. గౌరవ ప్రతిష్టలు పెరగటం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను సూచనలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా న్యాయవ్యవస్థ గౌరవం పెరుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. సలహాలను ఇచ్చేవారిని  శిక్షించడం ద్వారా న్యాయవ్యవస్థపై గౌరవం ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ విషయంపై సాధారణ పౌరులు విస్తృతంగా చర్చిస్తున్నారు. న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నడిచే నడవడికను మరింత ఉన్నతంగా ఉండాలని ప్రశ్నించడం ఎలా కోర్టు ధిక్కారం  అవుతుందనేది ప్రశ్న.  చీఫ్ జస్టిస్ బాబిడే బిజెపి నాయకుడు ఇచ్చిన అతి ఖరీదైన వాహనం పై రైడ్ చేయడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తుంది.   న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడే క్రమంలో ఒక విధి గా పెట్టినటువంటి ట్విట్టర్ ట్వీట్ కోర్టు దిక్కారం నేరం ఎలా అవుతుంది. నలుగురు జడ్జీల పనితీరును ప్రశ్నించినటువంటి ప్రశ్న కూడా న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ పెంపొందించే క్రమంలో చేసిందే. న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచాలని సంకల్పంతో  పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ  కోర్టు ధిక్కార నేరం కాదు.  ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రశ్నలు, అభిప్రాయం అత్యున్నతమైనవి.   అన్ని వ్యవస్థల కంటే ప్రజా వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు విలువైనవి. సమాజంలో ప్రజల నుండి వస్తున్నటువంటి భావాలు అభిప్రాయాలు ఉన్నతమైనవి.  వాటిని ఆకళింపు చేసుకుని రాజ్యం ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా చట్టాన్ని మెరుగులు దిద్దే విధం గా ప్రజాస్వామికం గా తీర్పు ఇవ్వడం న్యాయమూర్తుల ప్రధాన కర్తవ్యం కావాలి. న్యాయవ్యవస్థ తీర్పులు సమంజసం గా లేనప్పుడు ప్రశ్నించే వారు ప్రజలే. ప్రజలు లేకుండా సమాజంలో అత్యున్నతమైన  భావజాలం, చట్టాలు, రాజ్యాంగం రూపొందలేదు. 

భారత రాజ్యాంగ వ్యవస్థ లో రూపొందించబడిన శాసనాలు చట్టాలు అన్నీ కూడా ప్రజల అభిప్రాయాలను నుండి ప్రజల ఆకాంక్షల నుండి వచ్చినవే.  శాసన కార్యకర్తలు, అధికారులు తప్పులు చేస్తే సరి చేయవలసింది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు గాడితప్పితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ తీర్పు ఇచ్చేది. వారి తీర్పు శిరోధార్యం. వారి అభిప్రాయాలు గౌరవప్రదం. వారి తీర్పు అత్యున్నత మైనది. మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ప్రజల తీర్పును గౌరవించ లేకపోయింది. పరిగణనలోకి తీసుకోలేదు. అటార్నీ జనరల్ కె కె వేణు గోపాల్ ఆభిప్రాయాలను కోర లేదు. ఆయన విన్నపాన్ని సహితం పరిగణన లోకి తీసుకో లేదు. జస్టిస్ మదన్ బి లోకూర్, జి ఎస్ సింఘ్వి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ అఫ్తాబ్ ఆలం తో పాటు 12 మంది మాజీ సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు, సుమారు మూడు వేల మంది ప్రముఖులు ప్రశాంత్ భూషణ్ కేసులో సుప్రీంకోర్టు బావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఒక లేఖ కూడా న్యాయ విద్యార్థులు చీఫ్ జస్టిస్ కు  రాయటం జరిగింది. అయినా ధర్మాసనం పట్టించుకోలేదు.  ఏకపక్ష విచారణ సాగింది అనే అభిప్రాయం ప్రజల్లో ముద్రపడింది. పౌరులు న్యాయం కన్నా సుప్రీంకోర్టు తన గురించి తాను ఎక్కువ ఆలోచించింది అనే అభిప్రాయం సమాజంలో ఏర్పడింది. దీని వలన న్యాయవ్యవస్థ ప్రతిష్ట సమాజంలో మరింత దెబ్బతిన్నది.
   
విమర్శ లేదా కోర్టు ధిక్కారం అంటే ఏమిటి 

  ఏదైనా ఒక విషయం హేతుబద్ధంగా సమంజసంగా న్యాయబద్ధంగా లేనప్పుడు పౌరులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. దాన్ని విమర్శ అంటారు. పౌరులకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉన్నది.  కోర్టు తీర్పులను సైతం చట్టప్రకారం సమంజసంగా న్యాయమూర్తులకు ఏ విధమైనటువంటి దురుద్దేశాలు అంటగట్ట కుండా విమర్శించ వచ్చును. కోర్టు తీర్పు పై తమ అభిప్రాయాలను వ్యక్తీకరించ వచ్చును. ఆ సౌలభ్యం చట్టం కల్పించింది. పౌరులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 19 వీల కల్పించింది.  ఇది ప్రాథమిక హక్కుల్లో భాగం.

కోర్ట్ ధిక్కారం (contempt of court) అంటే ఏమిటి? 

కోర్టు దిక్కారం అనే భావన శతాబ్దాల నాటిది. ఇంగ్లాండ్లో అది ఒక సాధారణ న్యాయ సిద్ధాంతం. . న్యాయ శక్తిని రక్షించడానికి ఉపయోగపడింది. మొదట రాజు ను విమర్శిస్తే  తీవ్ర నేరంగా పరిగణించారు. ఆ తరువాత రాజు పేరు మీద పని చేసే న్యాయమూర్తుల బృందం పైన విమర్శలు చేసినా నేరంగా పరిగణించడం జరిగింది. న్యాయమూర్తుల ఆదేశాన్ని ఉల్లంఘించడం అంటే రాజు పరిపాలన పట్ల అనుమానాన్ని వ్యక్తం చేయడమే. రాజు పరిపాలన ఎప్పుడు తప్పుకాదని ఇంగ్లాండ్ ప్రజలు విశ్వసించేవారు. అది వారి నమ్మకం. కాలక్రమేణా న్యాయమూర్తుల పట్ల విధేయత వారి సూచనలను అమలు చేయక పోయినా ఆటంకం కలిగించినా వారి పట్ల గౌరవం చూపించే వ్యాఖ్యలు చేసిన అటువంటి చర్యలు న్యాయాధికారిగా పేర్కొనడం జరిగింది వారు దోషులుగా నిర్ధారించి భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం ఉన్నాయి బ్రిటిష్ వారి పాలనలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు లకు వ్యతిరేకంగా మాట్లాడిన నేరంగా పరిగణించి మన భారతీయులను శిక్షించేవా రూ బ్రిటిష్ వాళ్ళ నుండి పాలన మన భారతీయులకు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో వాక్ భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించడం జరిగింది.

 భారత దేశ న్యాయవ్యవస్థపై ప్రస్తుతం తీవ్రమైన చర్చ నడుస్తుంది మునుపెన్నడూ లేనంతగా ఈ చర్చ నడుస్తున్నది ఎందుకు ఇంతగా చర్చ నడుస్తుంది అంటే ప్రజా హితమైన కేసులలో లేదా న్యాయవ్యవస్థ తీర్పులో ప్రజాహితం కోరుతూ పౌరులు న్యాయకోవిదులు న్యాయవాదులు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మాట్లాడటం జరుగుతుంది జరిగింది దీనిపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కోర్టు ధిక్కారం కేసులను నమోదు చేయడం జరిగింది ప్రజాస్వామ్యం మనుగడ కోసం ప్రజల నుండి వస్తున్న సూచన సూచన  విమర్శ లేదా ధిక్కారమా  అనే చర్చ న్యాయవ్యవస్థ పై పై భారతీయ సమాజము లో పౌరులు చర్చిస్తున్నారు ఈ చర్చ ఆహ్వానించదగిన అటువంటిది విమర్శకు ధిక్కారానికి తేడా స్పష్టంగా పౌరులకు అవగాహన కావాలి న్యాయ వ్యవస్థ లోని న్యాయమూర్తులకు అవగాహన ఉండాలి ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చిన చర్చ న్యాయవ్యవస్థ విమర్శకు అతీతమా అనేది ప్రశ్న అయింది ఎందుకంటే సుప్రీం కోర్ట్  సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన రూపాయి జరిమానా కోర్టు ధిక్కార నేరం కింద అత్యున్నత న్యాయస్థానం విధించడం.ఈ సందర్భంలో ప్రజాస్వామ్యానికి  ప్రాధాన్యతను ఇస్తూ న్యాయకోవిదులు ప్రజాస్వామిక వాదులు ప్రజలు తమ భావప్రకటన స్వేచ్ఛ పై ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని పౌరులు ఆకాంక్షిస్తున్నారు వారి ఆందోళన ప్రజాస్వామిక మైనది వారి ఆకాంక్ష. 

