దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులను అరికట్టండి (తూర్పు గోదావరి జిల్లా)



3-8-20
కొత్తగా అధికారంలోకి వచ్చిన వై సి పి ప్రభుత్వం నాటి నుండి ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపై, ఆదివాసీలపై, మహిళలపై తీవ్రమైన అణచివేత, దాడులు జరుగుతున్నాయి. జీవనాధారం గా ఉన్న కొద్దిపాటి భూముల ను దళితులు, ఆదివాసీల నుండి లాగేసికొంటున్నారు. భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. అక్షర జ్ఞానం లేని సమాన్యుడినుండి,చదువుకున్న మేధావుల వరకూ అణగారిన సామాజిక వర్గాలకు చెందిన డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ అధికారులు వేధింపులకు,అత్యాచారాలకు గురి అవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న నాగరిక సమాజానికి ఇది గొడ్డలి పెట్టు, పోలీస్ అధికారుల అధికార దుర్వినియోగం ఎంతవరకు పోయిందంటే ఒక దళిత యువకుడికి పోలీసు స్టేషన్లోనే శిరోమండనం చేసే స్థితికి చేరింది.

 చీరాల లో కిరణ్ అనే దళిత యువకుడిని మాస్క్ లేదనే కారణంతో అక్కడ ఎస్సై తీవ్రంగా కొట్టి గాయపర్చి అతని మరణానికి కారణమయ్యాడు.కోరుకొండ పీఎస్ పరిధిలోని మధురపుడి లో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రామకృష్ణ అనే దళిత జడ్జి దాడి చేశారు.డాక్టర్ సుధాకర్, అనితరాణి పై తీవ్రమైన మానసిక భౌతిక దాడులు జరిగాయి.ఇవే కాక మరెన్నో దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటిని ప్రజాసంఘాలుగా,హక్కుల సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.దీనిపై అన్ని ప్రజా,దళిత బహుజన సంఘాలతో కలసి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ది.3-8-20 సోమవారం ఉదయం అమలాపురంలోని గడియారం స్తంభం వద్ద ధర్నా చేపట్టాము,అనంతరం ఆర్డీవో కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది.    
  
          
ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షులు అమలదాసు బాబురావు,ఓగురి బాలజీరావు,ప్రధాన కార్యదర్శి జిల్లెళ్ల మనోహర్, కోశాధికారి చెల్లింగి త్రిమూర్తులు, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, దళిత బహుజన స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి,సీపీఐ (ఎం.ఎల్) జనశక్తి కొండదుర్గారావు,సీపీఐ  నాయకులు కె. సత్తిబాబు,కులనిర్ములన పోరాట సమితి లాజర్,రైతుకూలీ సంఘం నాయకులు మచ్చ నాగయ్య, దీపాటి శివప్రసాద్,ఆర్టీసి యూనియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments