భూమి కోసం గిరిజనుడి హత్య (చిత్తూరు జిల్లా)

 

భూమి కోసం గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం  పంచాయతీ మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. షికారీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చింతలపాళేనికి చెందిన కొంతమంది ఆ 560 ఎకరాల భూమిని కాజేసి పట్టాలు సంపాదించారు. దీంతో 2006 నుంచి షికారీలు తమ భూమి కోసం పోరాటం చేస్తున్నారు.  ఈ నెల 7న షికారీలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుడిసెలు వేశారు. దీన్ని సహించలేని అగ్రకులాల వారు దాడి చేయడంతో 23 మంది షికారీలు గాయపడ్డారు. ఆ ఘటనలో 28మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు  నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే భూ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న డబ్బా బాబ్లీ(36)ని చింతలపాళెంవాసులు లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బహిర్భూమికని బయటకు వచ్చిన బాబ్లీని దుండగులు హతమార్చి పక్కనే ఉన్న చిన్న నీటి గుంతలో పడేశారు. బాబ్లీ సోదరుడు పరుశురామ్‌ ఫిర్యాదు మేరకు 30మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో అధికార పార్టీ వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమణయ్యయాదవ్‌ను ప్రథమ నిందితుడిగా పేర్కొన్నారు.

🙏 *ఏర్పేడు మండలం చింతలపాళెం ఎస్టీల భూములను అగ్రకులాల వారు అన్యాయంగా ఆక్రమించేవారిని అడ్డుకున్నoదుకు ఎస్టీ షికారి యువకుడైన డబ్బా. చినబాబు పై 11/8/20న దాడిచేసి నరికి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాo , ఈ రోజు 12/8/20 ఉదయం 11 గంటలకు తిరుపతి నుండి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పేడు వెళ్ళుతున్నాo అందరూ రండి జై భీం* .🙏 

ఏర్పేడు మండలం , చింతలపాళెం పంచాయితీ , మరాఠీపురం గ్రామంలో నివసించే ఎస్టీ షికారులైన 112 కుటుంబాలకు 1971లో 560 ఎకరాల భూమిని పంచి పట్టాలు ఇచ్చింది. ఈ భూమిపై కన్నుపడి భూమిని ఎలాగైనా లాక్కోవాలని చింతలపాళెం అగ్రకులాల వారు చుట్టుప్రక్కల అగ్రకులాల వారిని కలుపుకొని 14సంవత్సరాల నుండి అనేక విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి చట్టప్రకారం మాదేనని మాకు అగ్రకులాల నుండి విముక్తి కల్పించoడి అని ఎస్టీలు 2014లో హైకోర్టులో కేసుకూడా వేసినారు. ఐనా అగ్రకులాల వారి ప్రయత్నాలు , దాడులు ఆగలేదు. 2017లో దాదాపు 200 మంది అగ్రకులాల వారు ఎస్టీ కాలనీపై దాడిచేస్తే 25 మందికి దెబ్బలు తగిలి ఏర్పేడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టటం జరిగింది. ఎస్సీ ఎస్టీ చట్టప్రకారం కేసు కట్టినారు , పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించి అగ్రకులాల ముద్దాయిలను ఇప్పటికి  అరెస్టు చేయకపోవడం వలన చట్టంపై గౌరవం , భయం లేని అగ్రకులాల వారు చట్టాన్ని వారి చుట్టంగా మలుచుకోని ఈ రోజు గిరిజన యువకుడిని హత్యచేసినారు. ఈ క్రమంలోనే  ఎస్టీలు వారి భూమి హక్కుకోసం అమరావతిలో 2019లో ధర్నా చేసి CM జగన్ మోహన్ రెడ్డి గారిని , వివిధ అధికార్లును కలిసి న్యాయం చేయమని కోరటం జరిగింది , స్పందించిన ప్రభుత్వ అధికార యంత్రాంగం న్యాయప్రకారం ఈ భూమి ఎస్టీలదేనని ఎస్టీలకు అనుకూలంగా 13/1/2020 న చిత్తూరు కలెక్టరును ఆదేశించారు. ఈ ఆదేశాలను కలెక్టరుగారు MROకి పంపించారు. కాని MRO అగ్రకులాలకు అనుకూలంగా వ్యవహారిస్తూ , ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయకుండా ఇప్పటికి 8 నెలలు గడిసినా అగ్రకులాల వారికి నోటీసులు కూడా ఇవ్వకుండా ఈరోజు గిరిజన యువకుడైన చినబాబు హత్యకు పరోక్షంగా కారకులైనారు. ఐనా చట్టంపై నమ్మకంతో , మనోధైర్యoతో వారి భూమిపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అక్రమ బుద్దిగల , అక్రమ సంపాదనకు అలవాటు పడిన ,  నిజాయితీ లేని అగ్రకులాల వారు మరలా 9/8/2020 శనివారం దాదాపు 250 మంది అగ్రకులాల దుర్మార్గులు ఎస్టీలపై దాడి ప్రయత్నంలో భాగంగా చింతలపాళెం చెక్ పోస్టు వద్ద ఆటోలలో వస్తున్న ఎస్టీను ఆపి భయభ్రాంతుల్ని చేస్తూ దాడిచేసినారు. ఈ దాడిలో దాదాపు 23 మందికి దెబ్బలు తగిలి రక్తపు గాయాలతో పోలీసు స్టేషన్లో కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ కేసు కట్టిన పోలీసులు గిరిజనులు అనే లేక్కలేని తనం , పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహారించి , పరోక్షంగా ఈరోజు గిరిజన యువకుడైన చినబాబు హత్యకు కారణం . 9/8/2020 దాడిలో అగ్రకులాల వారు ఎస్టీను బెదిరింపు ఆదేశాలను జారీచేసినారు , 40 గంటలలోపు ఈ ఊరుని , ఈ భుమిని వదిలి వెళ్లాలి లెకపోతే మిమ్మల్ని చంపేస్తాము అన్నారు , అన్నవిధంగానే 40 గంటలకు ముందుగానే 11/8/2020 సాయంత్రం అతికిరాతకంగా ఎస్టీ షికారి గిరిజన డబ్బా.చినబాబును నరికి చంపడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు 12/8/2020 ఉదయం 11 గంటలకు తిరుపతి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులమైన మేము ఏర్పేడు బయలుదేరుతున్నాము. 


 పౌర హక్కులసంఘం బాధిత కుటంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని, నిందితులను ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆ భూములు అక్కడ నివసిస్తున్న షికారిలకే ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Comments