భారత సంవిధాన ఆర్టికల్ 19(1)a లో పౌరులు అందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉన్నా కోర్టు దిక్కారం శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉన్నట్టున్నది న్యాయ స్థానాల తీర్పులను సమంజసంగా విమర్శించ వచ్చును తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు వ్యక్తిగతంగా దురు దేశాలను ఆపాదింకుండా భావవ్యక్తీకరణ చేయవచ్చునని కోర్టు ధిక్కార చట్టం వివరించింది ఇక్కడ ప్రశ్న ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తులకు న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఎక్కడ అంటగట్టారు ఆయన భావవ్యక్తీకరణ న్యాయవ్యవస్థను కించపరిచేదిగా ఎక్కడ ఉన్నది కోర్టు కి ప్రశాంత్ భూషణ్ వివరణ ఇస్తూ అత్యున్నతమైన  విధి duty తోనే న్యాయవ్యవస్థలో ఒక న్యాయ అధికారి( advocate is an officer he is part of the judiciary)  గా ట్విట్టర్లో ట్వీట్ చేయడం, మీడియాతో మాట్లాడటం జరిగిందని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ అంటే ఎంతో గౌరవం విశ్వాసం తనకు ఉన్నాయని,  న్యాయవ్యవస్థ పట్ల అపారమైన నమ్మకం ప్రకటించడం  జరిగినది. న్యాయవ్యవస్థ పట్ల గౌరవం విశ్వాసం నమ్మకం  ప్రక టించినప్పటికీ ప్రశాంత్ భూషణ్ కి ఒక రూపాయి జరిమానా సుప్రీం ధర్మాసనం విధించడం జరిగినది. అందుకే భారతీయ సమాజంలోని అన్ని తరగతుల పౌరులు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు వలన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నట్లు భావించి న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామి కాదని పౌరులు ఆర్టికల్ 19 ప్రకారం తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు.  భారత రాజ్యాంగ వ్యవస్థ లో న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది. రాజ్యాంగం  పౌరులకు న్యాయం అందించడానికి సుప్రీంకోర్టు ని 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలలో ఏ వ్యవస్థ తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పే అధికారాన్ని కూడా న్యాయ వ్యవస్థ కలిగి ఉంది. న్యాయం కోసం ఆఖరిగా న్యాయవ్యవస్థ మెట్లు ఎక్కి తలుపులు తట్టు తున్నారు అంటే సామాన్య ప్రజల హృదయాలలో న్యాయవ్యవస్థకు ఉన్నటువంటి స్థానం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. 

పౌరులు  ఎంతో గౌరవంగా చూసుకునే న్యాయవ్యవస్థలో భావవ్యక్తీకరణకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడటం పౌరులకు  తీవ్రమైన మనోవేదన కలిగిస్తున్నది. ప్రశాంత్ భూషణ్ తో పాటు ట్విట్టర్ కంపెనీ కూడా ఒక ముద్దాయి అయితే ట్విట్టర్ కంపెనీ ముద్దాయిలు క్షమాపణ చెప్పటంతో సుప్రీం ధర్మాసనం వారిని వదిలి వేసింది. తప్పు చేయలేదు ఒక విధి (duty) గా నేను భావించి ట్వీట్ చేయడం జరిగింది అని ప్రశాంత్ భూషణ్ సుప్రీం ధర్మాసనం కి వినమ్రంగా వివరించడం జరిగింది. అయితే ఆయన్ని ట్విట్టర్ కంపెనీ వారిని వదిలి వేసినట్లు వదలలేదు.   ఆయన నేరాన్ని నిర్ధారణ చేయడం, శిక్ష విధించడం జరిగింది.దోషి గా తేల్చి శిక్షించటం  ద్యేయం గా సుప్రీం ధర్మాసనం విచారణ జరిపినట్లు న్యాయకోవిదులు భావిస్తున్నారు. ఇందులో పౌరులకు చాలా చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయి. ప్రశాంత్ భూషణ్ కేసు విచారించిన ధర్మాసనం కి మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వం వహించారు. ఈ విషయంలో ప్రశాంత్ భూషణ్ కేసును మరో ధర్మాసనానికి మార్చమని ఆయన న్యాయవాది కోర్ట్ కి విన్నవించారు. ఎందుకంటే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మోడీని విమర్శిస్తారు మోడీ అనుచర గణం అయినా మను వాదులను వ్యతిరేకిస్తారు మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా వారిని సమర్ధిస్తారు వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇరువురి భావాలు భిన్న దృక్పథాలు వారి భావాల మధ్య వైరుధ్యం ఉన్నది అది గ్రహించిన ప్రశాంత్ భూషణ్ న్యాయవాది వేరే బెంచికి క కేసును బదిలీ చేయమని  ధర్మాసనం కి విన్నవించడం జరిగింది. ఆయన విన్నపాన్ని తోసిపుచ్చి ప్రశాంత్ భూషణ్ నేతృత్వం వహించిన బెంచ్ విచారణ చేయడం జరిగింది ధర్మాసనం ఎదుట ఈ వైఖరి సుప్రీంకోర్టు గత తీర్పులను విరుద్ధమైనది కేసును ఎదుర్కొంటున్న ముద్దాయి ఈ  పూర్తి వలన వలన గా నాకు అన్యాయం జరుగుతుంది అని ముద్దాయి చెప్పినప్పుడు ఆ న్యాయమూర్తి ఉన్న బెంచ్ నుంచి వేరే బెంచీ కి మార్చాలి ప్రశాంత్ భూషణ్ స్వయంగా విజ్ఞప్తి చేసినా కేసు విచారణను వేరే బెంచి కి మార్చలేదుఇది సుప్రీం ధర్మాసనం గౌరవం తగ్గించేదిగా ఉన్నది అని న్యాయవాదులు న్యాయకోవిదులు భావిస్తున్నారు పౌరులు న్యాయవ్యవస్థ అపారమైన టువంటి ప్రజాస్వామిక భావాలకు నిలయంగా ఉండాలని భావిస్తున్నారు అందుకే ధర్మాసనం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛకు ఘాతం కలిగించే ఈ తీర్పును ఆహ్వానించ లేకపోతున్నారు అనిపిస్తున్నది .

