ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు చేసిన అడవిపదిర పంటభూముల ధ్వంసాన్ని ఖండిస్తున్నాం...పోడుభూములకు పట్టాలివ్వాలి - పౌర హక్కుల సంఘం
అడవిపదిర గ్రామం, వీర్నపల్లి మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాలో,గత పదిరోజుల క్రితం,100 మంది దళిత మరియు BC కుటుంబాల ప్రజలు 30 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్న భూముల్లో నుంచి ఖాళీచేయలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు దాడిచేసి పంటలను ధ్వంసం చేసి మరియు భూములను కందకాల గోతులు తవ్విన ఘటనపై,పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం కమిటి మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు, గురువారం 6,ఆగస్టు,2020 న అడవిపదిర గ్రామంలో గ్రామస్తులను, పొడుచేసి బ్రతుకుతున్న దళిత వెనుకబడిన వర్గానికి చెందిన రైతులనుకలిసి పోడు భూములను,పంటలను పరిశీలించి సేకరించిన నిజనిర్దారణ వివరాలు.
30 సంవత్సరాల నుంచి అడవిపదిర గ్రామంలోని నిరుపేద 40 దళిత కుటుంబాలకు చెందిన ప్రజలు మరియు 60 మంది వెనుకబడిన కుటుంబాలకు చెందిన100 కుటుంబాల ప్రజలందరు భూమిలేక అడవి పదిర ఊరు పక్కనే ఉన్న గుట్టల శ్రేణిని విస్తరించిన అడవిలోఅంచున గలా గుట్టల సముదాయం కింది భాగంలో 30 సంవత్సరాల నుంచి పొడుచేసిన భూముల్లో పత్తి,వరి పండిస్తూ జీవనంకోనసాగిస్తున్నారు. వీరందరిలో ఎక్కువ మంది దుబాయ్, మస్కట్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో అప్పులు చేసి కాయకష్టంతో సంపాదించిన డబ్బులతో వ్యవసాయం చేసిబ్రతుకుతున్నారు. వీరికి అర ఎకరం నుండి గరిష్టంగా 2 ఎకరాల వరకు భూమి సాగుచేస్తున్నారు.2017 న ఈ భూములకి కరెంట్ సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వానికి అర్జీలుపెట్టుకొని ఒక ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయించుకొని కరెంట్ పోల్స్ వేసుకొని 5 బోర్ లు వేసుకుని,కరెంట్ చార్జీలు కడుతూ వ్యవసాయం చేస్తున్నారు.
2014 ఏప్రిల్ లో తెలంగాణ రాష్ట్ర మొదటి ఎన్నికల సందర్బంగా, KCR పోడుభూములకి పట్టాలిస్తానని అడవిపదిర రైతులకు హామీఇచ్చి నాడని, తిరిగి 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో,2019 న 17 వ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో KCR మరియు KTR లు అడవిపదిర గ్రామం లోపోడుభూములు సాగుచేస్తున్న దళిత & BC రైతులకు పట్టాలిస్తామని హామీలు ఇఛ్చినారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి KCR కొడుకు KTR ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గంలోనిదే ఈ అడవిపదిర గ్రామం.27 జులై,2020 సోమవారం నాడు ఉదయం200 మందిపోలీసులు,100 మంది ఫారెస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు అడవిపదిర గ్రామంలోని పొడుభూముల్లోని పంటలను ధ్వంసం చేసి,JCB మరియు ట్రాక్టర్ల తో భారీ కందకాలు తవ్వి,ఈ భూములనుండి వెళ్లిపోవాలని తీవ్రహెచ్చరికలు జారిచేసినారు.300 మంది గ్రామస్తులు,రైతులు ఈ దాడులను వ్యతిరేకించి, అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులతో బెదిరించి అడ్డుకుని ధ్వంసంచేసినారు...పౌర హక్కుల సంఘం తెలంగాణ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది.
1.ప్రభుత్వం పొడుభూములకు పట్టాలివ్వాలి.
2.పొడుభూముల్లోని పంటల వింధ్వంసానికి ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలి.ఈ గ్రామం, KTR నియోజకవర్గం అయిన సిరిసిల్లా అసెంబ్లీ లోనిది,కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయిన బండి సంజయ్ ప్రాతినిధ్యం లోనిదే ఈ అడవిపదిర గ్రామం.ఇద్దరు పొడుభూముల పంటలధ్వంసానికి బాధ్యులె.ఉమ్మడిగా జవాబుదారీతనం వహించాలి.
3.పొడుభూములు కాకుండా ఇదివరకే పట్టలైన భూములను కూడా కాళీచేసి వెళ్లాలని ఫారెస్ట్ వాళ్ళు తెల్లజెండాలు పాతినారు.ఇది ఉపసంహరించుకొవాలి...
4.రైతులను భయబ్రాంతులకు గురిచేయడం.,పోలీసులు మరియు ఫారెస్ట్ వాళ్లతో దాడులు చేయించడం ఆపివేయలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది......
1మాదనకుమారస్వామి ,రాష్ట్రసహాయకార్యదర్శి. పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.ఏనుగు మల్లారెడ్డి,ప్రధానకార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ,
3పొగుల రాజేశం,E. C. మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4. కడ రాజయ్య, E. C.మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం,
5.మార్వాడి సుదర్శన్ రాష్ట్ర ప్రదానకార్యదర్శి దళితలిబరేషన్ ఫ్రంట్...
6:30 సాయంత్రం,6ఆగస్టు,2020.
అడవిపదిర గ్రామం,వీర్నపల్లి మండలం.
రాజన్న సిరిసిల్లాజిల్లా...
Comments
Post a Comment