వికాస్ దూబే ది ఎన్కౌంటర్ కాదు అది ప్రభుత్య హత్యే
యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది ఎన్కౌంటర్ కాదు అది ప్రభుత్య హత్యే. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయాలని ప్రజలు,చాలామంది ప్రజాస్వామిక వాదులు , కోరుకుంటారు. కానీ అధికార పార్టీలో ఉన్న రాజకీయ నేతలు గ్యాంగ్ స్టర్ లను పెంచిపోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనయీమ్ లాంటి వాళ్లను ఉపయోగించుకుని అధికార పార్టీ వాళ్ళు, వాళ్లకు అడ్డొచ్చిన ఉద్యమకారులను,తాము చేయాల్సిన అసాంఘిక కార్యక్రమాలను చేయడానికి లేదా హత్యలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఆ కోవలోకి చెందిన వాడే యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే. యూపీలోని అధికార పార్టీ నేతలువికాస్ దూబే నీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత నయీమ్ లాగా ఈరోజు 10జులై,2020 ఉదయాన్నే హత్య చేసింది. ఈహత్యకు ఎన్కౌంటర్ అనే రంగు పులుముతుంది.
అసలు ఇది ఎన్కౌంటర్ కాదు ప్రభుత్వం కావాలని చేసిన హత్య. తెలంగాణ రాష్ట్రంలో మై హోమ్ అధినేత రామేశ్వరరావు ను ఎలాగైతే నయీమ్ హెచ్చరించి బెదిరించినాడో గత ప్రభుత్వాల నుండి పెంచి పోషించబడ్డ నయీమ్ తమ ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నాడని భావించిన నేపథ్యంలో అధికారTRS పార్టీ KCR కనుసన్నలలో నయీమ్ ను హత్య చేసి,ఆ హత్యను ఎన్ కౌంటర్ గా కట్టుకథ అల్లినారు.షాదనగర్ నయీమ్ఇంటిలో దొరికిన డబ్బులను లెక్కబెట్టడానికి 6 కౌంటింగ్ మెషిన్ లు మూడు రోజులు పనిచేసాయంటే, అతని దగ్గర ఎంత డబ్బుఉందొ (దోసాడో) అంతుచిక్కలేదు. లెక్కలేనన్ని భూకబ్జాలు.నయీమ్ హత్య తర్వాత బాధితుల సంఘం ఏర్పడ్డది. అధికారులతో ,పోలీసుల తో,అధికార TRS పార్టీ,కాంగ్రెస్, TDP పార్టీ వాళ్ళతో నయీమ్ సంబంధాలు బయటికివచ్చినయి.కానీ ఇవ్వన్నీ ఏవి వెలుగులోకి రాకుండా నయీమ్ కేసును మూసివేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే వికాస్ దూబే కూడా UP రాష్ట్రంలో చాలా మంది భూఆక్రమనలు చేసిండు. చాలామందిని హత్యలు చేసిండు.
తానుఏదైతే దౌర్జన్యాలు నేర్చుకున్నాడో ప్రభుత్వాలనుండి ఆ అక్రమంలోని తనకు అడ్డులేదనుకొని గత వారం DSP స్థాయితోపాటు 8 మంది UP పోలీసులను కాల్చి చంపిండు వికాస్ దూబే.ఈ ఘటనకు చరమాంకం పాడాలని భావించిన UP ప్రభుత్వం దూబే ను సజీవంగా పట్టుకొని ఎన్కౌంటర్లో చనిపోయినాడని కట్టుకథ అల్లింది ప్రభుత్వం నిజానికి పోలీసులు చట్టానికి లోబడి పనిచేస్తే, న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగానికి కట్టుబడి శిక్షలు అమలు చేయాలి.కానీ ప్రభుత్వాలు ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతులను,నయీమ్ మరియు వికాస్ దూబే లాంటి గ్యాంగ్ స్టర్ లతో పాటు తమకు ఇబ్బంది అనుకున్స్ వాళ్ళందరిని చట్టవ్యతిరేకమైన హత్యలతో చంపుతున్నారు. జీవించే హక్కును హరించే ప్రక్రియ మన రాజ్యాంగంలో లేదు అయినా కూడా మన ప్రభుత్వాలు ఏండ్ల తరబడి ఎన్కౌంటర్లో పేరున ఆదివాసీ ప్రాంతాల్లో, మధ్య భారతం, ఈశాన్య రాష్ట్రలలతో పాటు నిరంతం కొనసాగిస్తున్నారు ఈ బూటకపు ఎన్కౌంటర్లు. ఎన్కౌంటర్ల లో పాల్గొన్న పోలీసులపై IPC 302 కేసును నమోదు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో APCLC పక్షాన కన్నాబిరాన్, బాలగోపాల్ లాంటి మేధావుల వాదనతో ఎకీభవించిన 5 గురు సభ్యుల హైకోర్టుబెంచ్ తీర్పును సుప్రీంకోర్టు లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ల సంఘం తరఫున(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో) పిటిషన్ ద్వారా అడ్డుకున్నారు.
ఎన్కౌంటర్ల పై సుప్రీంకోర్టు , PUCL జడ్జి మెంట్లో ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేనందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అప్పటిహైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని,దేశవ్యాప్తంగా, హక్కుల సంఘాల కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులు నిరంతరం పోరాడుతున్నారు, APCLC పిటిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వాలు. ఈ వికాస్ దూబే ఎన్కౌంటర్ హత్య లో పాల్గొన్నపోలీసులపై, (APCLC పిటిషన్ పై హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు) IPC 302 కేసు నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది..
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ....
పౌర హక్కుల సంఘం తెలంగాణ.
సాయంత్రం 5:30
10జులై,2020
హైదరాబాద్.
Comments
Post a Comment