ఈ సందర్భంలో న్యాయవ్యవస్థ తనకు తాను విశాలంగా ఆలోచించి ప్రశాంత్ భూషణ్ ని శిక్షించ కుండా ఉండి ఉంటే న్యాయవ్యవస్థ గౌరవం మరింత పెరిగేది అని పౌరులు చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు న్యాయవ్యవస్థ సుప్రీం ధర్మాసనం విమర్శకు భావ ప్రకటనకు తేడా లేకుండా ఈ కేసు విషయంలో వ్యవహరించిందని ప్రజాస్వామిక వాదులు భావిస్తున్నారు అయితే ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని ప్రతిష్టను తగ్గిస్తుందని కోర్టు గౌరవం కాపాడటం కోసం  న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు చులకన కలిగి గౌరవం విశ్వాసం దెబ్బతీస్తుందని న్యాయవ్యవస్థను దోషిగా చూపించే ప్రయత్నమని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు భావన సాధారణ పౌరులు ఆహ్వానించ లేకపోతున్నారు గౌరవ ప్రతిష్టలు పెరగటం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను సూచనలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా న్యాయవ్యవస్థ గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది సలహాలను ఇచ్చేవారిని శబ్ద్ శిక్షించడం ద్వారా న్యాయవ్యవస్థపై గౌరవం ప్రతిష్ట దెబ్బతింటుంది ఈ విషయం సాధారణ పౌరులు విస్తృతంగా చర్చిస్తున్నారు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నడిచే నడవడికను మరింత ఉన్నతంగా ఉండాలని ప్రశ్నించడం ఎలా కోర్టు ధిక్కారం  అవుతుందనేది ప్రశ్న చీఫ్ జస్టిస్ బాబిడే బిజెపి నాయకులకు సంబంధించిన అతి ఖరీదైన వాహనం పై రైడ్ చేయడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తుందని భావనతో న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడే క్రమంలో ఒక విధి గా పెట్టినటువంటి ట్విట్టర్ ట్వీట్ కోర్టు దిక్కారం నేరంగా ఎలా అవుతుంది. నలుగురు జడ్జీల పనితీరును ప్రశ్నించిన టువంటి ప్రశ్న కూడా న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ పెంపొందించే క్రమంలో న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచాలని సంకల్పంతో  పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ సహితం కోర్టు ధిక్కార నేరం ఎలా అవుతుంది. అని సామాన్య ప్రజలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రశ్నలు, అభిప్రాయం అత్యున్నతమైనవి. 

