భారత్లో పెరుగుతున్న పోలీసు హింస

 India Also Needs Massive Protests Against Police Brutality - The Companion

భారత్లో పోలీసు హింస తీవ్రంగా పెరుగుతోంది. పోలీసులు లాకప్ లో ఎవరినైనా చంపితే పోలీసులను కేవలం విధుల నుండి తొలగిస్తున్నారు. పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంలేదు.  తమిళనాడులో పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.  జూన్లో సాతంకుళంలోని ఒక చిన్న పోలీస్ స్టేషన్‌లోకి ఒక తండ్రి, కొడుకును తరలించారు. వీరు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగిన తరువాత స్టేషనకు తరలించబడ్డారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, లోపల నుండి అరుపులు వినిపించాయి.  రాత్రి పూట అవే అరుపులు మరింత బిగ్గరగా  వారికి వినిపించాయి.

మరుసటి రోజు మధ్యాహ్నం, పొన్రాజ్ జయరాజ్ (58)  బెనిక్సు జయరాజ్ (31) ఇద్దరిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. వారి కాళ్ళ వెనుకభాగంలో రక్తం చిమ్మింది. వాళ్ళ శరీరాలపై చాలా చోట్ల రక్త గాయాలు ఉన్నట్లు బంధువులు పత్రికలకు చెప్పారు. పోలీసు కస్టడీలో వారు హింసించబడ్డారని పట్టణంలోని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు తెలిపారు. "దయచేసి, మాకు బెయిల్ పొందడానికి ఏదన్నా మార్గాన్ని చూడాలని" పొన్రాజ్ జయరాజ్ తన సోదరి జయ జోసెఫ్ ను వేడుకున్నాడు. తమని ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్దించినట్టు ఆమె భోరున ఏడుస్తూ మీడియాకు చెప్పింది. 

ఆమె తన సోదరుడు చెప్పిన చివరి మాటలను కూడా మీడియాకు చెప్పింది.  “మేము రేపు బతుకుతామనే ఆశ లేదు.” రెండు రోజుల తరువాత, తీవ్రమైన  గాయాలతో, తండ్రి  కొడుకు  మరణించారు. ఈ కేసు తమిళనాడు రాష్ట్రాన్ని అట్టుడుకుంచింది. బాధ్యులైన పోలీసులను సస్పెండు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తమిళనాడు సతంకుళంలోని పోలీసు స్టేషనులో జయరాజ్ శవాన్ని చూసిన బంధువులు పెద్ద చర్మం ముక్కలు పురుషుల పిరుదుల నుండి తీసివేయబడ్డాయని చెప్పారు. ఆసుపత్రిలోని వైద్యులు కూడా ఇద్దరూ తీవ్ర అంతర్గత గాయాలకు గురయ్యారని, మొద్దుబారిన వస్తువులు వారి పురీషనాళాల లోపలికి నెట్టబడ్డాయని  చెప్పారు.

పోలీసుల క్రూరత్వం, హింస  చట్టవిరుద్ధంగా నిందితులను హత్యల చేయడం భారతదేశంలో దశాబ్దాల నుండి ఒక రివాజుగా మారింది.   ప్రతి సంవత్సరం,  "నకిలీ ఎన్కౌంటర్లు" జరుగుతూనే వున్నాయి.  ఇంకా చాలా మంది ప్రజలు పోలీసు కస్టడీలో హింసించబడుతున్నారు. పోలీసు హత్యలు చాలా భారతీయ వార్తా మాధ్యమాలలో విస్తృతంగా కవర్ చేయబడుతున్నాయి.  చాలాచోట్ల పోలీసు హింసకు వ్యతిరేకంగా ఆందోళనలు, ప్రదర్శనలు జరిగాయి. వీటికి ముగింపుగా ప్రభుత్వం పోలీసులను కేవలం విధుల నుండి బహిష్కరిస్తోంది.   కానీ చాలా అరుదుగా  మార్పు కోసం పిలుపునిచ్చే విస్తృత నిరసనలు దేశవ్యాప్తంగా జరగడం లేదు. 

