పౌరహక్కుల అణచివేతకు వ్యతిరేకంగా నిరసన (కడప జిల్లా)


ప్రజాస్వామిక,పౌర హక్కుల కు అణచివేతకు వ్యతిరేకంగా జాతీయ ప్రజాస్వామిక హక్కుల సంస్థ 22/09/2020 న దేశవ్యాప్త నిరసనకు పిలుపు మేరకు పౌరహక్కుల సంఘం,కడప జిల్లా శాఖ, రాయచోటి రెవెన్యూ సముదాయంలో ఉన్న అంబేడ్కర్ చిత్ర పటం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా  పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. రెడ్డేయ్య మాట్లాడుతూ రెండవ సారి అధికారంలో కి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజా సంపద లైనా అడవులను,గనులను, ప్రభుత్వ,ప్రవేట్ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం,అడవుల పై హక్కు కల్గిన ఆదివాసులను అడవుల నుండి తరిమివేయడం, ఆరెస్సెస్,వి.హెచ్.పి ,భజరంగ్ దళ్ లాంటి మత శక్తులు మైనారిటీలపై దాడులు చేయడం ,గో సంరక్షణ పేరుతో దళిత, గిరిజనుల పై దాడులు హత్యలు చెయ్యడం,దళిత మహిళలపై హత్యాచారాలు,హత్యలు చేయడం పెచ్చు మీరిపోయినది అడవులను ,తమ సంపదను కాపాడు కోవడానికి గిరిజనుల,ఆదివాసులు మావోయిస్ట్ పార్టీ ఆద్వర్యంలో పోరాడుతున్నారు.

 వారి ఉద్యమాన్ని అణచి వేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం  మద్య భారతంలో తమ ప్రజలపై  గ్రీన్ హంట్ పేరిట వేలాది సైన్యాన్ని దింపి యుద్దం చేస్తున్నది... ఈ మారణకాండ ను ప్రశ్నిస్తూ ప్రజలకు తెలియ జేస్తు వారి హక్కుల కోసం పోరాడుతున్న రచయితలు,మేధావులు,హక్కుల సంఘాల నేతలు, దేశంలోని ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసర్ లను,న్యాయవాదు లైనా సాయిబాబా,వరవరరావు,గౌతం నవలాఖ,అరుణ్ పెరారే,సుధా భరద్వాజ్,ఆనంద్ తెల్ తుండే,సోమా సేన్,సురేంద్ర గాడ్లింగ్,మహేష్ రౌత్,సుధీర్ తావలే,రోనా విల్సన్,వెర్ణన్ గొంజాల్వేస్, తదితరులపై బీమా..కొరేగావ్.. కుట్రకేసులో వీరందరూ ప్రధాని నరేంద్ర మోడీ నీ హత్య చేయడానికి కుట్ర పన్నారని తప్పుడు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసి దేశంలోని వివిధ జైళ్లలో నిర్బంధించి చట్టపరంగా బెయిల్ రావాల్సి ఉండగా బెయిల్ రాకుండా చేస్తూ అక్రమంగా నిర్బందిచడాన్ని ఖండిస్తున్నాం...అంతే కాకుండా 2019 ఆగస్ట్ లో కాశ్మీర్లో ఆర్టికల్ 370,35 ఏ లను రద్దు చేయడాన్ని నిరసించిన వారిపైన,అలాగే CAA,NCR,NPR లకు వ్యతిరేకంగా   పోరాడిన ప్రజాస్వామిక వాదులపైన దేశ ద్రోహం కేసులు నమాదు చేసి వేలాది మందిని జైల్ పాలు చేశారు.  డిల్లీ లో CAA NCR NPR లకు వ్యతిరేకంగా నిర్వ హించిన సభల పై, సాహిన్ బాఘ్ పై మత ముష్కరుల దాడి చేసి హత్యలకు తెగబడ్డారు...వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు...నిరసన కారుల పై నే   తప్పుడు కేసులు పెట్టిన నిర్బందించడం జరిగింది..ప్రశ్నించ డం  తట్టు కొలేని ప్రభుత్వం  పోరాడుతున్న ప్రజల పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం.

డిమాండ్స్: 1.ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలి
2.భీమా..కొరెగావ్ కుట్ర కేసుల్లో అరెస్ట్ చేసిన వారందరి విడుదల చేయాలి
3.రాజకీయ ఖైదిలను విడుదల చెయ్యాలి
4.నల్ల చట్టాలను రద్దు చేయాలి...
ఈ కార్యక్రమంలో  పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏం.రవిశంకర్, ఉపాధ్యక్షులు పి. రెడ్డేయ్య,ప్రజా సంఘాల నాయకులు రాజు,రమణ,ఆదిరెడ్డి నాయక్,చంద్ర తదితరులు పాల్గొన్నారు...
రాయచోటి..
22/09/2020.

Comments