మల్లారం గ్రామం, మల్హర్రావు మండలం, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, SC మాల కులానికి చెందిన రేవెల్లి రాజబాబు హత్యపై పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటి, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం 14 జూలై 2020 న మల్లారం గ్రామంలో రేవెల్లి రాజబాబు తల్లిదండ్రులను ,భార్య కొడుకులను, బంధువులను, గ్రామస్తులను కలిసి సేకరించిన నిజ నిర్ధారణ వివరాలు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని మల్లారం గ్రామానికి రేవెళ్లి మల్లయ్య, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు అయిన రేవెళ్లి రాజబాబు (35సం౹౹లు) వృత్తి రీత్యా దినసరి కూలీ, అతనికి భార్య లత,ఇద్దరు పిల్లలు అశ్విన్(10),రిషి(7)లు ఉన్నారు.రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద మన్నెపు కులానికి చెందిన కుటుంబం.తేది 06/07/2020 సోమవారం రోజున,ఎప్పటిలాగే పనికి పోయి వచ్చిన రాజబాబు ఉదయం 9 గంటలకు ఇంటికి వచ్చి తన భార్య లతను అన్నం పెట్టమని అడిగాడు,అప్పటికి ఇంకా అన్నం వండలేదని భార్య లత రాజబాబు కి చెప్పడటంతో ఆకలితో ఉన్న రాజబాబు కోపంతో భార్య ను తిట్టాడు.వారిద్దరూ గొడవ పడుతున్న సమయంలో రాజబాబు ఇంటికి సమీపంలో ఉండే దేవసాని శ్రీనివాస్ అనే స్థానిక వార్డు సభ్యుడు(TRS పార్టీ) అందరిని భయ బ్రాంతులకు గురిచేస్తూ బతికే వ్యక్తి (పద్మశాలి కులస్తుడు)రాజబాబు తననే తిడుతున్నాడు అనుకుని రాజబాబు ఇంటికి పచ్చిగుతుప (లావుగా ఉండే కర్ర) తీసుకుని వెనకాల నుండి వచ్చి రాజబాబు మెడ మీద బలంగా కొట్టడంతో అక్కడిక్కడే రాజబాబు స్పృహతప్పి పడిపోయాడు.
అక్కడే ఉన్న రాజబాబు భార్య లత,తనపిల్లలతో కలిసి శ్రీనివాస్ కాళ్ళమీద పడి తన భర్తని ఏం చేయవద్దని,ఎంత వేడుకున్నా కనికరం లేకుండా కొడుతూ,మన్నెపు లంజకోడకల్లారా నన్నే తిడతావురా, ఓ మన్నెపు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ, తన బావమరుదులు అయిన కుసుమ శేఖర్, కుసుమ సంపత్ లను అక్కడికి పిలిపించుకుని స్పృహ తప్పి పడిపోయిన రాజబాబును తమకు,క్షమాపణ చెప్పాలని,కాళ్ళు చేతులు విరిచేసి మోటార్ సైకిల్ మీద ఈడ్చుకుంటూ, సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న మల్లారం గ్రామ పంచాయతీ వద్దకు తీసుకెళ్లినాడు.
అక్కడే ఉన్న రాజబాబు భార్య లత,తనపిల్లలతో కలిసి శ్రీనివాస్ కాళ్ళమీద పడి తన భర్తని ఏం చేయవద్దని,ఎంత వేడుకున్నా కనికరం లేకుండా కొడుతూ,మన్నెపు లంజకోడకల్లారా నన్నే తిడతావురా, ఓ మన్నెపు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ, తన బావమరుదులు అయిన కుసుమ శేఖర్, కుసుమ సంపత్ లను అక్కడికి పిలిపించుకుని స్పృహ తప్పి పడిపోయిన రాజబాబును తమకు,క్షమాపణ చెప్పాలని,కాళ్ళు చేతులు విరిచేసి మోటార్ సైకిల్ మీద ఈడ్చుకుంటూ, సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న మల్లారం గ్రామ పంచాయతీ వద్దకు తీసుకెళ్లినాడు.