అమెరికాలో ప్రజలు పోలీసి హింసకు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అక్కడ పోలీసు హింసలో జాతి వ్యతిరేకత వ్యక్తమవుతుందే. ఇది అమెరికా ప్రజలను శాంతంగా కుర్చోనియడం లేదు. ప్రపంచవ్యాప్తంగా,మే నెలలో మిన్నియాపాలిస్లో పోలీసు కస్టడీలో ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ మరణం పోలీసులు చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చస్తారో తెలుపుతుంది.   కాని భారతదేశంలో ఇలాంటి జాతీయ ఆందోళనలు జరగడం లేదు. పోలీసుల క్రూరత్వాన్ని సామూహికంగా వ్యతిరేకించే గుణం భారత ప్రజలకు అబ్బనట్టు లేదు.  చాలా మంది భారతీయులు రోజువారీ నేరాలను మాత్రమే ముఖ్యమైన సమస్యగా చూస్తారు. పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారనడానికి తగిన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, మెజారిటీ ప్రజలు తరచూ పోలీసుల పక్షాన ఉంటున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లు ఏమన్నా చేస్తారనే  భయం కూడా ప్రజలను వెంటాడుతోంది.

దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న  హక్కుల సంఘం నేషనల్ క్యాంపెయిన్ ఎగైనెస్ట్ టార్చర్ అనే సుదీర్ఘ నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం, గత ఏడాది పోలీసుల అదుపులో కనీసం 1,731 మంది మరణించారు. మరణించిన వారిలో ముస్లింలు,  దళితులు ఎక్కువమంది వున్నారు. భారతదేశంలో హత్యలు చేస్తున్న పోలీసులు శిక్షకు అరుదుగా గురౌతున్నారు. అప్పటికప్పడు కొంతమంది అధికారులను అరెస్టు చేస్తారు. కాని వారిపై నేరారోపణలు చాలా తక్కువగా ఉంటాయి.

సాధారణంగా భారతీయులు, తరచుగా అవినీతిపరులైన చట్ట అమలు వ్యవస్థ చట్టవ్యతిరేక పనితీరుతో ఉద్రేకపడకారు. న్యాయం కోసం ఆరాటపడతారు. అయినా  వారు నేరస్తులను  నిర్మూలించడాన్ని స్వాగతిస్తారు. ప్రజల్లో వున్న ఈ భిన్న ఆలోచనలు పోలీసుల ఎన్కౌకౌంటర్లకు ఊతమిస్తున్నాయి. "పోలీసులు ముద్దాయిలను హత్యలు చేసిన తరువాత ప్రజలు పోలీసులతో కలిసి  బహిరంగ వేడుకలు జరుపుకుంటున్నారు" అని హక్కలు నాయకులు వాపోతున్నారు. చాలా నెమ్మదిగా ఉన్న న్యాయ ప్రక్రియ,  తక్కువ నేరారోపణ ఎదుర్కుమంటున్న పోలీసులు, ఎన్కౌంటర్ల ద్వారా నేరాలు తగ్గుతాయనే ప్రజల భావజాలం చట్టవ్యతిరేక హత్యలను ప్రోత్సహిస్తున్నాయి. హింసను భారతదేశంలో రాజ్యాంగం నిషేదించింది.  కాని పోలీస్ స్టేషన్లలో ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది.

2005, 2018 మధ్య పోలీసు కస్టడీలో 500 మంది హింసించబడ్డారు. అయినా బాధులైన పోలీసులు ఏ ఒక్కరు శిక్షించబడలేదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.  అనుమానాస్పద పోలీసు హత్యలకు పేరుగాంచిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో, 2017 మార్చి నుండి ఇప్పటివరకు 74 మంది పోలీసు అధికారులపై న్యాయాధికారులు దర్యాప్తు జరిపారు. అన్ని కేసుల్లోను పోలీసు అధికారుల తప్పులేదని స్వయానా న్యాయాధికారులే తేల్చారు. 

పోలీసు హత్యలు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హిందూ జాతీయ సన్యాసి అయిన యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో వేగవంతమయ్యాయి. 2017 లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు, ఆదిత్యనాథ్ తన ప్రభుత్వం నేరస్థులను  నిర్మూలిస్తుందని బహిరంగంగా పేర్కొన్నాడు.

భారతదేశంలో పోలీసు హత్యలు అనేక రూపాల్లో జరుగుతున్నాయి. కొంతమంది నిందితులను పొరుగున ఉన్న పోలీస్ స్టేషన్లలో కొట్టి చంపుతున్నారు.  రద్దీగా ఉండే జైళ్లలో ఉంచినప్పుడు ముద్దాయిలు ఎక్కువ మంది జ్యుడీషియల్ కస్టడీలో చంపబడతారు. ఫిబ్రవరిలో న్యూ ఢిల్లీలో జరిగిన అల్లర్లులో ఇద్దరు చనిపోయారు. ఇది హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలగా పోలీసులు చిత్రీకరించారు. పోలీసు అధికారులు ముస్లిం పురుషుల బృందాన్ని బంధించి తీవ్రంగా కొట్టారు. వారిలో ఒకరు రెండు రోజుల తరువాత అంతర్గత గాయాలతో మరణించారు.

తమపై దాడి చేసిన లేదా లొంగిపోవడానికి నిరాకరించిన ప్రమాదకరమైన అనుమానితులను కాల్చడం తప్ప తమకు వేరే మార్గం లేదని పోలీసు అధికారులు మీడియాకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సంఘటనలను ఎన్‌కౌంటర్లు అంటారని సామాన్య ప్రజలకు తెలుసు. గత ఏడాది హైదరాబాద్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్‌లో నలుగురిని కాల్చి చంపారు. నిందితులపై అత్యాచారం, హత్య ఆరోపణలు వున్నాయి. నేరం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నిందితులను పోలీసులు నేర ప్రదేశానికి తీసుకువచ్చారు. అక్కడ నిందితులు తమ తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారని, ఎదురుకాల్పుల్లో నిందితులు చనిపోయారని పోలీసులు తెలిపారు.  ఎన్కౌంటరు ప్రదేశంలో పోలీసు అధికారులను ప్రజలు హీరోలను చేసారు. వారినపై గులాబీ పువ్వులతో వర్షం కురిపించారు.

గత నెలలో, మరో ప్రశ్నార్థకమైన ఎన్‌కౌంటర్ జరిగింది.  ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని పెద్ద పారిశ్రామిక నగరమైన కాన్పూర్ సమీపంలో ఒక రహదారిపై జరిగింది. పోలీసు అధికారుల గ్యాంగ్ స్టర్ అయిన  వికాస్ దుబేను చంపేశారు. అతన్ని రవాణా చేస్తున్న  కారు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.  దుబేను రవాణా చేస్తున్న కాన్వాయ్‌ను అనుసరిస్తున్న జర్నలిస్టులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఒక మైలు ముందు, అది జరగడానికి కొన్ని నిమిషాల ముందు పోలీసుల చేత నిలిపివేయబడ్డారు.  

ముఖ్యంగా రక్షకుడు హంతకుడిగా మారిపోతున్నప్పుడు, న్యాయాధికారులు వారిపై వున్న కేసులను కొట్టివేస్తున్నప్పుడు, మెజారిటీ సమాజం నేరస్ధులను చంపడాన్ని హర్షిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో నేరమయ స్వభావం మరింతగా స్ధీరికరించబడుతోంది. ఇది ప్రజలలో నేరమయ స్వభావాన్ని పెంచుతుంది. వ్యవస్ధలో జవాబుదారితనం కొరవరినపుడు నేరస్ధులు తయారుచేయబడతారు. 


Comments