ఎస్సిలపై అక్రమ రౌడీ షీట్లను ఎత్తివేయాలి (సిరిసిల్ల జిల్లా)

 Date : 06 - 08 - 2020

సిరిసిల్ల జిల్లాలో ఎస్సీల పై అక్రమ రౌడీ సీట్లపై పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ విచారణ.

ఈరోజు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా కొత్తగా 28 రౌడీషీట్లు తెరవడం అందులో లో 70 శాతానికి పైగా ఎస్సీల పై  ఈ అక్రమ రౌడీషీట్లు పై నిజ నిర్ధారణ కమిటీ విచారణ చేపట్టింది ఈ కమిటీకి మాదన కుమారస్వామి ,రాష్ట్రసహాయకార్యదర్శి. పౌరహక్కుల సంఘం  తెలంగాణ, పౌరహక్కుల సంఘం నేతృత్వంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని   బాధితులైన బెస్త నరేష్, సుడిదీ  రాజేందర్ లతో కలిసి ఈ విచారణ చేపట్టి సిరిసిల్ల జిల్లా లో ఎస్సీల పై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మరియు పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ విషయమై పోలీసులు స్పందించకుంటే పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేశారు లేనిపక్షంలో సంబంధిత పోలీసులపై కూడా ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం  కేసు నమోదు చర్యలు చేపడతామని హెచ్చరించారు 

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో అనుచరగణం ఈ విధంగా ఎస్సీలు ప్రశ్నించే గొంతు నొక్కాలని అక్రమ కేసులు బనాయించి దాన్ని సాకుగా చూపి రౌడీషీట్లు ఓపెన్ చేయడం తీవ్రంగా ఖండించారు ఈ అక్రమ అక్రమ రౌడీ సీట్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాదన కుమారస్వామి ,రాష్ట్రసహాయకార్యదర్శి. పౌరహక్కుల సంఘం  

తెలంగాణ,ఏనుగు మల్లారెడ్డి,ప్రధానకార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ,పొగుల రాజేశం,E. C. మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం, కడ రాజయ్య, E. C.మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం, మార్వాడి సుదర్శన్ రాష్ట్ర ప్రదానకార్యదర్శి దళితలిబరేషన్ ఫ్రంట్, మరియు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రొడ్డ రాంచంద్రం  పాల్గొని మాట్లాడారు.

Comments