 అత్యున్నతమైన ఇటువంటి సర్వోన్నత న్యాయస్థానం లో ఉన్న న్యాయమూర్తులు గమనంలో ఉంచుకోవాలి. అన్ని వ్యవస్థల కంటే ప్రజా వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలు విలువైనవి. సమాజంలో ప్రజల నుండి వస్తున్నటువంటి భావాలు అభిప్రాయాలు ఉన్నతమైనవి అయినప్పుడు వాటిని ఆకళింపు చేసుకుని రాజ్యం ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా చట్టాన్ని మెరుగులు దిద్దే విధం గా ప్రజాస్వామికం గా తీర్పు ఇవ్వడం న్యాయమూర్తుల ప్రధాన కర్తవ్యం కావాలి. న్యాయవ్యవస్థ తీర్పులు సమంజసం గా లేనప్పుడు ప్రశ్నించే వారు ప్రజలే. ప్రజలు లేకుండా సమాజంలో అత్యున్నతమైన ఇటువంటి భావజాలం,చట్టాలు,రాజ్యాంగం రూపొందలేదు. భారత రాజ్యాంగ వ్యవస్థ లో రూపొందించబడిన శాసనాలు చట్టాలు అన్నీ కూడా ప్రజల అభిప్రాయాలను నుండి ప్రజల ఆకాంక్షల నుండి వచ్చినవే.వాటికి తూట్లు పొడిచింది    మాత్రం డబ్బు,మద్యం తదితర వాటిని ఎరవేసి అధికారంలోకి వచ్చిన శాసన కర్తలు. శాసన కార్యకర్తలు, అధికారులు తప్పులు చేస్తే సరి చేయవలసింది న్యాయ వ్యవస్థ.న్యాయ వ్యవస్థ తో పాటు అన్ని వ్యవస్థలు గాడితప్పితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ తీర్పు ఇచ్చేది. వారి తీర్పు శిరోధార్యం. వారి అభిప్రాయాలు గౌరవప్రదం. వారి తీర్పు అత్యున్నత మైనది. మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ప్రజల తీర్పును గౌరవించ లేకపోయింది. పరిగణనలోకి తీసుకోలేదు.అటార్నీ జనరల్ కె కె వేణు గోపాల్ ఆభిప్రాయాలను కోర లేదు. ఆయన విన్నపాన్ని సహితం పరిగణన లోకి తీసుకో లేదు జస్టిస్ మదన్ బి లోకూర్, జి ఎస్ సింఘ్వి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ అఫ్తాబ్ ఆలం తో పాటు 12 మంది మాజీ సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు మరియు సుమారు మూడు వేల మంది ప్రముఖులు ప్రశాంత్ భూషణ్ కేసులో సుప్రీంకోర్టు బావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఒక లేఖ కూడా న్యాయ విద్యార్థులు చీఫ్ జస్టిస్ కు న్యాయమూర్తులకు రాయటం జరిగింది.అయినా ధర్మాసనం పట్టించుకోలేదు.  ఏకపక్ష విచారణ సాగింది అనే అభిప్రాయం ప్రజల్లో ముద్రపడింది. పౌరులు న్యాయం కన్నా సుప్రీంకోర్టు తన గురించి తాను ఎక్కువ ఆలోచించింది అనే అభిప్రాయాన్ని సమాజంలో ఏర్పడింది. దీని వలన న్యాయవ్యవస్థ ప్రతిష్ట సమాజం లో మరింత దెబ్బతిన్నది అని న్యాయ పరిశీలకులు అంచనా.
   
ప్రశాంత్ భూషణ్ 2 వ్యాఖ్యానాలను పరిశీలిద్దాం 1 2009 లో సుప్రీం కోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులు 16 మంది అవినీతిపరులంటు తెహల్కా పత్రిక కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆరోపించటం.

