4 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఒకసారి ,YS రాజశేఖరరెడ్డి 19 సంవత్సరాల క్రితం మరోసారి SC,ST,BC లకు సాగుకు యోగ్యం కాని చౌడు,బీడు భూములు షుమారు 80 ఎకరాలు పట్టాలు మంజూరు చేయటం జరిగింది. పశువులు మేపుకోవటానికి ఆ భూములు ఉపయోగించుకున్నారు.కొద్దికాలం తర్వాత అ భూములు చేపల చేరువుల వారు తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చి ఆక్రమించారు.
ఆ సమయంలో ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం చేసిన ఆంధోళనలకు దిగివచ్చి , ఆ చేపల చేరువుల భూములు ఖాళీ చేయించి వాటికి తదుపరి YS రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన పిదప అదే పేదలకు తిరిగి పట్టాలు పంపిణీ చేశారు.అప్పటి నుండి అదే రైతులు ఉమ్మడిగా చేపల చేరువులను కొనసాగిస్తూ జీవిస్తున్నారు. వాటికి శిస్తులు కట్టటం,బ్యాంకు ఆఫ్ బరోడా,సొసైటీలో లోన్లు పొందుతూ వస్తున్నారు. ఇప్పటికీ అ లోన్లు పెండింగ్ లో ఉన్నాయి.2016 వరకు శిస్తు కడుతూ వస్తున్నారు.
ప్రస్తుతం అ భూములలో అక్కడక్కడ చేపల చేరువులు పోను మిగిలిన వాటిలో YS జగన్మోహన్ రెడ్డి ఇండ్లస్తలలా పంపిణీ చేస్తున్న స్తలానికి మెరక కొరకు మట్టిని తవ్వారు.అందరికీ ఉపయోగం అని రైతులు ఎవరూ అభ్యంతర పెట్టలేదు.ఇదే అదనుగా గామ స్తాయి YSR CP నాయకులు కొందరు ఈ భూమి ప్రభుత్వందని తమ అనుమతి లేకుండా SC,ST,BC లు ఎవరూ భూములలోకి వెళ్ళకూడదని ఇండ్ల కు వచ్చిమరి వార్నింగ్ ఇచ్చారు.నర్సరావుపేట MLA శ్రీనివాస్ రెడ్డి MRO ద్వారా "జగనన్న రైతు బరోసా"లబ్దిదారులకు అందకుండా చేశారు. పంచాయతీ ఆఫీసు నోటీసు బోర్డులో VRA,VRO లద్వారా అంటించారు. ఈ చర్య ద్వారా లబ్దిదారులు అ భూమి సాగు చేయటం లేదని నిరూపించటానికి, అయితే ఈ వార్తలో కొసమెరుపు ఎంటంటే లబ్దిదారులు,అక్రమణ దారులు,ధౌర్జన్యకారులు అందరూ పోలీసులతో తగాదా పట్టుకుని మరి YSR CPకి ఎగిరెగిరి ఓట్లేసిన వాళ్ళే.
1) SC,ST,BC ల భూములు వారికే చెందేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
2)రైతు భరోసా సొమ్మును వారివారి ఖాతాలో జమ అయ్యేట్లు చూడాలి.
3)అసైన్డ్ భూముల ఆక్రమణ దారులపై SC,ST act క్రింద కేసు నమోదు చేయాలి.
4)లబ్దిదారులు భూమిని సాగు చేసుకునేందుకు తగిన ఆర్దిక సాయం అందించాలి.
ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు లబ్ధిదారుల పోరాటానికి మద్దతుగా నిలవాలని పౌరహక్కుల సంఘం,దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమం కోరుతుంది.
---చిలుకా చంద్రశేఖర్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
పౌరహక్కుల సంఘం.(ఎ.పి)

Comments
Post a Comment