అంబేద్కర్ కాలనిపై కబ్జాదారుల కన్ను (నెల్లూరు జిల్లా)

 

సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో షుమారు 2 సంవత్సరాలుగా ఇళ్ళులేని నిరుపేద దళితులు, మైనారిటీ లు, బిసి లు దాదాపు 50 కుటుంబాలవారు పౌరహక్కుల సంఘం సహకారం తో  కాలువ పోరంబోకు స్థలములో గుడిసెలు వేసుకుని *అంబేద్కర్ కాలని* పేరుపెట్టుకొని జీవిస్తున్నారు. దీనిపై కన్నేసిన భూకబ్జా దారులు రాజకీయ పలుకుబడి తో కాలనీవాసులను బెదిరిస్తూ ఖాళీచేసి వెళ్ళకుంటే గుడిసెలు తగలపెడతామని, అడ్డొచ్చేవారిని నరికేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ స్పందించి కాలనీవాసులకు మద్దతుగా నిలబడి సంఘటితంగా ఎదుర్కొందామని బరోసా కల్పిస్తూ ఈరోజు(7-8-20) విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది

Comments