2వది ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే ప్రముఖ బీజేపీ నాయకుని బైక్ పై భౌతిక దూరం పాటించకుండా మాస్కు లేకుండా హెల్మెట్ ధరించకుండా రైడ్ చేస్తున్న ఫోటో ట్విట్టర్లో పోస్ట్ చేసి వ్యాఖ్యానించడం. ఈ రెండు విషయాలను పరిశీలించినపుడు ప్రశాంత్ భూషణ్ కోర్టు యొక్క ప్రతిష్టను మరింత పెంచాలనే ఉద్దేశంతో పెట్టిన పోస్టులు గా కనిపిస్తున్నాయి ఒకటి బాధ్యత కలిగినటువంటి ప్రధాన న్యాయమూర్తి వాస్తు లేకుండా బ్లాక్ టౌన్ నిబంధనలు పాటించకుండా అధికార పార్టీకి సంబంధించిన నాయకుని బైక్ పై కూర్చుని రైడ్ చేయడం పౌరులకు ఏ  సంకేతం వెళుతుంది ది  అని ప్రశ్నించడం తప్పు కాదు రెండో విషయం న్యాయవ్యవస్థ ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వ్యాఖ్యానం ఈ రెండు విషయాలు న్యాయవ్యవస్థను గౌరవించి ప్రతిష్ఠను మరింత పెంచాలనే సంకల్పంతో చేసినట్టుగానే ఆయన స్పష్టం చేశారు ఇందులో కోర్టు ధిక్కారం చట్టప్రకారం ప్రకారం ఏమాత్రం కనిపించడంలేదు ఆర్టికల్ 191(a) భావప్రకటన స్వేచ్ఛ ఉపయోగించుకుని ఆయన తన అభిప్రాయాలను చెప్పటం జరిగింది ఆయన కోర్టుకు వివరణ కూడా ఇచ్చుకున్నారు ఇందులో కోర్టు ని కించపరచాలని చట్టం ఉద్దేశ్యం ఆయనకు మాత్రం కూడా లేదని విషయం పౌరులకు అర్థమయింది న్యాయ స్థానానికి అర్థం కాకపోవడం విస్మయం కలిగించింది అందుకే న్యాయస్థానం తీర్పు పైన పౌరులు పలు అనుమానాలను సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహాన్ని ప్రదర్శించారు ఒక బీజేపీ నాయకుడు రాసినటువంటి లేఖను ఆధారం చేసుకుని సుప్రీం ధర్మాసనం జస్టిస్ అరుణ్ మిత్ర నేతృత్వంలో జస్టిస్  కృష్ణ మురారి లతో కూడిన ధర్మాసనం సుప్రీం కోర్ట్ సుమోటోగా స్వీకరించింది. వెంటనే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై కోర్టు దిక్కారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పౌర సమాజం నుండి తీవ్రమైన నిరసన సుప్రీంకోర్టు ఎదుర్కొన్నది. కోర్టు అధికారం పేరుతో పౌరుల భావప్రకటన స్వేచ్ఛను హక్కులను కాలరాస్తున్నారని పౌరసమాజం ఆందోళన చెందినది. అందుకే తన వాదనను మార్చుకోవాలని సుప్రీం న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ కు అవకాశం ఇచ్చింది. ఆయన మాత్రం నిబద్ధత కలిగిన న్యాయవాది గానే కాకుండా ఒక ప్రజాస్వామిక వాదిగా నేను తప్పు చేయ లేదు  దయ చూపండి అని నేను అడగను భావిస్తే శిక్షించండి న్యాయవ్యవస్థ గౌరవాన్ని నేను దిగజార్చలేదు అని ధర్మాసనానికి విన్నవించారు. అయినా ధర్మాసనం ఆయన దోషిగా తేలితే 1 రూపాయు జరిమానా విధించింది రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు జైలు శిక్ష మరియు ప్రాక్టీస్ నిషేధం చేస్తూ తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ఒకవైపు covid 19 వలన అత్యవసర కేసులు మాత్రమే న్యాయస్థానాలు విచారిస్తువన్నాయి. మరోవైపు justice arun mishra రిటైర్ కాబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆగమేఘాలమీద ఈ కేసును విచారించడంతో ప్రజల్లో అనుమానాలు  రేకెత్తాయి. ఎందుకంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసుగా తీసుకునే అధికారాలపై సందిగ్ధత ఉందని స్వయంగా జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం  పేర్కొన్నది. అందుకు ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేయమని సిఫార్సు కూడా చేయటం జరిగినది. ఇక్కడ పౌరులకు కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. 

కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం అన్ని కోణాల నుండి విచారించకుండా ఏకపక్షంగా ఎందుకు తీసుకున్నట్లు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని న్యాయస్థానానికి ఉన్న విశేష అధికారాలను సుమోటోగా   తీసుకుని దోషిగా ఎందుకు నిర్ధారిం చారు.  లాక్ డౌన్ వలన అత్యవసర కేసుల్లో మాత్రమే విచారిస్తున్న న్యాయస్థానం ఈ కేసును ఆగమేఘాలమీద విచారించి శిక్ష వేయటం ఏమిటి. మాస్కులు లేకుండా హెల్మెట్ లేకుండా అధికారపార్టీ నాయకుని బైక్ ని రైడ్ చేసిన చీఫ్ జస్టిస్ ను వదిలివేసి  ప్రశాంత్ భూషణ్ పై కోర్టు దిక్కారం నేరం కింద శిక్షించడం ఏమిటి.  ఎందుకంటే న్యాయమూర్తుల నడవడికను చర్యలను చట్టపరంగా తప్పుబట్టిన ప్రశాంత్ భూషణ్ పై తీవ్రమైన  ఆగ్రహాన్ని న్యాయస్థానం కలిగి  ఉండటం వలన ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. అందుకే ఆయన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసులు పెట్టడం జరిగింది. ఆయన పట్ల న్యాయస్థానాల వైఖరి  భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని పౌరులు విశ్వసిస్తున్నారు. అందుకే  న్యాయస్థానాన్ని పౌరులు తప్పు పడుతున్నారు. అందుకే జస్టిస్ కర్ణన్ విషయంలో తొందర పడినట్లు సుప్రీం న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ విషయంలో తొందర పడలేదు.  ప్రశాంత్ భూషణ్ కి సామాజికంగా బలమైన మద్దతు ఉందని ఆచితూచి అడుగు వేసింది. ఇచ్చట ఖరారు చేయడంలోనూ శిక్ష విధించడం లోనూ జస్టిస్ కర్ణ ప్రశాంత్ భూషణ్ కు తేడా ఉన్నది. ఇద్దరి మధ్య ఉన్న సామాజిక తేడాలు కూడా ప్రభావం చూపాయి.  కోర్టుల గౌరవం ప్రతిష్ట ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యానాలు  వల్ల దెబ్బతినలేదు.  
భారతదేశంలో కోర్టు ధిక్కార చట్టం 1971 లో వచ్చింది. అంతకు పూర్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీం కోర్టు, ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టులు కోర్టు దిక్కారం కేసులను విచారించే  విశేష అధికారాలను కలిగి ఉన్నాయి. కోర్టు ధిక్కార కేసులు చట్టప్రకారం రెండు రకాలు.

