కరోనా కాలంలో జీవించే హక్కు కావాలి




కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే 


కంటికి కనిపించని కరోనా వైరస్ కట్టడిలో ప్రజలు ఆచరిస్తున్న పద్ధతిని అభినందించాల్సిందే. కానీ ఆ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను నిర్వర్తించడం లేదు. వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు చేయడం అవసరం. ఆ అవసరాన్ని ప్రభుత్వం లాభనష్టాల కొలతల్లో చూసి పరీక్షలు నిర్వహించడం లేదు.కరోనా పరీక్షలను ప్రభుత్వం బాధ్యతగా చేయించకుండా ఒక వైపు నిర్లక్షంగా వ్యవహరిస్తూ, ఇంకోవైపు ప్రజలు విధిలేని పరిస్థితిలో తమకు తాముగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకుంటామంటే కూడా ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదు. చివరికి కరోనాతో మరణించిన వాళ్ల శవాలను బంధువులకు తెలియజెప్పడం, ఇవ్వడం పారదర్శకంగా మెదలడం లేదు.

ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గ వైఖరి. అసహజ మరణముకైనా ఎన్కౌంటర్ హత్యల కైనా ప్రభుత్వం బాధ్యత పడాలని ఐదు దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘం ఉద్యమిస్తూనే ఉంది.కరోనా మరణాల కైనా ప్రభుత్వమే బాధ్యత పడాల్సి ఉంది. చాలామంది ప్రజలు కరోనా ఆంక్షల ఉల్లంఘన చేసినారని పోలీస్ లాఠీ దెబ్బలకు గురయ్యారు.తీవ్ర మైనహింసలకు బలయ్యారు. లాఠీలతో దాడి చేయించగలవు కానీ, కరోనా నిర్ధారణ పరీక్షలకు ఎందుకు సుముఖంగా లేదని చివరికి న్యాయస్థానము చెప్పినా పాటించని ప్రభుత్వం,ప్రజల జీవించే హక్కు పట్ల ఎంత బాధ్యతగా ఉందో మనం నిర్ణయించుకోవచ్చు. పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకుని, నియంత్రణ చేసుకునే అవకాశం ప్రజలకు లేకుండా ఎందుకు చేస్తున్నది ప్రభుత్వం! కరోనాకు ప్రజలు బలి కావాలని ప్రభుత్వం భావిస్తోందా అనే అనుమానం కూడా కలుగుతోంది!

బ్రిటన్ ప్రధాని ,చత్తీస్గడ్ హై కోర్టు జడ్జ్ త్రిపాఠీ లకు కూడా కరోనా వచ్చింది. ఎవ్వరికి మినహాయింపు లేని ఈ పరిస్థితుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు అందుబాటు లోకి లేకుండా చేయడం,కనీసం ప్రైవేట్ లాబ్ లలోనైనా పరీక్షలు ఉచితంగా ప్రభుత్వం చేయించే అవకాశం లేకుండా చేయడం *ప్రజల జీవించే హక్కును కరోనాకు బలి చేయడమే అవుతుంది*. ఈ చర్య ప్రభుత్వం కుట్రగా అర్థమవుతోంది. విద్య హక్కు ఆరోగ్య హక్కు ఉద్యోగ హక్కులు ఏమి అమలు పరచని స్థితిలో ప్రభుత్వం ఉంది. సమాజంలో విలువలతో నిలబడాల్సిన రంగా లన్నిటిని వ్యాపార రంగంగా మార్చి చివరికి ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆర్డినెన్సు తెచ్చింది. ప్రభుత్వ బాధ్యత రాహిత్యాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఘర్హిస్తున్నది. *ప్రజల ఆరోగ్య హక్కును* కాపాడడం కోసమైన ప్రభుత్వం కరోనా రోగనిర్ధారణ పరీక్షలు అందరికి వెంటనే చేపట్టాలి.

డిమాండ్స్

1. కరోనా రోగ నిర్ధారణ పరీక్షలు వెంటనే ప్రభుత్వం చేపట్టాలి.

2. ప్రభుత్వానికి చేతకాకపోతే కనీసం ప్రైవేట్ లాబ్ లలో ఉచితంగా రోగ నిర్ధారణకు అవకాశం ఇవ్వాలి.


Comments