ఆ సమయంలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామ ప్రజల వేరొక పంచాయతీ నడుస్తున్నది సమయంలో,అప్పుడు అక్కడ సుమారు 300 మంది గ్రామస్థులు,వార్డ్ మెంబర్లు ఉన్నారు. గ్రామస్తులందరూ, ఊరి వార్డు మెంబర్లు,చూస్తుండగానే,మల్లారం గ్రామ నడిబొడ్డున, ఉన్న గ్రామ పంచాయతీ ముందు రోడ్డు మీద రెవెళ్లి రాజబాబును కిందా పడేసి దారుణంగా కొట్టారు.సొమ్మసిల్లి పడిపోయిన రాజబాబును స్పృహ లేనట్టు నటిస్తున్నాడు అంటూ కాళ్లతో తన్నారు,50 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే ఈరోజు నిన్ను చంపి జైలుకు పోతాను,అంటూ గ్రామస్తులను,రాజబాబు భార్య పిల్లల్ని హెచ్చరిస్తూ మృగంలా ప్రవర్తించాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మల్లారం గ్రామ సర్పంచ్ గోనె పద్మ భర్త, Ex జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు అక్కడే ఉండి చోద్యం చూస్తూ ఉన్నాడు.
ఒక ప్రజాప్రతినిధిగా,కనీసం ఒక సామాన్య మానవునిగా అయిన స్పందించకపోవటం ఎంతటి అమానవీయం.కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న రాజబాబు తన పెద్ద కొడుకుని పిలిచి తల మీద చేయి వేసి నిమిరి కొడుకును కళ్లారా చూసుకున్నాడు.పరిస్థితి విషమంగా ఉందని గమనించిన స్థానికులు రాజాబాబు చనిపోయేలా ఉన్నాడని చెప్పడంతో ఆసుపత్రికి తరలించాలని అక్కడే ఉన్న ట్రాక్టర్ ట్రాలీలో బియ్యపు మూటలు విసిరినట్లు,కిందకి పైకి విసిరేసారు.
ఒక ప్రజాప్రతినిధిగా,కనీసం ఒక సామాన్య మానవునిగా అయిన స్పందించకపోవటం ఎంతటి అమానవీయం.కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న రాజబాబు తన పెద్ద కొడుకుని పిలిచి తల మీద చేయి వేసి నిమిరి కొడుకును కళ్లారా చూసుకున్నాడు.పరిస్థితి విషమంగా ఉందని గమనించిన స్థానికులు రాజాబాబు చనిపోయేలా ఉన్నాడని చెప్పడంతో ఆసుపత్రికి తరలించాలని అక్కడే ఉన్న ట్రాక్టర్ ట్రాలీలో బియ్యపు మూటలు విసిరినట్లు,కిందకి పైకి విసిరేసారు.
ఎంతటి హేయమైన చర్య ఇది,ఒక దళితుని పై ఇంతటి కుల అహంకారమా,ఇంత క్రూరత్వమా,భార్య, పిల్లలు 300 మంది జనాల ముందర నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తిని పట్టుకుని బంతిలాగా ఆడుకుంటే ఒక్కరు కూడా అపలేకపోయారు అంటే ,వాడు ఎంత బలుపెక్కి ఉన్నాడో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.రాజబాబు పెద్దకొడుకు SI గారికి,ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు ఆసుపత్రికి వచ్చారు.