1.సివిల్ కేసులలో కోర్టు ధిక్కారం 2. క్రిమినల్ కేసులలో కోర్టు దిక్కారం అని రెండు రకాలు. సివిల్ తగాదాలలో కోర్టులో దావా హైకోర్టులో రిట్ లు వేసినప్పుడు  ఇచ్చిన ఇంజక్షన్ ఉత్తర్వులను జడ్జిమెంట్, డిక్రీ,  డైరెక్షన్, ఆర్డర్ ఉద్దేశపూర్వకంగా ఆ విధేయంగా గా వాదులు ప్రతివాదులు దిక్కరించి కోర్టు ఉత్తర్వులు వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో  కోర్టు ధిక్కారణ కేసు సివిల్ కేసు కోర్టు ధిక్కారం(Civil contempt) గా పరిగణిస్తారు. ఈ అవిధేయత ప్రదర్శించిన వారిపై కోర్టు ధిక్కార చట్టం 1971 సెక్షన్ బి ప్రకారం  కేసు నమోదు చేసి విచారించి శిక్ష విధించడం జరుగుతుంది.

2. క్రిమినల్ కేసులలో కోర్టు ధిక్కారం క్రిమినల్ (contempt) కిందకు వస్తుంది.  న్యాయస్థానాలకు గౌరవం ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రచురణ ద్వారా, మాట్లాడటం ద్వారా రాయడం, సంతకం చేయడం, విజ్ఞాపన పత్రం ఇవ్వడం, అవినీతికి పాల్పడడం, కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఇతర విషయాలలో ఎవరైనా అవి ధ్యేయంగా ప్రవర్తించిన క్రిమినల్ కోర్టు ధిక్కారం నేరం కిందకు వస్తుంది. కోర్టు ధిక్కారం చట్టం 1971 సెక్షన్2 (సి) ప్రకారం ఈ నేరాలకు పాల్పడిన వారికని న్యాయస్థానాలు విచారించి శిక్షించ వచ్చును. ఈ చట్టం ప్రకారం ఆరు నెలలు జైలు రెండు వేల రూపాయల జరిమానా విధించ వచ్చును. అయితే న్యాయస్థానాలు పరిమితమైన అధికారాలు కలిగి ఉన్నాయి. ఆర్టికల్ 19 ప్రకారం పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలి. ప్రశాంత్ భూషణ్ కోర్టు పట్ల అవిధేయతను ప్రదర్శించలేదు. కోర్టు పరువు, ప్రతిష్టలను పెంచటం కోసం ఆయన ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో ధర్మాసనం విఫలమైందని  ప్రజాస్వామిక వాదులు భావిస్తున్నారు. అందుకే ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కార కేసు పెట్టడం శిక్షించడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని న్యాయవాదులు వాదించారు.


ట్విట్టర్ పోస్ట్ పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఒక బీజేపీ నాయకుడు రాసినటువంటి లేఖను ఆధారం చేసుకుని సుప్రీం ధర్మాసనం జస్టిస్ అరుణ్ మిత్ర నేతృత్వంలో జస్టిస్  కృష్ణ మురారి లతో కూడిన ధర్మాసనం సుప్రీం కోర్ట్ సుమోటోగా స్వీకరించింది. వెంటనే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై కోర్టు దిక్కారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పౌర సమాజం నుండి తీవ్రమైన నిరసన సుప్రీంకోర్టు ఎదుర్కొన్నది. కోర్టు అధికారం పేరుతో పౌరుల భావప్రకటన స్వేచ్ఛను హక్కులను కాలరాస్తున్నారని పౌరసమాజం ఆందోళన చెందినది. అందుకే తన వాదనను మార్చుకోవాలని సుప్రీం న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ కు అవకాశం ఇచ్చింది. ఆయన మాత్రం నిబద్ధత కలిగిన న్యాయవాది గానే కాకుండా ఒక ప్రజాస్వామిక వాదిగా నేను తప్పు చేయ లేదు.  దయ చూపండి అని నేను అడగను భావిస్తే శిక్షించండి న్యాయవ్యవస్థ గౌరవాన్ని నేను దిగజార్చలేదు అని ధర్మాసనానికి విన్నవించారు. అయినా ధర్మాసనం ఆయన దోషిగా తేలితే రూపాయల జరిమానా విధించింది. రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు జైలు శిక్ష, ప్రాక్టీస్ నిషే ధం చేస్తూ తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ఒకవైపు covid 19 వలన అత్యవసర కేసులు మాత్రమే న్యాయస్థానాలు విచారిస్తున్నాయి. మరో వైపు జస్టిస్ అరుణ్ మిశ్రా రిటైర్ కాబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆగమేఘాలమీద ఈ కేసును విచారించడంతో ప్రజల్లో అనుమానాలు  రేకెత్తాయి. ఎందుకంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసుగా తీసుకునే అధికారాలపై సందిగ్ధత ఉందని స్వయంగా జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం  పేర్కొన్నది. 

