హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు,వారి న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దాడిచేసిన ఛత్తీస్‌ఘడ్ పోలీసులను శిక్షించాలి.
ఈ రోజు (ఆగస్టు 17,2020 న) ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై(ప్రియా శుక్లా ఛత్తిస్‌గఢ్ పియుసిఎల్‌లోనూ, జగదల్‌పూర్ లీగల్ ఎయిడ్‌లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గానూ పని చేస్తున్నారు).దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళాడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది.
న్యాయవాది ప్రియాంక శుక్లా జీవన సహచరుడు అనుజ్ శ్రీవాస్తవ ప్రియాంక వివరించినట్లు సర్కండా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి (టి ఐ) శనిప్ రాత్రే, ఎస్‌పి నిమిషా ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా- శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఛత్తీస్‌ఘడ్‌లో వున్న ఏకైక హెచ్ఐవి సోకిన మైనర్ బాలికల ఆశ్రయం ʹఅప్నాఘర్ʹలో నివసిస్తున్న 14 మంది హెచ్ఐవి సోకిన మైనర్ బాలికలను, న్యాయవాది ప్రియాంక శుక్లాను తీవ్రంగా కొట్టి జుట్టు పట్టుకొని లాగుతూ అజ్ఞాత ప్రదేశానికి ఎత్తుకెళ్లి పోయారు.
ఈ ఆశ్రయం చాలా సంవత్సరాల నుంచి నడుస్తోంది. అయితే క్రితం సంవత్సరం మాత్రమే ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. మహిళా –శిశు సంక్షేమాధికారి పార్వతి శర్మ, ప్రభుత్వం మంజూరు చేసే నిధులలో 30 శాతం కమీషన్ యివ్వాలని అడిగింది. ʹఅప్నాఘర్ʹ నిర్వాహకులు అందుకు నిరాకరించడంతో వారిని వేధించడం మొదలుపెట్టింది. ఆశ్రయం నడిపే ప్రమాణాలు సరిగా లేవు కాబట్టి ఆశ్రయాన్ని మూసివేసి బాలికలందరినీ వేరే ప్రాంతాలకు తరలించాల్సి వుంటుంది అని చెప్పింది. ఇటీవల ఎన్‌డిటివిలో రవిష్ కుమార్ షెల్టర్ హోమ్ ʹఅప్నాఘర్ʹ గురించి కథనాలను ప్రసారం చేసినప్పుడు లాయర్ ప్రియాంక ఈ విషయాల్ని ఎన్‌డిటివిలో బహిర్గతం చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో, మహిళా- శిశు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు అధికారులు సర్కండా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ʹఅప్నా ఘర్ʹ షెల్టర్ హోమ్‌కు వచ్చి ముందస్తు హెచ్చరికలేమీ లేకుండా హెచ్‌ఐవి సోకిన మైనర్ బాలికలను తీవ్రంగా కొట్టారు. 14 మంది బాలికలను, ʹఅప్నాఘర్ʹ షెల్టర్ హోమ్ న్యాయ సలహాదారైన న్యాయవాది ప్రియాంక శుక్లా (ప్రియా శుక్లా) ను అజ్ఞాత ప్రదేశానికి ఎత్తుకెళ్లి పోయారు. తాను షెల్టర్ హోమ్‌కు వచ్చినప్పుడు, విరిగిన గాజుల ముక్కలు, రక్తం మరకలు కనపడినట్లు అనూజ్ ఒక వీడియోలో చెప్పారు. అనూజ్ జర్నలిస్టు. అదే హోదాలో ఆయన సర్కండా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, తనతో అమర్యాదకరమైన భాషను ఉపయోగించి, చట్ట ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నావనే ఆరోపణతో కేసు పెడతామని బెదిరించాడు స్టేషన్ ఇన్‌చార్జి. పైగా అనూజ్ ను వీడియో తీశారు. అతని దగ్గరినుండి మొబైల్ ఫోన్ గుంజుకున్నారు. బాలికలను, ప్రియాంకను ఎక్కడికి తీసుకెళ్లారనే దాని గురించి అనుజ్‌కి ఏమీ చెప్పలేదు.
HIV పాజిటివ్ వున్న పిల్లల్ని కొట్టడానికి పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు? లంచం అడిగిన సురేష్ సింగ్, పార్వతి శర్మల మీద విచారణ ఎందుకు విచారణ ఇప్పటి వరకు జరపలేదు.
1.హెచ్‌ఐవి సోకిన 14 మంది మైనర్ బాలికలను మరియు న్యాయవాది ప్రియా శుక్లా లను తక్షణమే విడుదల చేయాలి.
2.చట్టవ్యతిరేఖంగా దాడులు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న ఛత్తీస్‌గఢ్ పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, విదులనుంచి సస్పెండ్ చేయాలి.
3.హెచ్‌ఐవి సోకిన 14 మంది మైనర్ బాలికలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం ఇప్పించి పెర్మమెంట్ పునరావాస కేంద్రానికి తరలించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది..
1 వి.చిట్టి బాబు, రాష్ట్ర అధ్యక్షులు
2.చిలుకా చంద్ర శేఖర్ ప్రధానకార్యదర్శి,
పౌర హక్కుల సంఘం,ఆంధ్ర ప్రదేశ్
It is nothing but shoking News . Can you please provide me the Advocate Mr Sukla's contact number . I will talk to him and find out the appropriate authorities and approach them for getting Justice.
ReplyDelete