ప్రశాంత్ భూషణ్ కు మద్దతు ఇద్దాం (పచ్చిమ గోదావరి జిల్లా)

 

We Appeal to Hon'ble supreme court withdraw contempt case on SC Advocate prasanth bhushan other wise deprived democracy

CIVIL LIBERTIES COMMITTEE (CLC).

 మిత్రులారా! సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రజాస్వామికవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ పోస్ట్ లను సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నేరం కింద గుర్తించడాన్ని పౌరహక్కుల సంఘం గా అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం అని తెలియజేస్తున్నాము.పౌరులు ప్రజాస్వామిక వ్యవస్థలో అభిప్రాయాలు వ్యక్తీకరించడం ఒక హక్కుఅని పౌరహక్కుల సంఘం భావిస్తోంది. న్యాయ వ్యవస్థను మరింత మెరుగుపరచటం కోసమే ప్రశాంత్ భూషణ్ బాధ్యతాయుతంగా న్యాయ వ్యవస్థలో లోపాలను ట్విట్టర్ ద్వారా  సమాజం ముందు ఉంచారు. గతం లో సుప్రీం న్యాయమూర్తులు విలేఖరుల సమావేశాన్ని పెట్టి అత్యున్నత న్యాయస్థానం లో జరుగుతున్న తప్పులను గురించి సమాజానికి  న్యాయమూర్తులు భాధ్యత గా వివరించినట్లు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ భాద్యత గా  సమాజానికి జరుగుతున్న విషయాలను ట్వీట్ చేశారు అని పౌరహక్కుల సంఘం బలంగా విశ్వసిస్తున్నది. పౌరులు వ్యవస్థలో ఉన్నటువంటి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఒక బాధ్యత.  ఇలాంటి విషయాలపై ఉన్నత న్యాయస్థానం మరింత పరిశీలన చేసి వ్యవస్థ మెరుగుపడటం కోసం పౌరులు సూచనలను పరిగణనలోకి తీసుకుని వాటిని, ఆ తప్పులను మరోసారి జరగకుండా చూసు కొన వలసిన బాధ్యత న్యాయ వ్యవస్థతో సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఉన్నదని పౌర హక్కుల సంఘం తెలియ చేస్తున్నది. 

తప్పులు జరగకుండా చూడవలసిన, సరిచేయవలసిన ఉన్నత న్యాయ వ్యవస్థ తప్పు ఉంది అని సూచించిన టువంటి పౌరులను శిక్షించడం, నేరం గా పరిగణించడం అప్రజాస్వామికమని పౌరహక్కుల సంఘం సమాజం దృష్టికి తీసుకు వస్తుంది.న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కంటే ముందు చట్టబద్ద పాలన చేయమని ప్రశ్నించిన మేధావులను  తప్పుడు కేసులను పెట్టి జైలులో అక్రమం గా  మేధావులను నిర్బంధించారు.వీరంతా సమాజం లో అవినీతి,అక్రమాలకు వ్యతిరేకం గా పోరాడినవారు. పీడితులు,తాడితులకు అండగా నిలబడిన ప్రగతిశీల శక్తులు. కుల,మత వర్గ వైషమ్యాలు రూపుమాపేందుకు తమ కలం తో గళం తో అక్షరాలను పదు నెక్కించి సమాజాన్ని చైతన్య పరిచారు.  వీరి విషయంలో న్యాయవ్యవస్థ సహితం నిర్ధయ గా వ్యవహరించింది.హంతకులు సహితం పెరోల్ పై బయటకు వెళ్ళటం మన అందరికి తెలుసు. 90% వికలాంగుడు అయిన ప్రొఫెసర్ G N సాయిబాబా తల్లి మరణిస్తే పెరోల్ కూడా ఇవ్వని గొప్ప న్యాయవ్యవస్థ మనది. కరోనా పోసిటివ్ ప్రాణాపాయం స్థితి లో ఉన్న 80 సంవత్సరాల పండుముదుసలి మేధావి, రచయిత వరవర రావు కి సహితం బెయిల్ నిరాకరించకలిగిన గొప్ప తనం న్యాయవ్యవస్థది. ప్రభుత్వాల తప్పిదాలు ప్రశ్నించటం,చట్టబద్ద పాలన కోరడం, పౌరులకు అండ గా నిలబడటం ఈ మేధావులు చేసిన తప్పు. వారి విషయంలో సమాజం స్పందించవలసినంత స్పందించలేకపోయింది. దాని ఫలితమే ప్రజాస్వామిక వాది ప్రశాంత్ భూషణ్ పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు. నేర నిర్ధారణ. శిక్ష కు ఉపక్రమించడం. 

శరవేగంగా జరిగి పోతున్నాయి. సుప్రీం కోర్టు సమాజం లో ఎక్కడ పలచ బడిపోతుందో అని ఆయన వాదనను మార్చుకోమని ఒక వాయిదా ఇచ్చారు. అది నేను చేసిన తప్పు కాదు. మెరుగైన న్యాయ వ్యవస్థ కోసం బాధ్యత తో ఇచ్చిన ట్వీట్ అని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ ఒక వాయిదా ఇవ్వడం లోనే ఒక మోహన వ్యూహం ఉన్నది. రాజ్యం పాత్ర ఉన్నది అని అనుమానం కలుగుతుంది.1.న్యాయ వ్యవస్థ ప్రజల్లో పలచ పడకుండా ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను సాధారణ పౌరుల అసంతృప్తిని పక్కదారి పట్టించడం. లేదా తగ్గించడం. ప్రశాంత్ భూషణ్ ని మొండి వాడు అని ముద్రవేయడం. న్యాయ వ్యవస్థ ఇచ్చిన అవకాశం ఉపయోగించు కోలేదు అని తనకు మద్దతుగా నిలబడిన సహచర న్యాయ వాదులను దూరం చేయటం.2 రాజ్యం దగ్గర లొంగుబాటు కి అవకాశం ఇవ్వడం. ఇవి ఏవి ఆయన ముందు పనిచేయలేదు.ఆయన అనుభవం ముందు ధర్మ ప్రభువుల ఆదేశాలు ప్రజల ముందు తెల్ల బడడం తప్ప.నేను ఏ తప్పు చేయలేదు. కనికరించవద్దు. నేరం అని భావిస్తే శిక్షించండి. శిక్షను ఆనందం గా ఆహ్వానించిన ధీశాలి. అందుకే ఆయన బ్రిటీష్ వాళ్ళ పాలనలో బ్రిటీష్ కోర్టు కి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన కొటేషన్ ని ఉదహరించారు. దాని అర్ధం సమాజం మొత్తానికి అర్ధమయింది. 

అందుకే నిబద్దత సామాజిక స్పృహ కల్గిన  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రజాస్వామికవాది ప్రశాంత్ భూషణ్ పైన తీసుకున్న కోర్టు ధిక్కరణ కేసు ని ఉపసంహరించుకోవాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. రేపు న్యాయవ్యవస్థ శిక్ష విధించే చర్యలు మానుకోవాలని, కోర్టు ధిక్కరణ కేసు ను  పూర్తిగా ఎత్తి వేయాలని  పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రశాంత్ భూషణ్ కి అంటే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్య లకు అండగా నిలబడాలని పౌరహక్కుల సంఘం కోరుతున్నది. ప్రజలు ప్రజాస్వామిక వాదులు నినదించి గొంతు ఎత్తి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని పౌరహక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

              

పౌర హక్కుల సంఘం.

Comments

Post a Comment