ప్రశాంత్ భూషణ్ పై చర్యలు ఆపివేయాలి

 

We Appeal to Hon'ble supreme court withdraw contempt case on SC Advocate prasanth bhushan other wise deprived democracy

CIVIL LIBERTIES COMMITTEE (CLC).

 మిత్రులారా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజాస్వామికవాది ప్రశాంత్ భూషణ్ గారికి సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నేరం కింద గుర్తించడాన్ని పౌరహక్కుల సంఘం గా అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకం అని తెలియజేస్తున్నాము. ప్రజాస్వామిక వ్యవస్థలో అభిప్రాయాలు వ్యక్తీకరించడం ఒక హక్కుగా పౌరహక్కుల సంఘం భావిస్తోంది. న్యాయ వ్యవస్థను మరింత మెరుగుపరచటం కోసమే ప్రశాంత్ భూషణ్ బాధ్యతాయుతంగా న్యాయ వ్యవస్థలో లోపాలను ట్విట్టర్ తెలియచేశారు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేయాలని చేయాలని భావిస్తున్నాంవారు ప్రజల దృష్టికి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిన అటువంటి లోపాలను సరి చేయక పోగా ఆయన శిక్షించటం అప్రజాస్వామికమని పౌరహక్కుల సంఘం భావిస్తోంది.

పౌరులు వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని లోపాలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం ఒక బాధ్యత గా  భావిస్తున్నాము ఇలాంటి విషయాలపై ఉన్నత న్యాయస్థానం మరింత పరిశీలన చేసి వ్యవస్థ మెరుగుపరచటం  పౌరులు సూచనలను పరిగణనలోకి తీసుకుని వాటిని తప్పులను మరోసారి జరగకుండా చూసుకునే బాధ్యత న్యాయ వ్యవస్థతో సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఉన్నదని తెలియ చేస్తున్నాము. తప్పులు జరగకుండా చూడవలసి ఉన్నత న్యాయ వ్యవస్థ ఇలా తప్పు ఉంది అని సూచించిన పౌరులను శిక్షించడం,నేరస్తులు గా పరిగణించడం అప్రజాస్వామికమని పౌరహక్కుల సంఘం సమాజం దృష్టికి తీసుకు వస్తుంది. 

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ప్రజాస్వామికవాది ప్రశాంత్ భూషణ్ పైన తీసుకున్న కోర్టు ధిక్కరణ కేసు ని ఉపసంహరించుకోవాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. రేపు న్యాయవ్యవస్థ శిక్ష విధించే చర్యలు మానుకోవాలని, కోర్టు ధిక్కరణ కేసు ను  పూర్తిగా ఎత్తి వేయాలని  పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

పౌర హక్కుల సంఘం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్లే కార్డులను పట్టుకొని ఆదివారం నాడు ఇళ్ల వద్ద కోర్టులోనూ ప్రశాంత్ భూషణ్ గారి పై పెట్టిన కేసును సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పౌర హక్కుల సంఘం పిలుపు ఇస్తున్నది 

              ఇట్లు 

పౌరహక్కుల సంఘం 

ఆంధ్రప్రదేశ్ శాఖ

 వేడంగి చిట్టిబాబు 

చిలుకా చంద్రశేఖర్, 

 రాష్ట్ర అధ్యక్ష, 

ప్రధాన కార్యదర్శులు.

Comments