దళితునికి శిరోముండనం చేసిన ఎస్ఐను విధుల నుండి తొలగించాలి (తూర్పు గోదావరి జిల్లా)


Suspension of two constables along with in-charge SI In AP - Sakshi


*నిజనిర్ధారణ నివేదిక*
                       
                       రాజమహేంద్రవరం
ది.25-07-20

*దళిత యువకుడు శిరోమండ నం నాగరిక సమాజం లో అనాగరిక చర్య*

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మునికూడలి గ్రామంలో ది. 18-07-20 రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో బైక్ పై వెళుతున్న యువకుడు తనకు తానుగా ప్రమాద వశాత్తు రోడ్డుమీద పడి కాలికి గాయమైంది. గాయపడిన యువకుడిని మునికూడలి గ్రామ దళిత యువకులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది.అదే సమయంలో కారులో ఇటువైపు వస్తున్న ఆ గ్రామానికి చెందిన వై.ఎస్.ఆర్.సి. పి. నేత స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అయిన కవల కృష్ణమూర్తి హారన్ కొడుతుంటే హారన్ కొట్టొద్దు కాసేపు ఆగమని దళిత యువకులు విన్నవించారు. కవల కృష్ణమూర్తి వారి మాట వినకుండా అదేపనిగా హారన్ మ్రోగించడం తో ఇందుగుమిల్లి ప్రసాద్ అనే యువకుడు ఆ కారు ప్రక్కకు వెళ్ళాడు .ఆ సమయంలో కవల కృష్ణమూర్తి  కారు డోర్ తీయడంతో  ప్రసాద్ కు గాయమైంది. దీనిపై ఆగ్రహించిన ప్రసాద్ అద్దాముల్ పై గుద్దాడు. కవల కృష్ణమూర్తి తన బంధువులు కు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో ఆయన బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఇరుపక్షాలు వారు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల పెద్దల జోక్యంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

కవల కృష్ణమూర్తి మరుసటిరోజు సీతానగరం పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసారు. పిర్యాదు విషయం తెలుసుకున్న దళితులు, మహిళలు కవల కృష్ణమూర్తి మరియు ఆతని సోదరుడు దుర్గం ను కలిసి మావాడు తప్పు చేసి ఉంటే క్షమాపణ కొరతాడాని కేసు పెట్టవద్దని బ్రతిమలాడారు.అది కుదరదని ప్రసాద్ ఊరి లోఎలా తిరుగుతాడో చూస్తాను అన్నారు. మామీదే తిరగబడతాడా వీడి అంతు చూస్తాను అని కృష్ణమూర్తి అన్నాడని కమీటీ కి తెలిపారు.

సోమవారం  20-07-20 మధ్యాహ్నం 1గం. సమయం లో సీతానగరం పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఎస్.ఐ. ఫీరోజ్ షా తన సిబ్బంది తో మునికూడలి గ్రామంలో ని ఇందుగుమిల్లి ప్రసాద్ ఇంటికి వెళ్లి బాదు కొంటు పోలీస్ స్టేషన్ కు లాక్కుని వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో ఇంచార్జ్ ఎస్సై ఫీరోజ్ షా, హెడ్ కానిస్టేబుల్ అప్పారావు ,కానిస్టేబుల్ రామచంద్రరావు తదితరులు ఇందుగుమిల్లి ప్రసాదు ను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారు. సాయంత్రం  5గం. లకు క్షురకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు పర్యవేక్షణ లో ప్రసాద్ కు శిరోమందనం చేయించారు. రాత్రిసమయంలోపోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రసాద్ తల్లి తన కుమారుడు గాయాలతో, శిరోమండ నంతో ఉండటం చూసి గుండెలు బాదుకొంటు జరిగిన సంఘటన బంధువులకు సమాచారం అందించింది. మంగళవారం ది.21-07-20 తేదీ ఉదయం పోలీసులు ఇందుగుమిల్లి ప్రసాద్ ను తల్లి కి,బంధువులకు అప్పగించారు.గాయాలతో నడవలేని స్థితిలో,శిరోమందనం తో ఉన్న ప్రసాద్ ను రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకోస్తే ఈ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ మార్చడం అయిందని, ఏదైనా ప్రయివేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లి జాయిన్ చెయ్యండి అని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఇందుగుమిల్లి ప్రసాద్
బొల్లినేని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. దళిత సంఘాలు,ప్రజాసంఘాల ఆందోళన మేరకు పోలీసులు ఇంచార్జ్ ఎస్సై ఫిరోజ్ షా ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అసలైన దోషులైన హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ రామచంద్రరావు ల పై కేసు నమోదు చేయలేదు.సీతానగరం పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నెం.25/2020 తేదీ 21-07-2020 U/S. 324, 323,506,R/W 34,I P C 3(1)(e),3(2)(va)S C., S T., POA act2016.

