ప్రశాంత్ భూషణ్ కేసు మరో ధర్మాసనానికి

 

ప్రశాంత్ భూషణ్ కేసు మరో ధర్మాసనానికి ఎందుకు బదిలీ చేశారు?

    ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్విట్టర్ ట్వీట్, కామెంట్లు న్యాయమూర్తు లు, న్యాయ వ్యవస్థ పై కామెంట్లు కోర్టు ధిక్కరణ నేరం కిందకు రావని న్యాయ కోవిదులు, న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయ పరిశీలకులు, ప్రజాస్వామిక వాదులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఆయనే స్వయంగా ధర్మాసనం ముందు బాధ్యతాయుతంగా చేసిన పోస్టులే కానీ న్యాయవ్యవస్థపై నమ్మకం లేక కాదని న్యాయవ్యవస్థపై ప్రగాఢ మైనటువంటి విశ్వాసంతో ఉన్నాను అని ప్రకటించారు. నా ట్విట్టర్ లో కామెంట్లు కోర్టు ధిక్కారణ కిందకు రావని స్పష్టం చేశారు. 

అయినా త్రిసభ్య ధర్మాసనం ఏమీ పట్టించుకోకుండా ఆయన దోషి అని తేల్చింది. శిక్ష ఖరారు చేయడానికి తేదీ నిర్ణయించింది.దాదాపు  భారతదేశంలోని న్యాయవాదులు అంతా ఆయనకు అండగా నిలబడ్డారు.*బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి ప్రథమ పౌరుడు అయినటువంటి అటార్నీ జనరల్ సైతం ఆయనను శిక్షించ వద్దు* అని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనానికి విన్నవించారు.  అయినా ధర్మాసనం శిక్షించడానికి నిర్ణయించుకున్నది దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వెలువడినది.

 ప్రజాస్వామికవాదులు న్యాయవాదులు ఒకటై ముక్తకంఠంతో భావప్రకటన  స్వేచ్ఛను రక్షించుకుందాం! న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అండగా నిలబడదాం!! ఉయ్ స్టాండ్ విత్ ప్రశాంత్ భూషణ్ అని  ఉద్య మించారు. పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు, న్యాయవాద సంఘాలు, ప్రజా సంఘాలు వివిధ పార్టీలు గొంతెత్తి నినదించాయి.న్యాయవాద సమాజం తో పాటు, పౌర సమాజంలో వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకతను సుప్రీం న్యాయస్థానం గ్రహించింది అని అనిపిస్తుంది.

అందుకే తన వాదనను మార్చు కోవాలని సుప్రీం న్యాయస్థానం స్వయంగా ప్రశాంత్ భూషణ్ కి అవకాశం ఇచ్చింది. కానీ ఆయన మాత్రం నిబద్ధత కలిగిన న్యాయవాది గానే కాకుండా ఒక ప్రజాస్వామిక వాది గా తప్పు చేయలేదు. నేను దయ చూపండి అని అడగను, క్షమాపణ కోరను.న్యాయవ్యవస్థ పట్ల భాద్యత తోనే నేను కామెంట్ చేశాను.  న్యాయ వ్యవస్థ  ఔన్నత్యం కాపాడటం నాభాద్యత.తప్పు అని భావిస్తే నన్ను శిక్షించండి.శిక్షను స్వీకరిస్తాను అని త్రిసభ్య ధర్మాసనం కి విన్నవించారు.

    నేడు శిక్ష ఖరారు రోజు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు సుమోటో గా తీసుకునే అధికారాల పై  సందిగ్ధత పై పూర్తి స్థాయి విచారణ అవసరం అని భావించి కేసు ను వేరే బెంచ్ కి త్రిసభ్య ధర్మాసనం బద లాయించింది. జస్టిస్ బాబ్డే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయించే బెంచ్ లో ఈ కేసును సుదీర్ఘంగా విచారిస్తారు.   ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు,సందేహాలు న్యాయవాద పౌర సమాజం నుండి వస్తున్నాయి. 

కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం అన్ని కోణాల నుండి విచారించకుండా ఏకపక్షంగా ఎందుకు తీసుకున్నట్లు?  అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని సైతం కోరకుండా న్యాయ స్ధానానికి ఉన్న విశేష అధికారాలతో సుమోటోగా కేసు ని తీసుకుని దోషిగా ఎందుకు నిర్ధారించారు.?

సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద అంత త్వరితంగా  ఒకవైపు కరోనా covid-19 ఇబ్బందులు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోర్టుకు హాజరు కాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అత్యవసర కేసులను సైతం పక్కనపెట్టి ప్రశాంత్ భూషణ్ మీద కోర్టు ధిక్కరణ కేసు వేగిర పరచడందేనికి ?

ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట సెక్షన్ 66a రద్దు అయిందా లేదా ?స్వయానా సుప్రీం ధర్మాసనం మే భావప్రకటనా స్వేచ్ఛకు ఈ సెక్షన్ విఘాతం కలిగిస్తుందని రద్దు చేసినది. అలాంటప్పుడు సోషల్ మీడియాలో ఒక బాధ్యతాయుతమైన ట్విట్టర్ కామెంట్ పై సుమోటో గా కోర్టు దిక్కార కేసు ఏమిటి అనే సందేహం పౌరులకు కలుగుతుంది?

 ప్రజల్లో పలు సందేహాలు అనుమానాలు సహజంగా కలుగుతాయి. వాటిని కూడా కోర్టు ధిక్కరణ నేరం కింద తీసుకుంటారా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి? న్యాయ వ్యవస్థ కనుక అలా చేస్తే భావప్రకటన స్వేచ్ఛ,స్వాతంత్ర్యం,ప్రజాస్వామ్యానికి అర్ధం లేకుండా పోతుంది. ప్రజల్లో ఈ భయాలు కలగడం ప్రజాస్వామ్య సమాజం అనుకునే సమాజానికి ప్రమాదం.

 లేదా న్యాయ వ్యవస్థకి సమాజం లో మరింత విశ్వాసంకలగాలంటే  ప్రజల్లో ఉన్న ప్రశ్నలకు,సందేహాలకు సమాధానాన్ని ఉన్నత న్యాయస్థానం పౌర సమాజం ముందు ఉంచాలి. వేచి చూద్దాం ఉన్నత న్యాయస్థానం తీర్పు కోసం. సుమోటో కోర్టు ధిక్కార కేసు లలో అధికారాలు సందిగ్దత లో న్యాయస్థానం ఉన్నప్పుడు ప్రశాంత్ భూషణ్ పై సుమోటోగా తీసుకున్న కేసును ఉపసంహరించుకుని ఉంటే త్రిసభ్య ధర్మాసనం మరింత పారదర్శకంగా ఉందని ప్రజలు భావించేవారు.

సుమోటో గా తీసుకున్న కేసులలో     అధికారాలు సందిగ్దత ఉన్నప్పుడు కేసు ని ఉపసంహరించకుంటే సమాజం లో న్యాయ వ్యవస్థ పరపతి పెరిగేది. సుమోటో గా తీసుకున్న కోర్ట్ ధిక్కార కేసులలో అధికారాలు సందిగ్ధత నివారణ కోసం సుదీర్ఘ విచారణకు కేసు తో పాటు బదిలీ చేయడం ప్రశాంత్ భూషణ్ యొక్క స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను, భావప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది.

 అందుకే న్యాయకోవిదులు, న్యాయవాద సమాజం పౌర సమాజం లోని ప్రజాస్వామికవాదులు, మేధావులు త్రిసభ్య ధర్మాసనం యొక్క చర్య వలన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కి ఏమి జరుగుతుందో అని ఆందోళన, పలు  అనుమానాలతో సందేహాలతో కూడుకుని ఉన్నది. ఏది ఏమైనా భారతీయ పౌర సమాజం, న్యాయవాద సమాజం ప్రశాంత్ భూషణ్ భావ ప్రకటనా స్వేచ్ఛ ,స్వాతంత్రం లకు అండగా నిలబడుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుంకట్టి ఉద్యమిస్తుంది.

ఆ విశ్వాసంతో ప్రశాంత్ భూషణ్ లాంటి  అందరి మేధావులు, ప్రజాస్వామిక వాదులు పైన ఉన్న కేసులను ఉపసంహరించే వరకు రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా నిలబడి కాపాడుకుందాం. 

     

- నంబూరి. శ్రీమన్నారాయణ.

  Ap హైకోర్టు న్యాయవాది

   రాష్ర్ట ఉపాధ్యక్షులు 

పౌర హక్కుల సంఘం. ఆంధ్ర ప్రదేశ్.


Comments

Post a Comment