వీర్రాజు కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలి (పచ్చిమ గోదావరి జిల్లా)

 

17 08 2020 కొవ్వూరు.

గోదావరి నది లో చనిపోయిన  ఇసుక కార్మికుడు వీర్రాజు కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి .

 ఈరోజు స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసు వద్ద పౌరహక్కుల సంఘం ఐ.ఎఫ్.టి.యు గోదావరి నదిలో ఇసుక పని చేస్తూ చనిపోయిన కార్మికుడు వీర్రాజు కుటుంబానికి ప్రభుత్వం  న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ సందర్భం గా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గోదావరి నది లో పనిచేస్తూ చనిపోయిన టువంటి రేవు వీర్రాజు ఇసుక కార్మికుని మరణానికి ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ బాధ్యత వహించి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.వరద సమయంలో గోదావరి మట్టం పెరిగి ప్రమాదకరంగా మారిన దశలో గోదావరిలో ఇసుక తవ్వకాలు జరపడం వలన ఇసుక కార్మికుడు వీర్రాజు మరణించారని అన్నారు. 

ప్రాణాల ను పణంగా పెట్టి ఇసుక తీసుకు వస్తున్నటువంటి కార్మికులకు జీవన భద్రత, రక్షణ లేదని ఆవేదన చెందారు.తక్షణమే కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర మైనటువంటి చట్టం తీసుకురావాలని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మైనింగ్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వం కార్మికులు గా గుర్తిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వలన కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని,ఇసుక తవ్వకాలు వలన సమాజం లో చాలామందికి ఆదాయం,ఉపాధి వస్తుందని అన్నారు. అట్లాంటి ఇసుక కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకొని చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు .  ఈ మేరకు చనిపోయిన రేవు వీర్రాజు కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ D లక్ష్మారెడ్డి గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. 

     ఈ ఈ సందర్భంగా ఆర్ డి ఓ డి. లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్మిక కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు.  కార్మికులు ఇసుక తవ్వకం పనుల్లో జాగ్రత్తలు పాటించాలని,వరద ఉదృతం గా ఉన్నందున నదిలోకి వెళ్లరాదని తెలిపినారు. కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపైన తన దృష్టికి తీసుకువస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.ఇసుక రేవులలో కార్మికులకు ప్రమాదం ఏర్పడితే, Apmdc, రెవెన్యూ,పోలీస్ ల దృష్టి కి తీసుకురావాలని అన్నారు. గోదావరి ఇసుక కార్మిక సంఘం IFTU అధ్యక్షులు చిన్నం చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ  సహాయం టి పాటు కార్మికుడు వీర్రాజు కుటుంబానికి పడవల యజమానులు సహకరించి తక్షణమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నక్క వెంకటరత్నం జిల్లా అధ్యక్షులు పౌరహక్కుల సంఘం పశ్చిమ గోదావరి గోదావరి కార్మిక సంఘం  ఉపాధ్యక్షులు గూన్నపరెడ్డి శ్రీధర్, యేసు వెంకటేశు నీరు కొండ వీరబాబు రామభద్ర శ్రీను రాంబాబు ఏ నరసింహారావు వెంకన్న తదితరులు పాల్గొన్న ప్రసంగించారు 

                               

- పౌర హక్కుల సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా.

    

Comments