నిందితులు:1)కవల కృష్ణమూర్తి,2)కవల దుర్గం, 3)కవల వీరబాబు,4)కవల నాగేంద్ర 5)అడపా పుష్కరం,6)అడపా భాస్కరం మరియు కొంతమంది,7)ఇంచార్జ్ ఎస్సై ఫిరోజ్ షా మొదలగువారు.


     అధికార పార్టీ ప్రతినిధులు, అధికారులు భాదితుని వద్దకు పరామర్శించడానికి వస్తున్నారని,బాధ్యతగల ప్రభుత్వ అధికారులు నిందితులను అరెస్టు చూస్తామని మాత్రం చెప్పడం లేదని కమీటీ కి ప్రసాద్ తెలియ జేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కవల కృష్ణమూర్తి వై ఎస్సార్ సిపి పార్టీ కి చెందిన నాయకుడు.ఇసుక మాఫియా ఇచ్చిన ధైర్యంతోనే సీతానగరం ఇంచార్జ్ ఎస్సై ఫిరోజ్ షా ,హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ రామచంద్రరావు అత్యుత్సాహం తో తీవ్ర చిత్రహింసలు పెట్టి దళిత యువకుని శిరోమందనం చేశారు.స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు, ఎస్సార్ సిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు నిందితులను అరెస్టు చేయించడంలో విఫలమైయ్యారు. ప్రజా ప్రతినిధులు ద్వారా ఇప్పటికైనా  శిరోమందనం సంఘటన ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిందితులను అరెస్టు చేయించి మీకు ఓట్లు వేసి మిమ్ములను గెలిపించిన దళితుల పట్ల చిత్త శుద్దిని నిరూపించుకోవాలి.

పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు ఊడిగం చేయకుండా పౌరులకు రక్షణగా ఉండి ప్రజల హక్కులను కాపాడండి.
డిమాండ్స్:-
1)నిందితులను ఎటువంటి జాప్యము లేకుండా అరెస్టు చేసి పోలీసు అధికారులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
2)ఇటువంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండ అధికారులు చర్యలు చేపట్టాలి.
3)తోట త్రిమూర్తులు శిరోమందనం కేసులా కాలయాపన చెయ్యకుండా అధికారులు చర్యలు తీసుకొని నిందితులను త్వరితగతిన శిక్షించేవిధంగా చర్యలు చేపట్టాలి.
4)శిరోమందనం భాదితుడైన ప్రసాద్ కు చట్టప్రకారం రావాల్సిన రాయితీలు,పునరావాసం అధికారులు కల్పించాలి.
5)హెడ్ కానిస్టేబుల్ అప్పారావు,కానిస్టేబుల్ రామచంద్రరావు ల పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి.
6)మునికూడలి గ్రామంలో భవిష్యత్తులో ఏవిధమైన ఘర్షణలు కు తావులేకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి.
*ఈ నిజ నిర్ధారణ లో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. చిట్టిబాబు, తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు అమలదాసు బాబురావు, సూర్యం, సత్యనారాయణ, అడ్వొకేట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.*

      *వి. చిట్టిబాబు*
*పౌరహక్కుల సంఘం*
   *ఆంధ్రప్రదేశ్*
*(CIVIL LEBERTIES COMMITTEE)*


Comments