వరద బాధితులను ఆదుకోవాలి (పచ్చిమ గోదావరి జిల్లా)

 

 18 8 2020 కొవ్వూరు

గోదావరి నది వరద బాధితులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి *పౌరహక్కుల సంఘం డిమాండ్*

గోదావరి నది వరద ముంపునకు గురైన మద్దూరు గ్రామం లో వరద భాదితులు ని పరామర్శించిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది. నంబూరి. శ్రీమన్నారాయణ. గ్రామం వరదల సమయంలో ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిస్కారం గా గ్రామం చుట్టూ రాతి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి చూసించారు. వరద బాధితులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి .ఆహారం అందించాలని , సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి భాదితులు ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి నది వరద వలన ఆదివాసీ ప్రాంతాల అయినటువంటి ఖమ్మం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలోని ఆదివాసీలు తీవ్రమైన  ప్రమాదంలో పడ్డారని వారిని యుద్ధ ప్రాతిపదిక పైన ఆదుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కుటుంబానికి రెండు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు వరదల్లో చిక్కుకు పోయి అక్కడ కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వంట సామాగ్రి దుస్తులతో పాటు అయినటువంటి వెళ్ళను యుద్ధప్రాతిపదికన నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు రైతాంగానికి పూర్తి పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం కి విజ్ఞప్తి చేశారు ప్రజలకు కూడు గూడు నీడ కల్పించడం రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు ప్రకృతి వైపరీత్యాల నుండి పరిరక్షించాల్సిన ఎటువంటి బాధ్యత పరిపాలన చేసే వారిదే అని స్పష్టం చేశారు పాలకులు ప్రజా సంక్షేమం పట్ల మొద్దునిద్ర అవమానించడం సరికాదని వారికి శాశ్వత మైనటువంటి రక్షణ కల్పించాలని ఇటువంటి వరదల నుండి శాశ్వత నివారణ చేపట్టాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఆయన వెంట న్యాయవాదులు తొర్లపాటి. రవీంద్ర సుధాకర్ తదితరులు ఉన్నారు.

Comments