జల్ జంగిల్ జమీన్ పైన ఆదివాసీలకే హక్కు (పశ్చిమ గోదావరి జిల్లా)

 


9 8 20 20 కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లా

ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా రాజ్య హింసకు వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ  మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ పైన ఆదివాసీలకే హక్కు ఉండాలని ఉద్యమిస్తున్న ఇటువంటి ఆదివాసీలపై రాజ్యం రాజ్యహింస ను ప్రయోగిస్తుందని ఆరోపించారు ఆదివాసి లు, ఆదివాసి ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలకే స్వయంపాలన చేసుకునే విధంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం  నాయకులు జి శ్రీను B గోవింద్ PDSU నాయకులు మహర్షి, ఐ ఎఫ్ టి యు నాయకులు గునప రెడ్డి శ్రీధర్ అప్పారావు తదితరులు  పాల్గొన్నారు

Comments