మల్లారం నుండి రాజాబాబు ను తాడిచెర్ల ఆసుపత్రికి తరలించారు,రాజాబాబు పరిస్థితి విషమంగా ఉందని అక్కడ నుండి మంథని కి,అక్కడి నుండి అంబులెన్స్ లో కరీంనగర్ కి,అక్కడా కాదని చెప్పడటం తో వరంగల్ MGM కి తరలించి,ఎక్స్ రే తీసి,స్కానింగ్ చేయగా తలకి బలమైన దెబ్బలు తగిలి నరాలు పగిలిపోయాయి,బ్రతకడం కష్టం అని ,ఆపరేషన్ చేస్తే ఏదైనా ఛాన్స్ ఉంటే బ్రతకొచ్చు అని చెప్పి ఆపరేషన్ చేసారు,అయినా కూడా తీవ్రమైన గాయాలు అయ్యి,ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో రాజబాబు మరుసటిరోజు 7 జులై,2020 మధ్యాహ్నం 2గంటలకు చనిపోయాడు.సాయంత్రం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో రాజబాబు భార్య లత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 8,జులై,2020 ఉదయం MGM హాస్పిటల్ లో పోస్టుమార్టం అనంతరం శవాన్ని మల్లారం తీసుకువచ్చి దేవసాని శ్రీనివాస్ ఇంటి ముందు వేసి నిరసన చేస్తామనుకుంటే 30 మంది పోలీసులు దేవసాని శ్రీనివాస్ ఇంటికి కాపాలగా ఉందడి అడ్డుకున్నారు. తీవ్ర మనోవేదనంతో రాజబాబు కుటుంబీకులు ,ఆ వాడలోనే ఉన్న దేవసాని బావమరుదులు కుసుమ శేఖర్, కుసుమ సంపత్ ఇంటి ముందు రాజాబాబు శవాన్ని వేసి రాజాబాబు కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో ధర్నా చేశారు.కలెక్టర్ మరియు పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత,రాజబాబు బంధువులు బుధవారం(8-7-2020) రాత్రి 01:00 am కి రాజబాబుకు అంత్యక్రియలు నిర్వహించారు.
డిమాండ్స్
1. దేవ సాని శ్రీనివాస్ ఉద్దేశ్యపూర్వకంగా తన బావమరుదులు కుసుమ శేఖర్, కుసుమ సంపత్ లతో రేవల్లి రాజబాబు ను తీవ్రంగా కొట్టడం వలన చనిపోయినాడు. దేవ సాని శ్రీనివాస్ కు అండగా ఉంటున్న TRS గ్రామ సర్పంచ్ గోనె పద్మ భర్త అయిన మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు తోనే ఈ దాడి జరిగింది. కావున దేవసానిశ్రీనివాస్ ,కుసుమ శేఖర్, కుసుమ సంపత్ మరియు గోనె శ్రీనివాసరావు లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ipc 302 కేసు నమోదు చేయాలి.
2.మరణించిన రేవల్లి రాజబాబు కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి .కుటుంబంలో ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ, ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలి.
3 ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని జిల్లా కలెక్టర్/ ఆర్ డి ఓ /ఎమ్మార్వో లు ఎవ్వరు సందర్శించలేదు వారికి అండగా నిలబడలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమే .హత్యలు దాడులకు గురైన రాజబాబు కుటుంబాన్ని పై అధికారులు పరామర్శించి ఆదుకోవాలి.
4. టిఆర్ఎస్ కార్యకర్తలు ఎక్స్ జెడ్ పి టి సి గోనె శ్రీనివాసరావు ,పెద్దపెల్లి ZP చైర్మన్ TRS పుట్ట మధుల వర్గం ఈ దాడులు, హత్యల పరంపరలో కొనసాగిస్తున్నారు.గతంలోలాగా భూస్వామ్య పెత్తందార్లు వ్యవహరిస్తున్నట్టుగా దాడులు హత్యలు సాగిస్తున్నారు. ఈ పరంపరను మానుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.KCR తక్షణమే TRS కార్యకర్తలు చేస్తున్న హత్యాలను ఆపాలి.
1.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.ఏనుగు మల్లారెడ్డి ,ప్రధాన కార్యదర్శి ,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
3.పోగుల రాజేశం, ఈసీ మెంబర్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
4.మార్వాడి సుదర్శన్ ప్రధాన కార్యదర్శి దళిత లిబరేషన్ ఫ్రంట్.
మల్లారం గ్రామం
మల్హర్ రావు మండలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
3:00 సాయంత్రం,మంగళవారం.
14 జూలై 2020.
Comments
Post a Comment