13 8 2020
పౌర హక్కుల సంఘం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
ఈరోజు స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను హత్యలను అత్యాచారాలను అరికట్టడంలో అని ధర్నా జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా భయంతో బతుకుతుంటే అగ్రవర్ణ పెత్తందార్లు దళితులపై దాడులు చేయడం హత్యలు చేయటం అత్యాచారాలు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీల అభివృద్ధికే కేటాయించాలి అని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అరికట్టాలి వారికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఇటీవల సీతానగరం లో దళిత యువకునికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం, చీరాలలో పోలీసుల చేతుల్లో ప్రవీణ్ కుమార్ హత్య,చిత్తూరు జిల్లాలో భూమి కోసం పోరాటం చేస్తున్న గిరిజన యువకుడు హత్య, గుంటూరు జిల్లాలో కరోనా పేరుతో దళిత యువకులపై దాడి, నర్సీపట్నంలో దళిత యువకుడు హత్య సంఘటన సమాజానికి సిగ్గుచేటు అని అభివర్ణించారు. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క వెంకటరత్నం మాట్లాడుతూ దళితులు కూడా పౌర లేనని దళితులకు పౌర హక్కులు ఉన్నాయని వారు జీవించే హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు ఈమని మల్లిక మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు మను వాదుల నుండి రక్షణ కరువైందని ఆరోపించారు . ఎస్సీ ఎస్టీలపై నా మహిళలపైన దాడులు హత్యలు అత్యాచారాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాల నీ ప్రజల కు విజ్ఞప్తి చేశారు. దళితులకు తగిన రక్షణ కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణం దళితులపై దాడులు చేసినటువంటి దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు ఈ మని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు లాక్‌డౌన్ కాలం లో నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు NSV మహర్షి మాట్లాడుతూ విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో స్కూలు తెరుస్తారని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా స్కూలు తెరవడం వల్ల విద్యార్థులకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.వ్యాక్షిన్ వచ్చిన తర్వాత స్కూలు ఓపెన్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నో వ్యాక్సిన్ నో స్కూల్ నినాదంతో పిడిఎస్యు డిమాండ్ చేస్తుందని అన్నారు. స్కూల్ కళాశాల విద్యార్థులకు లాప్టాప్లు సెల్ఫోన్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ నాయకురాలు పి నాగమణి మార్తా మాట్లాడుతూ మహిళలపై జరిగే దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు నాయకులు చీర అప్పారావు పిడిఎస్యు నాయకులు బి మహేంద్ర హర్ష వర్ధన్ పీవోడబ్ల్యూ నాయకురాలు కే సుశీల తదితరులు పాల్గొని ప్రసంగించారు
Comments
Post a Comment