అందుకు ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేయమని సిఫార్సు కూడా చేయటం జరిగినది. ఇక్కడ పౌరులకు కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. కేసును సుమోటోగా తీసుకుని ధర్మాసనం అన్ని కోణాల నుండి విచారించకుండా ఏకపక్షంగా ఎందుకు తీసుకున్నట్లు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని న్యాయస్థానానికి ఉన్న విశేష అధికారాలను సుమోటోగా కేసు ని తీసుకుని దోషిగా ఎందుకు నిర్ధారిం చారు.  లాక్ డౌన్ వలన అత్యవసర కేసుల్లో మాత్రమే విచారిస్తున్న న్యాయస్థానం ఈ కేసును ఆగమేఘాలమీద విచారించి శిక్ష వేయటం ఏమిటి. మాస్కులు లేకుండా హెల్మెట్ లేకుండా అధికారపార్టీ నాయకుని బైక్ ని రైడ్ చేసిన చీఫ్ జస్టిస్ ను వదిలివేసి  ప్రశాంత్ భూషణ్ పై కోర్టు దిక్కారం నేరం కింద శిక్షించడం ఏమిటి.  ఎందుకంటే న్యాయమూర్తుల నడవడికను చర్యలను చట్టపరంగా తప్పుబట్టిన ప్రశాంత్ భూషణ్ పై తీవ్రమైన ఇటువంటి ఆగ్రహాన్ని న్యాయస్థానం కలిగి ఉండటం.  ప్రశాంత్ భూషణ్ కోర్టులలో బయట ప్రజల పక్షాన కేసులు చేయటం. వారికి అండగా ఉండటం వలన ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. అందుకే ఆయన్ని నియంత్రించాలని లక్ష్యంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు లు పెట్టడం జరిగింది.  ఆయన పట్ల న్యాయస్థానాల వైఖరి  భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని పౌరులు విశ్వసిస్తున్నారు. అందుకే  న్యాయస్థానాన్ని పౌరులు తప్పు పడుతున్నారు. అందుకే జస్టిస్ కర్ణన్ విషయంలో తొందర పడినట్లు సుప్రీం న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ విషయంలో తొందర పడలేదు.  ప్రశాంత్ భూషణ్ కి సామాజికంగా బలమైన మద్దతు ఉందని ఆచితూచి అడుగు వేసింది. ఇచ్చట ఖరారు చేయడంలోనూ శిక్ష విధించడం లోనూ జస్టిస్ కర్ణన్ కి ప్రశాంత్ భూషణ్ కు తేడా ఉన్నది.  ఇద్దరి మధ్య ఉన్న సామాజిక తేడాలు కూడా ప్రభావం చూపాయి అనిపిస్తుంది. ఈ విషయం లో దళిత శ్రేణులు, ప్రగతిశీల, అభ్యుదయ శక్తులు లేవనెత్తిన సామాజిక న్యాయం అంశం సరైనది.  

 న్యాయ స్థానాలు మరింత ఉన్నతంగా ప్రజాస్వామీకరించ బడాలి. ప్రజాతంత్ర సమాజ నిర్మాణంలో సుప్రీం న్యాయమూర్తుల, మేధావుల పాత్ర  దోహద పడాలని అభ్యుదయ శక్తులు ఆశిస్తున్నాయి. ప్రజల పక్షాన న్యాయ వ్యవస్థ నిలబడినప్పుడే కోర్టులుకి గౌరవం, ప్రతిష్ట సమాజం లో పెరుగుతుంది. చట్టాల పేరుతో రాజ్యం ప్రజల హక్కుల అణచివేతకు అండగా మారితే పెరగడం కాదు కదా ఉన్న కాస్త విశ్వాసం కొల్పోతుంది. ప్రశాంత్ భూషణ్ కేసు విషయంలో అదే జరిగింది.  అప్పటి వరకు సమాజ అభివృద్ధి కొరకు పనిచేసే  శక్తుల రాజ్య ధికార స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి.  అది గమనించుకుని నడుచుకొనవాల్సిన భాద్యత న్యాయ వ్యవస్థ పైన ఉన్నది.

Comments